Best Seller Items

  • Decoding the Leader By Dr Peddi Rama Rao

    150.00

    గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్

    రాజమౌళికి కోటి రూపాయలిచ్చి సినిమా తీయమన్నా
    మనుకోండి! మిమ్మల్ని ఎగాదిగా చూసి కత్తిలాంటి ఒక
    కొత్త ఆయుధం తయారు చేయించటానికి కూడా ఈ కోటి
    సరిపోవూ అంటాడు.

    ఆయన ఊహాశక్తికి తగ్గ స్థాయిలో సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలో ఆయనకు కూడా తెలియదు. తన ఊహాశక్తికి తగ్గట్టుగా ఆయన తీస్తూ పోతే, ప్రొడ్యూసర్ కూడా అట్లానే డబ్బులు పెడుతూపోవాలి. చంద్రబాబుగారు కూడా అంతే! తన ఊహాశక్తికి తగ్గ స్థాయిలోనే ఏ పనైనా జరగాలని తపన పడతారు.

    అప్పటికింకా అమరావతి శంకుస్థాపన కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనప సామాను కింద వేలం వేసి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే గూగులమ్మనడిగితే హావ్ లాక్ బ్రిడ్జ్ పొడవు మూడు కిలోమీటర్లని, గోదావరి నది మీద అటు కొవ్వూరునీ, ఇటు…………..

  • Mahatma Jyothirao Pule

    150.00

    శ్రీ ధనంజయకీర్ గారు ఇంగ్లిష్ లో రాసిన Mahatma Joti Rao Phooley; Father of The Indian Social Revolution అనే గ్రంధానికి ఇది స్వేచ్చానువాదం.

    నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ … వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం.

    నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది.
    స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే.
    విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం.
    ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.

    ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.

    అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు.

    వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.

    కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది.

    హిందూమతోన్మాదం ఇవాళ …మతభక్తే … దేశభక్తి … అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇ లాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుంది.

    రచయిత ధనంజయ్‌ కీర్‌ మహారాష్ట్రకు చెందిన వారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ మిత్రుడు. 1969లో వెలువడిన మహాత్మా ఫూలే సమగ్ర వాజ్మయ్‌ పుస్తకానికి సంపాదకులు. ఆయన మహాత్మా జోతిరావ్‌ ఫూలే జీవితం గురించి చాలాకాలం పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు.

    ఈ పుస్తక స్వేచ్ఛానువాదకురాలైన డా. విజయ భారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో అంబేడ్కర్‌, పురాణాలు-కులవ్యవస్థ పేరుతో రాసిన సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు ముఖ్యమైనవి.

  • Mr Mohamatam

    150.00

    మొహమాటం లేకుండా ముందే ఓ మాట

    అన్నిటికన్నా ముందే చెప్పేసేయాలనుకుంటున్న మాటిది. ముందుమాటగా ఇక్కడే కంప్లీట్ క్లారిటీ ఇచ్చేద్దామని. ఈ బుక్ లో ఇంట్రావర్టుల తాలూకు మనస్తత్వం గురించో, తెగ రీసెర్చ్ చేసేసి ఫ్రాయిడ్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పే థిసీస్ ల గురించో, ఇంట్రావర్షన్లోంచి బైటపడాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలనో చెప్పే మనోవైజ్ఞానిక సూత్రాల గురించో ఎక్కడా డిస్కస్ చేయలేదు. అలాంటి అంశాలేవీ పొరపాట్న కూడా ఉండవిందులో

    జస్ట్ ఓ ఇంట్రావర్ నేను అబ్జర్వ్ చేసినవీ, నాకు అనిపించినవీ, ఇలా అయి ఉంటే ఎలా ఉంటుంది అన్న what if కాన్సెప్ట్ ఊహించుకున్నవీ.. అలా రాసుకున్న ర్యాండమ్ రైటింగ్స్ ఛాప్టర్ల కలెక్షనే ఈ బుక్.

    ఈ పుస్తకంతో ఇంట్రావర్ట్స్ అందరూ ఇంతే అని డిఫైన్ చేయడమో,ఈ లక్షణాలు లేకపోతే ఇంట్రావర్ట్స్ కాదు అనో తేల్చే పనేమీ పెట్టుకోలేదు. ఇందులోని సిచ్యుయేషన్స్ మీరు పక్కా ఫేస్ చేసుండాలనీ లేదు. ఇలా నాకెప్పుడూ అనిపించలేదే అని అక్కడక్కడా మీరు ఫీలయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. కొన్నిటి దగ్గర అరే.. ఇది ఎన్నిసార్లు ఎక్స్ పీరియన్స్ చేశానో అనిపించొచ్చు. ఇంకొన్నిటి దగ్గర క్యారెక్టర్కి కనెక్టయి ఆ ప్లేస్ లో మీకు మీరు కనిపించొచ్చు.

