ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం.
మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు.
కానీ ఒక పురుషుడు, స్త్రీ, మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృష్టికి నాంది పలికే ప్రేమ, మిగిలిన అన్ని ప్రేమలకు ఆధారమయ్యే ప్రేమ అన్నింటికన్నా ప్రత్యేకమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు కలసి చుదువుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రణయాన్ని వివాహం ద్వారా సార్థకపరుచుకుని సాగించే ప్రయాణం అత్యుత్తమమైనది.
ప్రేమ కుల మతాలకు, భాషా ప్రాంతాలకు అతీతమైనది.
ప్రేమించేందుకు నిజాయితీ కలిగిన దైర్యం, దైర్యం గా చెప్పగలిగే సత్యం, సత్యం కోసం చేసే త్యాగం, త్యాగంలో కూడా మరుగుపడని అనురాగం అనేవి నాలుగు స్తంభాలు. బలమైన ఈ నాలుగు స్తంభాల పై నిలబడిన ఒక ప్రేమ కథ ఇది.
నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ నవల. జీవితంలో వాస్తవిక దృక్పథం, ఆత్మాభిమానం, మంచిని పెంచే పట్టుదల, ఎన్ని కష్టాలు ఎదురైనా సడలని వ్యక్తిత్వంతో నిజాయితీగా, దైర్యంగా ఉంటె అదే కష్టాల మెడలు వంచి మనకు విజయం చేకూరుస్తుందని చెప్పేదే ఈ నవల.
– షేక్ అహమద్ బాష
Reviews
There are no reviews yet.