ఒక్క నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి
మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి సిద్దపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలు, మీకు అందిస్తున్నాడు.
ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?
ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలల వెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్ని సద్వినియోగం చెయ్యగల సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిముషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.
విజయం….
“అపురూపమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం, ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి, నీ శక్తీయుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడడం!”
ఛాయిస్ లు….
“నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్, చాన్సు కాదు!”
మొండిపట్టు….
“జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పాదు. మొండిపట్టు, ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కధ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలలు సాకారం కావడం చూడు.”
ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఇప్పుడు నిమిష నిమిషానికీ మార్చుకోగలరు. మీరు ఉన్నతులు కాగలరు. ఎక్కువ పనిచేయ్యగలరు. ఎక్కువ సంపాదించగలరు. ఎక్కువ ప్రేమించగలరు. ఎక్కువ నవ్వగలరు.’ – మార్క్ విక్టర్ హేన్సన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్ సహా రచయిత.
₹195.00