నేను ఏం తప్పు చేసానని అమ్మకి నా మీద కోపం. చిన్నప్పుడు తనకి ఆడ పిల్లలు లేరని నా జుట్టు దువ్వి జడవేసి, పూలు పెట్టి బుల్లి పట్టుపరికిణీ- జాకెట్టు దానికి మ్యాచ్ అయ్యే జరీ అంచు వున్న ఓణి వేసి ఫొటో తీయించి మురిసి పోయిన అమ్మేనా? ఇలా ప్రవర్తిస్తుంది. అమ్మ నా పట్ల చూపిన ఏహ్యతకి నాకు దుఃఖం వస్తుంది.
చిన్నప్పటి నుండి నేను మహా సిగ్గరిని. నలుగురు వున్నచోటుకు రావాలంటే చాలా సిగ్గుపడేవాణ్ని. నా సిగ్గు చూసి అమ్మ ముచ్చట పడేది. ఓసారి అమ్మకు వరసకు అన్నయ్య అయిన మాధవరావు మామయ్య, వాళ్ళ అబ్బాయి సందీప్ ని తీసుకుని ఇంటికి వచ్చాడు. నేను అమ్మ కొంగుచాటున నక్కుని చూస్తున్నా. సందీప్కి ఈ ఊర్లో మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందని, ఇక్కడ హాస్టల్లో వుంచి చదివించేందుకు మామయ్య తెచ్చాడని వారి మాటల్లో అర్ధం అయింది. నేను అదేపనిగా కళ్ళు పెద్దవి చేసుకుని సందీప్ని చూస్తున్నానని మామయ్య గ్రహించి “రారా! ఏంటి అలా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు, నేను మామయ్యను” అన్నాడు. అలా అన్నప్పుడు సందీప్ నన్ను చూసేసాడని నేను మరికాస్త సిగ్గుపడి తుర్రున లోనికి పరుగెట్టాను.
“వాడంతే అన్నయ్యా! చచ్చే సిగ్గు వాడికి” అని అమ్మ మురిపెంగా అనటం వినిపించింది…………………
Reviews
There are no reviews yet.