-
-
-
-
-
-
Piradousi
₹80.00సుకవి
పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సృష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా సృజించినవాడు……………
-
-
-
Maa Kathalu 2022 By Ch Sivarama Prasad
₹99.00అనామిక
– గడ్డం దేవీప్రసాద్
హఠాత్తుగా పెద్ద వర్షం కురవడంతో రోడ్డుపై నడుస్తున్న నేను పరుగెత్తి ఓఇంటి తలుపు దగ్గరగా వెళ్ళి నిలుచున్నాను. తల తడవలేదు కానీ వర్షం ఏటవాలుగా పడుతున్నప్పుడు ప్యాంటు తడుస్తోంది. పూణేలో ట్రైనింగ్ కోసం వచ్చిన నేను మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడంతో ఇక్కడి ఒక పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న గౌతమ్ అనే మిత్రునితో కలిసి అతని బండిపైన తిరుగుతూ ఓషో ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలస్ చూసి దగ్గుషేత్ గణేష్ మందిరానికి వచ్చాము. ఇంతలో గౌతమ్కు వాళ్ళ ఎస్.ఐ. నుండి ఫోన్ వస్తే త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు.
“అందరి ఆ! భారీ బారిష్ హెరాహీ హై ఇస్తే అభి హిట్ న హెూనే దో” లోపలికి రండి. వర్షం ఎక్కువగా వస్తోంది. ఇది ఇప్పట్లో తగ్గదు) అంటూ ఒకామె తలుపు తీసి లోనికి రమ్మని చెప్పింది. నేను తప్పనిసరి పరిస్థితిలో లోనికి వెళ్ళాను………….
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Nalla Pillana Grovi
₹120.00సాహిత్య భ్రమరం
ఆ మధ్య విశాఖపట్టణంలో జరిగిన ఒక బాలసాహిత్యం వర్క్ షాపుకి వెళ్ళినప్పుడు వెంకట నారాయణ పరిచయమయ్యాడు. పరిచయమంటే మామూలుగా కుశలప్రశ్నలు అడగడమో, తీరిగ్గా, నింపాదిగా విశేషాలు తెలుసుకోవడమో కాదు, ఆ ఉన్న కొద్ది సేపట్లోనూ నాతో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలనీ, సాహిత్యం గురించి తనకి ఉన్న అనేక అభిప్రాయాలూ, ప్రశ్నలూ, ఆశ్చర్యార్థకాలూ అన్నీ అక్కడికక్కడే అప్పటికప్పుడే నాతో పంచుకోవాలనీ, ఓ! చెప్పలేనంత ఆతృత, దాహం కనిపించింది అతడిలో.
సరిగ్గా నా రాజమండ్రి రోజుల్లో నేనట్లానే ఉండేవాణ్ణి. ఎవరేనా కవి, రచయిత,………………….
-
-
-
Gelupu Sare. . . Batakadam Elaa?
₹120.00‘గెలుపు సరే బతకడం ఎలా’ అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్నా రచనలు, ఉద్భోదిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్దతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్దతి ‘ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు’ అంటూనే ఎలా ఉండకూడదో, అలా ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటోందని కనిపించని వ్యంగ్యంతో రాసిన రచన ఇది. ఏ ప్రక్రియకీ వొంగనిది.
– కె. ఎన్. వై. పతంజలి
-
K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili
₹120.00K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili
-
-
-
-
-
Mandu Chupu
₹125.00ప్రస్తావన
గోదావరి గలగలా ప్రవహిస్తోంది. గోల్డ్క్ సిగరెట్ కాలుస్తున్న కవి కుమారునికి ఆ పొగ ఘుమఘుమగానే వున్నట్టుంది. గోదావరి గట్టు గచ్చు చప్టా మీద ఏడెనిమిదిమంది మిత్రులు కూర్చున్నారు. వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలుతోంది. వాళ్లు గోదావరి వంక చూస్తున్నారను కుంటే నీళ్లల్లో మందు పోసినట్టే. వాళ్ల కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి. ఓ పావు గంట గడిచింది.
