చాసో, నాలుగు దశాబ్దాలకు పైగా సాగించిన సాహిత్య వ్యవసాయ సాఫల్యం యీ సంకలనం.
రాసులకొద్దీ రాయని చాసో ఒక దశలో “విరమించిన కధకుడ”ని మిత్రులన్నా రచనావ్యాసాంగంలో దీర్ఘవిరామాలను ఆశించే విరమించని కధకుడు చాసో.
ఇది చాసో కధా సర్వస్వం కాదు. తన రచనలనుంచి తానే నిర్మమకారంగా ఎంచికూర్చిన సంకలనం మాత్రమే.చాసోని – కధకుడనడం – అత్యుక్తికాదు. చాసో కధానికా శిల్పాన్ని సమీక్షిస్తూ కొడవటిగంటి కుటుంబరావు యిలా అన్నారు.
” చాసో ఈ కధల ద్వారా ఆధునిక జీవితాన్ని వాస్తవ దృష్టితో చూసి, చూపించాడు. ఈనాటి జీవితంలో గల కల్మషాన్ని కడగటానికి అవసరమైన అభ్యుదయ భావాలను పుష్కలంగా అందించాడు. ఎక్కడా తిరోగమన వాదంతో రాజీపడలేదు; కళాస్ప్రష్టగా అభూతకల్పనలు చేయలేదు; తాను ద్వేషించే అంశాలపై హద్దుమీరిన ఆవేశం చూపలేదు; తనకు సానుభూతి ఉన్న విషయాలను అందలాలెక్కించి ఊరేగించలేదు”.
తన రచనలనే కాదు – శరీరాన్ని కూడా జనోపయోగం కోసం అంకితం చేయాలన్న తపనతో కన్నుమూసిన అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు చాగంటి సోమయాజులు.
Reviews
There are no reviews yet.