Nenu Nadichina Bata

Rs.200.00

In stock

Author: Nalluri Venkateswarlu

ముందుమాట

నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) గారి స్వీయచరిత్రకు ముందుమాట రాయమని ఆయన కోరటం నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నేను విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యుడిగా వున్నప్పటి నుండి నాకు నల్లూరితో పరిచయం. విద్యార్థిరంగ కార్యక్రమాలకు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఒంగోలు తరుచుగా వెళ్ళేవాడిని. ఆయన ప్రజానాట్యమండలి,

యువజన సమాఖ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా తరుచుగా కలిసేవాళ్ళం. చర్చించుకునే వాళ్ళం.

నేను నడిచిన బాట” శీర్షికగా ఆయన జీవిత చరిత్ర ఆసక్తికరంగా వుంది. ఐతే | ఒక లోపం వుంది. ఆయన కుటుంబ జీవితం గురించి, సహచరి గురించి, పిల్లల గురించి సమాచారం లేదు. భార్యా పిల్లల సహకారం, మద్దతు లేకుండా ఆయన ఈ సుదీర్ఘమైన బాటలో విజయవంతంగా నడవగలిగేవారు కాదని నా అభిప్రాయం.

నిజాయితీ, నిబద్దత గల కమ్యూనిస్టు జీవితం ఎలా వుండాలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి జీవితం అచ్చంగా అలా వుంది.

నల్లూరి స్వతహాగా కళాకారుడు. ఒకరకంగా ఆయన తన జీవితాన్ని, కళారంగానికి, కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశాడు. యువజన రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.

నల్లూరి వెంకటేశ్వర్లు గారిది చెరగని చిరునవ్వు. ఎవ్వరి మీద కోప్పడుతుండగా చూడలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరినీ పరుషంగా విమర్శించడం చూడలేదు. ఆయనకు బాధ కలిగినా తాను దిగమింగటం తప్ప తగువుకుగానీ, ఘర్షణకు గానీ పోలేదు. కాని కమ్యూనిస్టులకుండాల్సిన వర్గ దృక్పథం నుండి పక్కకు మరల లేదు. ఆయన జీవనశైలి, నిరాడంబరత, నిబద్ధత కారణంగా, అన్ని వర్గాల చేత గౌరవింపబడ్డాడు……..

Author

Nalluri Venkateswarlu

Format

Paperback