‘శ్రీశ్రీ ఓ సినిమాలో అన్నట్టు… ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు’ అన్నాడు. కొటేషన్రావు. (అతని అసలు పేరు కోటేశ్వరరావు)…….. -
-
Nenevvaru? Sriramaniyam
₹130.00డా. ముదిగొండ వీరభద్రయ్య ఇంతకుముందు 60 సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను 2007 లో శ్రీ రమణాశ్రమంలో ఉండి రచించారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జ్ఞాన మననము, ఆత్మ శాస్త్రము, శ్రీ సత్యసాయి బోధనలు నేపథ్యంలో ‘అద్వైత జ్ఞాన ప్రకాశిక’ అన్న తత్త్వగ్రంథాలను (అన్నింటిని సత్యసాయి బుక్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ప్రచురించింది), భగవాన్ శ్రీ సత్యసాయి జీవిత మకరందం (బ్రౌన్ అకాడమీ ప్రచరణ) గ్రంథాన్నీ రచించారు.
ఇప్పుడు ఈ “నేనెవరు – శ్రీ రమణీయం” అన్న గ్రంథాన్ని రచించి భగవాన్ రమణుల మార్గాన్ని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక కోసం రచించినవి.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్ష పదవి నుంచి 2004 లో విరమించాక ప్రస్తుతం వీరు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో గౌరవ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు.
– ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
-
-
-
-
-
రోబో బుద్ధ
₹140.00రాణి శివశంకరశర్మ కథలు
ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు. -
Life of Swami Vivekananda Set 2 Vols (Telugu)
₹150.00Original price was: ₹150.00.₹140.00Current price is: ₹140.00. -
Sanchari
₹140.00గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Mr Mohamatam
₹150.00మొహమాటం లేకుండా ముందే ఓ మాట
అన్నిటికన్నా ముందే చెప్పేసేయాలనుకుంటున్న మాటిది. ముందుమాటగా ఇక్కడే కంప్లీట్ క్లారిటీ ఇచ్చేద్దామని. ఈ బుక్ లో ఇంట్రావర్టుల తాలూకు మనస్తత్వం గురించో, తెగ రీసెర్చ్ చేసేసి ఫ్రాయిడ్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పే థిసీస్ ల గురించో, ఇంట్రావర్షన్లోంచి బైటపడాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలనో చెప్పే మనోవైజ్ఞానిక సూత్రాల గురించో ఎక్కడా డిస్కస్ చేయలేదు. అలాంటి అంశాలేవీ పొరపాట్న కూడా ఉండవిందులో
జస్ట్ ఓ ఇంట్రావర్ నేను అబ్జర్వ్ చేసినవీ, నాకు అనిపించినవీ, ఇలా అయి ఉంటే ఎలా ఉంటుంది అన్న what if కాన్సెప్ట్ ఊహించుకున్నవీ.. అలా రాసుకున్న ర్యాండమ్ రైటింగ్స్ ఛాప్టర్ల కలెక్షనే ఈ బుక్.
ఈ పుస్తకంతో ఇంట్రావర్ట్స్ అందరూ ఇంతే అని డిఫైన్ చేయడమో,ఈ లక్షణాలు లేకపోతే ఇంట్రావర్ట్స్ కాదు అనో తేల్చే పనేమీ పెట్టుకోలేదు. ఇందులోని సిచ్యుయేషన్స్ మీరు పక్కా ఫేస్ చేసుండాలనీ లేదు. ఇలా నాకెప్పుడూ అనిపించలేదే అని అక్కడక్కడా మీరు ఫీలయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. కొన్నిటి దగ్గర అరే.. ఇది ఎన్నిసార్లు ఎక్స్ పీరియన్స్ చేశానో అనిపించొచ్చు. ఇంకొన్నిటి దగ్గర క్యారెక్టర్కి కనెక్టయి ఆ ప్లేస్ లో మీకు మీరు కనిపించొచ్చు.
ఫైనల్గా బుక్ ఇలాగే ఉండాలని, ఇలానే రాయాలని లెక్కలేసుకుని రాసింది. కాదు. అఫ్ కోర్స్.. నేను లెక్కల్లో చాలా వీక్) కాబట్టి take light.
“why so serious”
జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్.
– మురళి సర్కార్ (రచయిత)
-
Aruna Netraalu
₹150.001. చేజారిన సిరి“నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.
“అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.
ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”
వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.
“ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”
నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,
“ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….
-
Attar ( Itara Kathalu)
₹150.001. చేజారిన సిరి“నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.
“అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.
ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”
వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.
“ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”
నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,
“ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….
