Best Seller Items

  • The Guide

    250.00
  • Sampadha Rahasyam

    250.00
  • 1984 George Orwell

    250.00
  • Regadivittulu

    రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.

    మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

    ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.

    250.00
  • Madi Vippina Charitra

    గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
    చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు.

    250.00
  • Neeli Meghalu

    నీలిమేఘాలు – ఈ శతాబ్దపు రెండో గొప్ప కవితా సంకలనం

    – చేకూరి రామారావు

    పందొమ్మిది వందల తొంభై మూడు అక్టోబరు మూడు తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సుదినం. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి అంకురార్పణ జరిగింది. స్త్రీ వాద కవిత్వం విజయదుందుభి మోగించిన దినం. ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద కవితా సంపుటి హైదరాబాదు నగరంలో ఆవిష్కృతమైంది. ఇటువంటి సంపుటం తీసుకురావాలన్న సంకల్పం అంతకు ముందు సరిగ్గా ఏడాది కిందట ఏర్పడి, అనుకున్నట్టుగా సంవత్సరం తిరిగేటప్పటికి సంపుటం తయారయింది.

    నవ్య కవిత్వాన్ని ‘వైతాళికులు’గా సంకలనం చెయ్యటానికి ముద్దుకృష్ణకు ఎన్నాళ్లు పట్టిందో తెలీదు. ఇవాళ ఈ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో తెలుగు కవిత్వంలో జరిగిన మార్పుల్ని గ్రహించటానికీ, అనుభవించటానికి ఆధారభూతమైన ఏకైక కవితా సంపుటి “వైతాళికులు”, అనాటి అనేక కవుల కవితా సంపుటులు ఈనాడు దొరకటం లేదు. చాలామంది కవితా ఖండికలు సంపుటాలుగా సంకలితం కానేలేదు. అయినా ‘వైతాళికులు తిరగేస్తుంటే ఆనాటి కవితా ధోరణులు మన అంతరంగాల్లో ఆహ్లాద తరంగాలను కదిలిస్తాయి.

    ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవిత్వాన్ని మనసారా ఆహ్వానించిన వాళ్ళతోపాటు వ్యతిరేకించినవాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో వుంటారు. ఒక తేడా వుంది. అప్పుడు వ్యతిరేకించినవారు దిగ్ధంతులైన పండితులు, అక్కిరాజు ఉమా కాంతంగారు, జయంతి రామయ్యగారు, అనంత పంతుల రామలింగస్వామి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు నవ్య కవిత్వ ధోరణులను నిరసించారు. తమ తర్క శక్తితో ఎదుర్కొన్నారు. అధిక్షేప కావ్యాలు రచించి హేళన చేశారు. ఎన్ని చేసినా కాలప్రవాహంలో అవి మరుగున పడిపోయాయి. దొరుకుతున్న కావ్య సంపుటాల ద్వారా దొరకని వారిని ‘వైతాళికులు’ సంకలనం ద్వారా ఈనాటికీ మనకు ఆనాటి

    250.00
  • Enugula Veeraswami Kasi Yatra

    ఏనుగుల వీరాస్వామి అనే ఒక తెలుగు మహానుభావుడు 19వ శతాబ్దంలో, 100 మంది తీర్థయాత్రికులను చెన్నపట్నం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి, వారిని క్షేమంగా చెన్నపట్నానికి తీసుకొని రాగలిగాడు. 4 వేల కిలోమీటర్ల పాటు జరిగిన ఈ ప్రయాణంలో గంగానది మీద 1000 కిలో మీటర్ల పాటు పడవ ప్రయాణం కూడా చోటు చేసుకొంది. 15 నెలల, 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ ప్రయాణం(1830 – 1831) ప్రపంచ తీర్థయాత్ర చరిత్రలో ఒక అరుదైన సంఘటన.

                                                                                                                 – డా. మచ్చ హరిదాసు

                  ఒకడు ధనము ఆర్జించి దాన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టకుండా చనిపోవుట నిష్ఫలం.

                                                                                                            – ఏనుగుల వీరాస్వామి

               వీరాస్వామి యాత్రకి వెళ్ళేటప్పుడు నేను అక్కడి వినోదములను రాయించి పంపించాలని అడిగినందుకు ఆయన రాసి పంపుతూ వచ్చారు.

                                                                                                          – కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ

                మా తాతగారి పేరు కిత్తయ్య పంతులు. వారికి తాతగారైన కిత్తయ్య గారు వీరాస్వామికి దివ్వెల గ్రామంలో ఆతిథ్యం ఇచ్చారు.