    ఫైనల్గా బుక్ ఇలాగే ఉండాలని, ఇలానే రాయాలని లెక్కలేసుకుని రాసింది. కాదు. అఫ్ కోర్స్.. నేను లెక్కల్లో చాలా వీక్) కాబట్టి take light.

    “why so serious”

    జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్.

    – మురళి సర్కార్ (రచయిత)

  • Aruna Netraalu

    150.00
    1. చేజారిన సిరి

     

    “నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.

    “అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.

    ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”

    వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.

    “ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”

    నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,

    “ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….

  • Attar ( Itara Kathalu)

    150.00
    1. చేజారిన సిరి

     

    “నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.

    “అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.

    ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”

    వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.

    “ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”

    నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,

    “ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….

  • Gangarajam Bidda

    150.00

    బోర్లించిన చెప్పు

    అనుకోకుండా ‘అమ్మ’ ఫోన్ చేసింది. శరత్కు నెల కింద కొడుకు పుట్టాడట. ఫంక్షన్ ఇవ్వాళ సాయంత్రం రంగనాథ ఆలయంలో చేస్తున్నారు. అందరినీ రమ్మని చెప్పింది. మరీ ఆలస్యంగా చెబుతున్నందుకు ‘మాఫ్’ చేయమంది. ‘కిస్మత్’ ఉండబట్టి, నా నంబర్ అంకుల్ పాతడైరీలో దొరికిందట. మగవాళ్లను అంకుల్ అని పిలిచినా, కొంచెం పెద్ద వయసు ఆడవాళ్లను నేను అమ్మ అనే అంటాను. కొత్తపేట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ల పై పోర్షన్లో మేము కిరాయికుండేవాళ్లం.

    ఆదివారం, అందునా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, పైగా పెద్ద ఎంగేజ్మెంట్స్ కూడా లేవు కాబట్టి బయల్దేరాను. హైదరాబాద్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. మాకు ఇంత దగ్గర్లో ఇంత పెద్ద గుడి వుందనే తెలీదు నాకు. గుడికి బయట అంటూ ఏమీలేదు. చెప్పుల్తోనే లోనికి వెళ్లి, భారీ దర్వాజా పక్కకు విడిచాను. వదిలిన చెప్పుల్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువమంది వచ్చినట్టు లేదు. ఫంక్షన్ ఆరింటికని చెప్పింది. ఫ్యామిలీగా వెళ్తే వేరే… ఇలాంటి చోట నాకు ఏమీ తోచదనే, మరీ టైముకు వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని ఓ అరగంట ఆలస్యంగా చేరేట్టే ప్లాన్ చేసుకున్నాను. అయినా జనం వచ్చినప్పుడే వస్తారు.

    రోడ్డు పక్కనున్న గుడే అది. అయినా అంతటి రొద లోనికి రాకుండా గడప ఆలయాలకే ప్రత్యేకమైన నిశ్శబ్దం చెవులకు వినబడుతోంది. వెళ్తూనే, అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించింది, “కైసే హో బేటా” అంటూ, పొద్దున…………

  • Zero Number One

    150.00

    స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.

    అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..

  • KGH Kathalu

    150.00

    కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
    వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను.

  • VELPULA KATHA|వేల్పుల కథ

    150.00

    వేల్పుల కథ- రాంభట్ల కృష్ణమూర్తి

  • Idi Naa Godava

    150.00

    కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో  ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.

  • కోనసీమ కథలు

    150.00

    కోనసీమ కథలు

  • Gypsylu

    150.00

     పైరగాల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ  ముందుకి సాగిపోయే సంచారులు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. భారతదేశపు గదులియా లోహర్, ఆఫ్రికా పశువుల కాపరులు , అరేబియా ఎడారిలో జీవించే ఒంటెల కాపరులు, మధ్య ఆసియా కొండల్లో తిరిగే డ్రోక్ పా పశువుల కాపరులు, ధృవప్రాంతాల్లోని సంచారులు, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీలు లాంటి అస్థిరవాసుల జీవితాలను “తెలుగు వెలుగు” లోనికి తీసుకురావటానికి ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ “జిప్సీలు”.

  • Irani Cafe

    150.00

    మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
    2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం  నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి. 
                కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
                                                                                                                                                                                                                                                – వి. మల్లికార్జున్    

  • Gajula Sanchi

    150.00

     నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
                              ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా’ అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
    కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ……
                                                                                                                                                                                                                                                                                         – మొహమ్మద్ గౌస్