ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబెల్ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించినందుకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి లక్ష్మిగారు అభినందనీయులు. ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలాలకు చెందినవారు. అందులో థామస్ మాన్, పెరల్ ఎస్ బాక్, టాగోర్, సింక్లెయిర్, నైపాల్, లెస్సింగ్, రెమాంట్ లాంటివారు మన దేశ పాఠకులకు కూడా బాగా పరిచితులే. ఇరవై మంది రచనల నుండి ఇరవై కథలు లక్ష్మిగారు స్వీకరించి, అనువదించి మనకందించారు.
కథల్లో వివిధ దేశాల సామాజిక స్థితిగతులు చిత్రించబడ్డాయి. మానవ సంబంధాలను, ప్రత్యేకించి కుటుంబ వ్యవస్థనూ, అందులోని సంక్లిష్టతను కథారూపంలో చెప్పడం అంతసులువైన విషయం కాదు. పైగా అనువదించి పాఠకుల మనస్సులకు హత్తుకునేలా చెప్పడం మరీకష్టం. అయితే లక్ష్మిగారు మనకందించిన కథలన్నీ స్వీయరచనల్లాగా మన హృదయాన్ని కదిలిస్తాయి.
Reviews
There are no reviews yet.