Mahatmuni Saakshiga

Rs.125.00
Out stock

Out of stock

SKU: visalaandhra030 Category: Tags: ,

మహాత్ముని సాక్షిగా….

‘ఫిబ్రవరి 9, 2013…. ఉదయం పదకొండు గంటల పదినిమిషాలయింది’.

‘శౌర్యచక్ర అవార్డు గ్రహీత’, నా మిత్రుడు సంతోషింగ్ నుండి ఫోను వచ్చింది. సెల్ నొక్కి “హలోభయ్యా….” అంటూ పలుకరించాను.

“రాజేష్భయ్యా… సి.యన్.యన్. ఛానల్ చూడు! తర్వాత మాట్లాడ తాను….” అంటూ హిందీలో చెప్పి ఫోను కట్చేశాడు. వెంటనే టి.వి. ఆన్ చేసాను.

పార్లమెంటుపై దాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అయిన ‘అఫ్టల్ ‘గురు’ ని తీహార్ జైలులో ఉరితీశారనీ, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారనీ పదేపదే చెబుతున్నారు. సంతోషంతో నా ఒడలంతా పులకించినట్లయింది. ఏ ఛానల్ తిప్పినా, రకరకాల వివరాలు జోడించి, అవే విశేషాలు! తీహార్లోని మూడో నెంబరు జైలు సూపర్నెంటు మనోజ్ ద్వివేది సేకరించిన విశేషాలుగురించి ఓ ఛానల్ వివేకరి వివరంగా చెబుతున్నాడు. అఫ్ఘలైజైలులో గడిపిన రోజుల్లో, ఈ ద్వివేది మహాశయుడు అతడిని ఇంటర్వ్యూ చేసి అతడి నుండి అనేక వివరాలు రాబట్టాడట!

2001 డిసెంబరు 13న పార్లమెంటు భవనం మీద దాడి చేయటానికి ముందు, అనేకసార్లు రెక్కీ నిర్వహించేరట వాళ్ళు! దాడి జరిగిన రోజున, 22 కిలోల అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలు కారు డిక్కీలో వుంచటంతోబాటు; వాటిని దూరంనుండే ‘ఎలక్ట్రికల్ స్విచ్’ సహాయంతో పేల్చటానికి తగిన పరికరాలను కూడా ముందురోజునే సిద్ధం చేయటం జరిగిందని చెప్పేడట అఫ్టల్! ఇంకా అతడు చెప్పిన అనేక విశేషాలను నమోదు చేసి, ఆరు అధ్యాయాలతో ఓ పుస్తకం రాసేరుట ద్వివేది! అయితే జైలు అధికారులు అనుమతినివ్వకపోవటంతో అది వెలుగులోకి రాలేదు! ఆ పుస్తకంలోని ఒకే ఒక్క విషయం మాత్రం పదేపదే టి.వి.లో చెబుతున్నారు. జైలులో వున్న సమయంలో అర్జల్ గురు ఒక సంగతి గురించి మాత్రం ద్వివేదివద్ద ఎన్నోసార్లు ఆశ్చర్యం, ఆవేదన వెలిబుచ్చాడట! కారులో అమర్చిన పేలుడు పదార్థాలు ఎందుకు పేలలేదు?!’ అనేదే అతడి ఆశ్చర్యం, ఆవేదనలకు కారణం!!

కారులో అమర్చిన పేలుడు పదార్థాల విస్ఫోటనం జరిగివుంటే, పార్లమెంటు భవనం సగం మేరకయినా ధ్వంసమయి వుండేదనీ, వందలాది ప్రముఖులు మరణించి వుండేవారనీ, అలా జరిగివుంటే, ‘కాశ్మీరు సమస్యను మరింత దృఢంగా మేం ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళ గలిగి వుండేవారమనీ, అఫ్టల్ అభిప్రాయపడ్డాడని’ ద్వివేదీ………………………..

author name

Dwibhasham Rajeswara Rao

Format

Paperback