శ్రీమంతం, సారవంతం అయిన కృష్ణాతీరాన రైతుబిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు ఈడు రాగానే పక్వానికొచ్చిన కళాకాంతుల్ని మూటగట్టుకుని వైనతేయుడిగా రెక్కవిదిల్చి చెన్నపట్నంలో వాలారు. రాముడై, కృష్ణుడై విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకు సొగసులద్దారు. తెలుగునాట పూజామందిరాలలో నిలువెత్తు స్థానం సంపాదించుకున్నారు. కర్మయోగిగా జనామోదం పొందారు. మరోసారి రెక్కవిదిల్చి ప్రభంజనమై తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జననేతగా జేజేలందుకుని తెలుగువాడికి కొండగుర్తుగా నిలిచిన ఆ మహనీయుని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం యన్.టి.ఆర్.
Reviews
There are no reviews yet.