-
Gangarajam Bidda
₹150.00బోర్లించిన చెప్పు
అనుకోకుండా ‘అమ్మ’ ఫోన్ చేసింది. శరత్కు నెల కింద కొడుకు పుట్టాడట. ఫంక్షన్ ఇవ్వాళ సాయంత్రం రంగనాథ ఆలయంలో చేస్తున్నారు. అందరినీ రమ్మని చెప్పింది. మరీ ఆలస్యంగా చెబుతున్నందుకు ‘మాఫ్’ చేయమంది. ‘కిస్మత్’ ఉండబట్టి, నా నంబర్ అంకుల్ పాతడైరీలో దొరికిందట. మగవాళ్లను అంకుల్ అని పిలిచినా, కొంచెం పెద్ద వయసు ఆడవాళ్లను నేను అమ్మ అనే అంటాను. కొత్తపేట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ల పై పోర్షన్లో మేము కిరాయికుండేవాళ్లం.
ఆదివారం, అందునా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, పైగా పెద్ద ఎంగేజ్మెంట్స్ కూడా లేవు కాబట్టి బయల్దేరాను. హైదరాబాద్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. మాకు ఇంత దగ్గర్లో ఇంత పెద్ద గుడి వుందనే తెలీదు నాకు. గుడికి బయట అంటూ ఏమీలేదు. చెప్పుల్తోనే లోనికి వెళ్లి, భారీ దర్వాజా పక్కకు విడిచాను. వదిలిన చెప్పుల్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువమంది వచ్చినట్టు లేదు. ఫంక్షన్ ఆరింటికని చెప్పింది. ఫ్యామిలీగా వెళ్తే వేరే… ఇలాంటి చోట నాకు ఏమీ తోచదనే, మరీ టైముకు వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని ఓ అరగంట ఆలస్యంగా చేరేట్టే ప్లాన్ చేసుకున్నాను. అయినా జనం వచ్చినప్పుడే వస్తారు.
రోడ్డు పక్కనున్న గుడే అది. అయినా అంతటి రొద లోనికి రాకుండా గడప ఆలయాలకే ప్రత్యేకమైన నిశ్శబ్దం చెవులకు వినబడుతోంది. వెళ్తూనే, అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించింది, “కైసే హో బేటా” అంటూ, పొద్దున…………
-
-
Idi Naa Godava
₹150.00కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.
-
-
Gypsylu
₹150.00పైరగాల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముందుకి సాగిపోయే సంచారులు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. భారతదేశపు గదులియా లోహర్, ఆఫ్రికా పశువుల కాపరులు , అరేబియా ఎడారిలో జీవించే ఒంటెల కాపరులు, మధ్య ఆసియా కొండల్లో తిరిగే డ్రోక్ పా పశువుల కాపరులు, ధృవప్రాంతాల్లోని సంచారులు, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీలు లాంటి అస్థిరవాసుల జీవితాలను “తెలుగు వెలుగు” లోనికి తీసుకురావటానికి ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ “జిప్సీలు”.
-
Irani Cafe
₹150.00మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి.
కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
– వి. మల్లికార్జున్ -
Gajula Sanchi
₹150.00నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా’ అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ……
– మొహమ్మద్ గౌస్ -
-
-
-
-
-
Meeku Merem Cheppukovali
₹165.00మీ కలలను సాకారం చేసుకునే శక్తీ మీరు సృష్టించుకోగలరు.
ఈ రహస్యాలు తెలుసుకుని ….
మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,
మీకు మీరేం చెప్పుకోవాలి.
మీ దృక్పధాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.
* నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.
* నాలో ప్రతిభ, సామర్ద్యం, నైపుణ్యం అన్ని వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.
* ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.
* నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.
* నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనుక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.