                                                                                                       – ఆరుద్ర (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

    250.00
  • Yedu Tharalu

    “పరిశుభ్రమైన గాలి క్షణమాత్రం సోకితేనే గజగజలాడిపోయే ఊపిరితిత్తులు;;; వొంటి నిండా బట్టలుండవు – మలవిసర్జన జరిగిపోతుంటే శుభ్రం(గా)చేసుకోవటానికి కూడా వీలు లేకుండా కాళ్ళూ, చేతులకు సంకెళ్ళు – పండ్లతో, గాయాలతో, చీము నెత్తురులోడే భుజాలు, మోచేతులు, పిర్రలు;;; పిచ్చలు కోసేయ్యటం – మర్మాంగాలు నరికెయ్యటం – ఎముకలను కరుచుకున్న మాంసం వూడొచ్చేదాకా కొట్టటం, నిండు గర్భిణులను పొట్ట కింద గుంత తవ్వి, బోర్ల పడుకోబెట్టి, కొరడాలతో కొట్టటం, జంతువులను వేటాడాల్సిన వేట కుక్కల చేత మనుషులను వేటాడించటం;;; చర్మాన్నీ, నరాల్ని, కండల్నీ, ఎముకనూ, ఒక్క వేటుతో ఛేధిస్తూ, ఓ గొడ్డలి మొన మన కుడి కాలును మన శరీరం నుండీ వేరు చేస్తుంటే…;;; అవయవాలుండవు; ఉన్నా అవి దొరల కోసం! తోడు లేదు – బిడ్డలు లేరు – సంసారం లేదు – స్వజనం లేరు – స్వగ్రామం లేదు – స్వదేశం లేదు – గతం లేదు – భవిష్యత్తు లేదు;;;” నాగరికత, హక్కుల ముసుగు లో ఓ జాతి మరో జాతి మీద సాగించిన దాష్టీకాలను, ఆకృత్యాలను, అర్ధం చేసుకోవటానికి “ROOTS / ఏడు తరాలు” – (By Alex Haley) ని చదవండి. INDEPENDENCE DAY అంటే హాలిడే కదా ఆడుకోవచ్చు అని ఎదురు చూసే పిల్లల చేతా, లాంగ్ వీకెండ్ ఏమో అని క్యాలెండర్లు వెతికే పెద్ద వాళ్ళ చేతా, ఈ పుస్తకం చదివించండి! స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ల విలువేంటో, దాని కోసం మన ముందు తరాల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, త్యాగాలు చేసుంటారో, ఎం కోల్పోయారో, కనీసం ఊహించనైనాగలరు !!

     

    Reviewed By Seshumadhav Chaturvedula

                    విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన. ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.

    ‘రూట్స్’ పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.

    250.00
  • Thribhujapu Naalugo Konam

    విధ్వంస దృశ్యం

    ఇరుకిరుకు దారుల్లో నిప్పు కుంపట్ల మధ్య నడుస్తున్నట్టుగా ఉంది. ధరలు భగ్గుమనడమంటే ఏమో అనుకున్నావ్ ఇప్పుడర్థమౌతోంది కదూ! బాగా కమిలి మగ్గుతున్న, కుళ్ళి పులుస్తున్న, మోటారు ఇంధనం కాలుతున్న, శరీరాల చెమట కంపు కొడుతున్న ఘాటు వాసన గంధక ధూమంలా, చెదరని మేఘంలా ఒళ్ళంతా చిరచిరలాడిస్తూ… పండి పక్వానికొస్తున్న తియ్యటి వాసన కదిలీ కదలని పిల్ల తెమ్మెరలా లిప్తకాలం పాటు ముఖాన్ని స్పృశిస్తూ…

