Regadivittulu

Rs.250.00

రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.

మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.

In stock

SKU: OTH0015 Category: Tags: ,
author name

CHANDRALATHA

Format

Paperback