-
-
-
Rameshwaram Kaakulu By Patanjali Sastri
₹175.00పర్యావరణ వేత్త, కథకుడు తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి పేరు లేకుండా ఉత్తమ తెలుగు సాహిత్యం ఎప్పుడు పూర్తి కాదు. ఈ పుస్తకం లోని కథల్లో శాస్త్రి గారు తన సమాంతర వాస్తవికత దృక్పథానికి ఒక తాత్విక కోణాన్ని జత చేసారు. ఈ తాత్విక కోణం అనేది ఇదివరకటి కథల్లో లీలగా ఉన్నా కూడా ఈ సంకలనం లోని కథల్లో అది మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కారణం చేత ఇందులో కథలన్నీ ఓ మెట్టు పైనే ఉండడమే కాకుండా శాస్త్రిగారి భావజాలం లో వచ్చిన స్పష్టతకి అద్దం పడతాయి. అందుకే ఈ కథలు అన్ని ప్రపంచ ప్రఖ్యతి పొందిన కథల పక్కన పీఠం వేసుకుని కూర్చుంటాయి. In one word his stories are creative puzzles
– తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి
-
Shikhandi
₹175.00క్వియర్లలో ఎన్ని రకాలున్నారో ముందు అర్థం చేసుకుందాం
నాది పురుష శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.
నాది స్త్రీ శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.నాది పురుష శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.
నాది స్త్రీ శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.నా శరీరం స్త్రీదో, పురుషుడిదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.
నా శరీరం పురుషుడిదో, స్త్రీదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.
నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.
నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.
నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.
నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.
నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా పురుషుడి పట్లే.
నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా స్త్రీల పట్లే.నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీలను కోరుకుంటాను.
నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నేను పురుషుల్ని కోరుకుంటాను…………….. -
Gupta 91 By Patanjali Sastri
₹175.00గుప్తా ’91
గుప్తా తడిలేకుండా శుభ్రంగా తల తుడుచుకుని వచ్చి చంకల్లో కొంచం పౌడరు చల్లుకొని, తువ్వాలు అవతల పారేసి లోపలి లాగులో అద్దం ముందు కూచున్నాడు. వంటింట్లో గుప్తాకి లంచి బాక్సు పెట్టి, అతని సంచిలో పెట్టి గదిలోకి వచ్చింది పార్వతి. చేతిలో దువ్వెన పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నా డతను. బ్రాహ్మీ నూనె సీసాలోంచి కొంచెం నూనె అరచేతిలోకి ఒంపుకుని రెండు చేతులకి రాసుకొని ఎదురుగా నుంచుని అతని నల్లటి వంకీల జుట్టుకి రాస్తోంది. ఆమె తెల్లటి పొట్ట అతనికి దగ్గరగా ఉండటంతో ముందుకు జరిగి పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు గుప్తా.
“చాల్లెండి సంబడం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటి?” |
“ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికి దీనికి సంబంధం ఉందాసల?”
“ఇంక దువ్వుకోండి. మీ అమ్మగారికి టిఫిను పెట్టాలి.”
“పూజ అవ్వలేదా?”
“అత్తగారివాళ ఉషారుగా ఉన్నారు.”
“అదేం?”“ఆవిడ ఫెండు మజ్ఞాన్నం ఒస్తాడట. కొంచెం టిఫిను ఎక్కువ చెయ్య | మన్నారు.”……………..
-
Manasu Gathine Marchina ‘Freud’
₹175.00మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.
ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.
-
Amerika Ammayi
₹175.00హ్యాపీ నూతన సంవత్సరం
ఉద్యోగాల కోసం కొందరు, చదువుల కోసం కొందరు, ఇలా వారి వారి కలల వెంటపడి చేరుకునే గమ్యం ఒకటి ఉంది… అదే అమెరికా!
చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడి నుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడివారైనా పూర్ణకుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పి.లు అనీ అనుకునే రోజుల నుండీ… ‘ఆ వదినా, మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను. దార్లో మీ అబ్బాయికి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. ఇచ్చేసి వస్తాను’ అనే రోజుల్లోకి వచ్చేసాము. దూరం కొద్దీ విలువని అంచనా వేసే మనం, ఆ దూరం తగ్గిపోయేసరికి విలువనీ తగ్గించేస్తున్నామేమో?
ప్రపంచంలో అందరూ రెండే రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఉత్తములు అయితే మరొకళ్ళు అధములు. వీళ్ళు కాకుండా మరొక రకం ఉంది. అదే ‘మధ్యముల్’ అన్నమాట. పైన చెప్పిన రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అందరి సమస్యలు నెత్తిన వేస్కుని భూభారాన్ని మోసేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో ఫస్టు ఉండేవాళ్ళలో నేనొకదాన్ని. ఉద్యోగం వదిలేసి భర్త వెంట అమెరికావాసం వచ్చిన కాండిడేట్ని. వీసా సమస్యల వల్ల ఇంట్లో…………….. -
-
-
-
-
CHARITRADAARULLO
₹180.00వేంకటేశ్వరునికి పరమభక్తుడై ఎన్నోసార్లు దర్శించి అనేక కైంకర్యాలు చేసి కవితాకన్యను కూడా సమర్పించిన కృష్ణదేవరాయలు విజయనగరంలో ఒక్క వేంకటేశ్వరాలయమైనా నిర్మించకపోవడం విచిత్రం.
