Format | Paperback |
---|---|
Deliveried | 4 – 9 DAYS |
Author | mallakarjun |
Irani Cafe
మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి.
కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
– వి. మల్లికార్జున్
In stock