Manushi

Rs.175.00

In stock

SKU: ANVI0058 Category: Tag:
Author: Shanti Sri Benarji

ఎ బిగ్ థ్యాంక్యూ

నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ఊరికే వ్యర్థంగా రోజులు గడుపుతుంటే, విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్, కాలేజీ మ్యాగజైన్స్కు రాస్తూ ఉండేదానివి కదా, ఆ అనుభవంతో మళ్ళీ రాయడం మొదలుపెట్టమని నన్ను ప్రోత్సహించారు మావారు ప్రనాబ్ బెనర్జీ. పోత్సహించడమే కాకుండా, నా అవసరాలను సమస్యలను గమనిస్తూ గృహకృత్యాల విషయంలో ఎక్కువ డిమాండ్స్ పెట్టకుండా, నాకు రాసుకోవడానికి అనువైన వాతావరణం కలిగించిన వారి సహకారం లేనిదే ఈ సంపుటి తేవడం నాకు సాధ్యమయ్యేది కానేకాదు! నేనేది రాసినా ఓపిగ్గా విని (ఎందుకంటే వారికి తెలుగు మాట్లాడటం తప్పించి చదవడం రాదు కాబట్టి) సలహాలు, సద్విమర్శలు, విశ్లేషణలూ చేస్తూ నన్ను ముందుకు నడిపించిన మా అమ్మాయిలు అలేఖ్య బెనర్జీ, లిఖిత బెనర్జీలకు మెనీ మెనీ థ్యాంక్స్.

నా రచనల ఫైలు పట్టుకుని నిస్సంకోచంగా, అమాయకంగా ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడుగుపెట్టిన నన్ను పరిచయం లేకపోయినా సాదరంగా ఆహ్వానించి, మాట్లాడి, ఫైలు స్వీకరించిన ఎడిటర్ కె. శ్రీనివాస్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే! ఆ తర్వాత నా మొదటి కథ ‘అనివార్యం’ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 21 జులై 2019లో ప్రచురింపబడటం, దాన్ని చదివి నాకు అసంఖ్యాకములైన మెసేజ్లు, ఫోన్కాల్స్ పాఠకుల నుండి రావడం నాకెంతో ధైర్యాన్నిచ్చి ముందు ముందు రాయడానికి ప్రేరణనిచ్చాయి.

నా కథలను ప్రచురించిన స్త్రీవాద మాసపత్రిక భూమికకు, సారంగ, కౌముది, గోదావరి వెబ్ మ్యాగజైన్స్క, స్త్రీవాద అంతర్జాల మాస పత్రిక నెచ్చెలికి, అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రిక బహుళకి నా కృతజ్ఞతలు. ‘కరోనాకాలం కథలు’, ‘రజత కిరణాలు’ – సంకలనాల్లో నా కథలు ప్రచురించిన సంకలన కర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు……….

Author

Shanti Sri Benarji

Format

Paperback