జినభవనాలు(మఠాలు) కట్టించుట, జినసాధువుల పూజలు చేయుట, జైనమునులకు నచ్చిన భోజనములు పెట్టుటలో ఇతర జైనులెవ్వరూ జినవల్లభునితో సరిపోలజాలరు.దశావతారాలు శిష్టసాహిత్యం బాగా నాగరీకమైన తరువాత బలపడిన భావనలు. జానపద సాహిత్యంలోకి శిష్టసాహిత్యంనుండే దశావతారాలు వెళ్లాయి అని నా ఊహ.
ప్రపంచ వీరగాథ సాహిత్యచరిత్రలో పలనాటి వీరగాథ, కాటమరాజు కథ, బొబ్బిలియుద్ధం కథల వలన ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం ఏర్పడి వుంది. వీటిలో మొదటి రెండు పురాతనమైనవి. వాటితో పోలిస్తే బొబ్బిలి యుద్ధం, కథా ఆధునికమైనవే.
తెలివిడి అందినంతమేర చూస్తే రామదాసు పూర్వమైనా, సమకాలం లోనైనా, తరువాత చాలాకాలం వరకు రాముడే భజనకి ఆధారదైవం అనిపిస్తుంది.
మధురాష్టకం చాలా సుబోధక రచన. భారతీయులకు ఏభాష వారికైనా అర్థమవుతుంది. అది పేరుకి సంస్కృతరచనే అయినా, ఆ స్తోత్రంలోని పదాలు అన్ని భారతీయ భాషలలో సర్వసాధారణంగా వాడే పదజాలమే. -
Vaktha (Telugu Edition)
మీరూ కావచ్చు ‘వక్త’
వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.₹200.00Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00. -
-
-
-
Mee Jeevitanni Marchukovadaniki Okka Nimisham Chalu
₹195.00ఒక్క నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి
మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి సిద్దపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలు, మీకు అందిస్తున్నాడు.
ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?
ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలల వెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్ని సద్వినియోగం చెయ్యగల సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిముషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.
విజయం….
“అపురూపమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం, ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి, నీ శక్తీయుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడడం!”
ఛాయిస్ లు….
“నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్, చాన్సు కాదు!”
మొండిపట్టు….
“జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పాదు. మొండిపట్టు, ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కధ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలలు సాకారం కావడం చూడు.”
ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఇప్పుడు నిమిష నిమిషానికీ మార్చుకోగలరు. మీరు ఉన్నతులు కాగలరు. ఎక్కువ పనిచేయ్యగలరు. ఎక్కువ సంపాదించగలరు. ఎక్కువ ప్రేమించగలరు. ఎక్కువ నవ్వగలరు.’ – మార్క్ విక్టర్ హేన్సన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్ సహా రచయిత.
-
-
-
-
-
-
-
-
-
Kishan Chander Enika Chesina Kathanikalu By R Chandrasekhara Reddy , Jai Ratan
₹200.00కిషన్ చందర్ కథలను అనువాదం చెయ్యడం నాకు గొప్ప అనుభూతి. మనకు తెలియని జీవిత పార్శ్వలను కొన్ని ఆవిష్కరిస్తే మరికొన్ని మనకు తెలిసిన విషయాలనే కొత్తగా ప్రదర్శిస్తాయి. వాస్తవికత కళాత్మకతల కలనేత కిషన్ చందర్ కథానికా సాహిత్యం. దేశ విభజన నాటి విషాదాలను, యుద్ధానుభవాలను, అరుదైన మానవ సంబంధాలను మనం కిషన్ చందర్ కథలలో చూడవచ్చు . అంతేకాదు మనిషి విలువలను విస్మరించిన మనకార్య నిర్వహణ వ్యవస్థ నగ్నరూపాన్ని కూడా కొన్ని కథలలో చదివి నిబిడాశ్చర్యంలో మునిగిపోతాం. మౌఢ్యం మన జాతిని ఎలా వెర్రిదానిని చేస్తుందో తెలుసుకుంటాం.