    గాలి వీచదు, చెమట ఆరదు. అయినా, ముదురుటెండలో మార్కెట్ కని బయల్దేరి పాలిస్టర్ చీర ఎందుకు కట్టుకున్నానా అని ఇప్పుడు వాపోవడం నిజంగా బుద్ధితక్కువ పనే. అదిగో ఆ బెంగాలీ అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి. నీలిపూల తెల్లని కాటన్ ప్రింటెడ్ – మైసూర్ కాటన్ లేదా యూపీ హ్యాండ్లూమ్ వెరైటీ… పెద్దపెద్ద పూలతలు డిజైన్ గా అద్దిన పొడవాటి చీరకొంగు దాదాపు నేలకు ఆనుతూ, ఒత్తయిన నల్లని కురచ జుట్టు పోనీటైల్ ముడి చిన్నగా చెదరుతూ, కొంగుచాటు నీలి జాకెట్ ఎగువ నున్నటి మెడ అక్కణ్నుంచి అవతలివైపు దిగువకు విస్తరించుకుపోయిన వీపు అందంగా బహిర్గతమౌతూ, స్లీవ్స్ జబ్బల దంతపు వర్ణం కాంతి మెడలోని సన్నని బంగారు గొలుసు తళతళలతో పోటీ పడుతూ… నాజూకుగా నడుస్తున్న ఆ సింపుల్బ్యూటీ ఆమె మోస్తున్న ప్లాస్టిక్ బుట్టలో నవనవలాడుతున్న కూరగాయల రాశిలాగే తాజాదనానికి నిలువెత్తు నిర్వచనం. పేరు హేమగాత్రి లేదా సుమగాత్రి అయి ఉండాలి. పాలతో స్నానం చేయించినట్లుగా తెల్లగా మెరుస్తున్న బుల్లికారులో స్టీరింగు ముందు కూర్చున్న యువకుడు డోర్ తెరిచి బుట్ట అందుకుంటూ నవ్వుతూ… దబ్బపండు రంగు నిండు బుగ్గల మీద క్లీన్ షేవింగ్ బాపతు పచ్చని చారలు చిత్రంగా సాగుతూ ఎర్రనినోట్లోని సూపర్వైట్ పలువరుస టి.వి. ప్రకటనల్లోలాగా ఫ్లాష్ ఫ్లాష్… నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. జి.ఎం.గారి అబ్బాయో, చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయో అయి ఉండాలి. దేనికైనా పెట్టి పుట్టాలంటారు! ……………

    250.00
  • Sree Geetham

    250.00
  • Na Daivam N T R

    అది ఒక యోగం.

    ఆయన ఒక దైవం!

    ఇది నిజం.

    ఈనాటి ఈ బంధం ఏనాటిదో…

    ఉడతాభక్తిగా ఈ పొత్తం.

    ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే అభిమానం.

    ఋషిని చూసాను ఆయనలో.

    ౠకలకు కాదు ఇది.

    ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది.

    ఏనాటికీ చెక్కు చెదరని అభిమానం అది.

    ఐరావతం ఎక్కినంత ఆనందం, ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తే… ఒకింత అనుమానం వద్దు, ఆయన దీవిస్తే అంతే… ఓటమి ఉండదు. అంతా ముందడుగే. ఔత్సాహికుల్లారా నిద్రలేవగానే అంతఃకరణ శుద్ధితో ఆయన్ని స్మరించుకోండి. అంతా మంచే జరుగుతుంది.

    అ నుంచి అః వరకు ఇది నా దైవానికి సమర్పించిన అక్షరమాల.

    ఎక్కడో మేడూరు అనే గ్రామంలో పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మల కడుపున నాల్గవ సంతానంగా జన్మించిన ఈ పరుచూరి గోపాలకృష్ణ గుండెల్లో దైవంగా నందమూరి తారకరామారావు గారు ఎలా వెలిశారు, ఆ దైవం ఆశీస్సులు………..

    250.00
  • Banavathi

    ప్రవేశిక

    ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, ‘త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి’ అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.

    అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?

    పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.

    ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం……….

    250.00
  • Visalandhramu

    250.00
  • Runam

    స్వచ్చమైన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో “ఋణం” అనే నామకరణం చేయడంలోనే ఈ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ ఈ “ఋణం” నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాదారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.

    250.00
  • Ayn Rand Philosophy

    ఫిలాసఫీ; ఎవరికి అవసరం?

     

    (మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)

    నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?

    మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.

    మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.

    ‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………

    250.00
  • Ded End

    250.00
  • Kollayi Gattithe Nemi

    ఆంద్రదేశ చరిత్రలోనే 1920 -45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం ఉంది. సామాజికంగా వీరేశలింగం ప్రభ్రుతులు సంస్కరణవాదధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది.
              సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపార త్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితీ, నవ్యసాహితీ, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది. 
              తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా  “కొల్లాయిగట్టితేనేమి?” ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’, ‘రథచక్రాలు’, అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు.
             కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రిక గతితో మానవ సంబంధాలలో  వస్తున్న మార్పుల్ని  సజీవ రీతిలో చిత్రించిన నవలలు ఇవి.
    – మహీధర రామ మోహన రావు

    250.00
  • Andaala Natudu Harnath

    అందాలుచిందే రూపం…! అలచందమామ రూపం!!
    హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. ‘యూ ట్యూబ్’ వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి ‘పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన ‘శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము’ అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం.
    హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ ‘ఖిల్జీరాజ్యపతనం’ నాటకంలో కథానాయకుడి పాత్ర………….

    250.00
  • Komuram Bheemu

    ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు

    250.00
  • Soonyam

    OONYAM novel by Mukthavaram Pardhasarathy పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు

    250.00
  • Vinayakarao Pelli

    • For kids
    • First published in 2014
    • Copyright by Wpbingo
    260.00