ముందుగా ఓ మాట
రిపబ్లిక్ క్రియేటివ్ ప్రొడ్యుసర్ సతీష్ ఈ కధా సంపుటిని నాకందించి, దీన్ని చదివి మీకు నచ్చితే ముందుమాట రాయండి అని కోరారు. అప్పడప్పుడూ నా దగ్గరకు వచ్చిపోయే పరిపక్వతలేని మరొక రాతేమోలే అని చాలా రోజులు చదవకుండా నిర్లక్ష్యంగా వదిలేశాను. నా తదుపరి సినిమా రాతలో బిజీగా ఉండిపోయాను. ఇందుకు కారణం నాలో ఉన్న మరో బలహీనత. ఏ పుస్తకాన్నైనా చాలా మెల్లగా చదువుతాను. చిన్నప్పట్నుంచి సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు నాన్ – ఫిక్షన్ పుస్తకాలు చదవడమే అలవాటు! సతీష్ మరీ మరీ అడగడంతో చదవడం మొదలుపెట్టి, రెండు రోజుల్లో పూర్తి చేశాను. ఇందుకు కారణం రచయిత సుదర్శన్ రచనా శైలి. చదువుతున్నంతసేపూ నా చుట్టూ ఉన్న ప్రపంచం, నా జీవితంలో ఎదురైన పాత్రలే కళ్ళకు కనిపించాయి. ఇవన్నీ మన కథలే అనిపించాయి. పాత్రల మనోభావాలు, వాళ్ళ స్థితిగతులు మన జీవితంలో ఎదురైనవిగానే అనిపించాయి.
ఈ పుస్తకాన్ని ప్రశాంతంగా మనతో మనం ఉన్నప్పుడు, మనలో మనం చదువుకుంటే, మనల్ని మనకు గుర్తు చేస్తుంది. ఇది రచయిత కళ్ళతో చూసి, మనసులో మధించి చాలా నిజాయితీగా సృష్టించిన ఒక చిరు మానవ ప్రపంచం, అని ప్రపంచం. అణువులో బ్రహ్మాండాన్ని చూసే ఒక కళా తపస్వి రచయితలో
ఇది కొన్ని కథానికల (short stories) సంపుటి కాదు, ఇరవై కథానికలు ఉప…………..
Reviews
There are no reviews yet.