– జై రతన్, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
-
-
NUDI-NANUDI | నుడి-నానుడి
₹200.00సంపాదకులు: జయధీర్ తిరుమల రావు
మతభావన ఆధిపత్య భవనాలే తప్ప భాషకి తత్వ శాస్త్రం ఉంటుందనే ఆలోచన చాలామందికి లేదు. మనకి విద్యాత్మక బాషా పండితులు. బాషా శాస్త్రవేత్తలు ఉన్నారే తప్ప బాషా తాత్వికులు లేరు. ఆ కొరత తెలుగా ఆంధ్రమా? రచయిత వాగరి వాగరి పేరు పెట్టుకున్న బి. స. బంగారయ్య గారు తీర్చారు.
ఇంటి పోకడ బడి పోకడ సమాజం పోకడలని బాషా దృక్పథంతో లోతుగా అర్థం చేసుకున్న ఏకైక రచయిత బంగారయ్య.
భార్యకు బదులు పెళ్ళాం భర్తకు బదులు మొగుడు రక్తము బదులు నెత్తురు స్తనం బదులు చన్ను అనే తెలుగు మాటలు వాడలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ అసలు సిసలు తెలుగు మాటలను మనం మరిచిపోతున్నాం. తెలుగు మాటలను నేటికీ చదువురాని గ్రామసీమల ప్రజలే వాడుతున్నారు. అలాంటి తెలుగు పలుకులు పండితులకి పామరులకు అనేకమందికి అర్ధమవుతుంటే దానిని పక్కన పెట్టడం ఎందుకు? ఇంత చిన్న విషయం గురించి పెద్ద పెద్ద పండితులు ఎందుకు ఆలోచించరు. ఇది ఈ పుస్తకంలో రచయిత ఆవేదన.
-
Vanavasi
₹200.00భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ‘పథేర్ పాంచాలీ’ నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతిభూషన్ బంధోపాధ్యాయ కలం నుంచి జాలు వారిన మరో అపురూప రచన ఇది. ‘పథేర్ పాంచాలీ’తో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచన పరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.
-
-
-
-
Palapitta Katha 2025
₹200.00డా. కామరాజు వెంకట రమణరావు కథలు ఇప్పటిదాకా 80కి పైగా అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కవితలు, సాహిత్య విమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికి ఇతని కథలు మూడు సంపుటాలుగా వెలువడినాయి. అవి ‘పుట్టిల్లు’ (విశాలాంధ్ర, 2013), బురుజు వీధి కథలు (అస్త్ర 2023), కిటికీ అవతల (అస్త్ర 2024). ఇతనికి 2016లో ప్రతిష్టాత్మకమైన ‘చాసో స్ఫూర్తి’ అవార్డు ప్రదానం చేసారు. 2019లో ఇతని కథలమీద ‘కథారూప లక్షణాలు’ అనే విమర్శక గ్రంథాన్ని డా. టి.జి.ఆర్. ప్రసాద్, డా. వి. శ్రీధర్ లు వెలువరించారు. కొన్ని వ్యాసాలు కూడా ప్రచురిత మయ్యాయి. డా. రమణరావు రచనావ్యాసంగాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. రచనలు సామాజిక మార్పుకి దోహదపడాలని విశ్వసిస్తారు
-
-
-
Maa Badi
₹220.00బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.
-
Amma Dairylo Konni Pageelu
₹220.00Amma Dairylo Konni Pageelu – This book orderd customers will get Rs. 30 CASH BACK OFFER
(APPLY FOR ONLY ADVANCE PAYMENT MADE TO PHONE PAY NUMBER 6281596253) -
-
-
-
-
-
-
Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu
₹225.00నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
-ఏమి మౌరీన్.
-ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.
-
Veyipadagalu Nedu Chadivithe
₹225.00వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే…
‘కాలచక్రం’ అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను.
భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు.
విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల…………… -
-
-
-
-




















































































































































