Best Seller Items

  • Asamardhuni Jeeva Yatra

    120.00

    Asamardhuni Jeeva Yatra

     

  • Amrutham Kurisina Rathri

    200.00

    Amrutham Kurisina Rathri

    అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

    కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ “అమృతం కురిసినరాత్రి” కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.

    ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు:

    ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి – వెళ్ళిపొండి, టులాన్, మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ ఇంటూ ప్లస్.

  • Satyajith Roy Evaru? ? ?

    225.00

    Satyajith Roy Evaru? ? ?

  • Prema ledani premincharaadani

    250.00

    Prema ledani premincharaadani

  • Kondamallu

    300.00

    Kondamallu

    అడవి మొగ్గల వాన గోరటి వెంకన్న

    డవి మొగ్గల వాన.. చెంచు గిరుల కోన, కారుకోడి పదును, బ్రహ్మనాయుడి కదును కథావరణంలోకి మనలను అలవోకగా తీసుకుపోయే నవల ఇది. అడవిని ఆలంబన చేసుకొని, తనే ఒక ఆదివాసిగా మారి చెంచుల జీవితాన్ని చిత్రిక పట్టిన తొట్ట తొలి చారిత్రక నవల. రచనా మౌలిక తత్వాన్ని ఆకళింపు చేసుకున్న, గతాన్ని తొవ్వి ఉన్నవి, విన్నవి, వర్తమాన అధ్యయనంలో కన్నవి, ఎరుకపడినవి అన్నింటిని కుప్ప పోసి ఉద్వేగ భరిత శైలితో ప్రాణప్రతిష్ట చేసిన నవలే కొండమల్లు.

    “పోసగు ముత్యపు సరులు మోహరించిన రీతి తమలోన దొరలు శబ్దముల” గూర్చి (పింగళి సూరన) అల్లిన గాథ ఇది. అడవిలో కృతక విలాసాలు ఉండవు. కానీ ఆహ్లాదమంత అడవి ఒడిలోనే ఉన్నదన్నంత గొప్పగా ఉంటుంది. ఋతువు ఋతువుకు మారే అడవి అందాలుంటాయి. ఎగిరే ఎన్నో పిట్టలు తమ భాషలో శబ్దం నొంపుతూ మనలను మురిపెంగా పలకరిస్తాయి. ఎన్నో పాకే చెట్ల తీగలు లేత మునివేళ్ళతో మనల్ని తడుముతాయి. పుటల నిండా పరుచుకున్న అడవి చెట్ల పుప్పడి సుగంధం మనల మరో లోకం మైకంలోకి తీసుకు వెళ్తుంది. ఆధునిక జీవన అవిటి తనాన్ని వెనుకకు నెట్టే శక్తి గల అక్షర పొదుగు ఈ నవల.. పసరుటాకుల నులి స్పర్శ, దేహ మాలిన్యాన్ని తొలగించే కొండ పసుపు ఇది. అలసటను మరిపించే ఇప్పపూల. అమ్మ సిరుల సామ్రాజ్యపు ఒద్దిమాను బండాగారమిది…………………………..

  • Ayn Rand Philosophy

    250.00

    Ayn Rand Philosophy

    ఫిలాసఫీ; ఎవరికి అవసరం?

     

    (మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)

    నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?

    మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.

    మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.

    ‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………

  • Shivoham

    165.00

    Shivoham

     

    ఇది శివ ప్రసాదు అనే మూగవాడు శివుడి మహిమతో తన వైకల్యాన్ని జయించి కళను సాధించుకున్న కథ.. దేవుడి కథ చెబుతూనే ఊరు, ఊర్లో ఉండే జనాలు, వివక్ష, అధికార దాహం, విమన్ ఎంపవర్మ్రంట్ ఇలా అనేక అంశాలను ఇందులో క్షుణ్ణంగా వివరించారు. జగన్నాథం మాటల సంపుటితో సక్సెస్ అందుకున్న రచయిత భాను తేజ మొదటి నవల..

  • Lankamala Daarullo

    300.00

    Lankamala Daarullo

    ఈ పుస్తకంలో 21 వ్యాసాలున్నాయి. వ్యాసం అనేది సరైన మాట కాదు నిజానికి. వీటిని యాత్రా కథనాలు అనాలి. అనుభవ కథనాలు అనాలి. మ్యూజింగ్సు అని కూడా అనొచ్చు. తనతో తాను చేసుకున్న సంభాషణలు అని కూడా అనుకోవచ్చు. లేదా ప్రకృతికి రాసుకున్న ప్రేమలేఖలు అని అనడం కూడా బావుంటుంది.
    – వాడ్రేవు చినవీరభద్రుడు

  • Grama Devata

    299.00

    Grama Devata

     

  • K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili

    120.00

    K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili

     

  • Ade Neevu Ade Nenu

    125.00

    Ade Neevu Ade Nenu

  • Muthyala Muggu

    175.00

    Muthyala Muggu

    venditera navala

  • Nanna-Gurthimpuleni Sainikudu

    249.00

    Naa Vangadesa Yatra(Kala Katta)

  • Naa Vangadesa Yatra(Kala Katta)

    150.00

    Naa Vangadesa Yatra(Kala Katta)

  • Nannaku Prema Kopam Maryadatho

    250.00

    నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో — మణికాంత్ గెల్లి

    తండ్రి-కొడుకు అనుబంధంలోని సంక్లిష్టతలను, ప్రేమను, కోపాన్ని మరియు మర్యాదను అద్భుతంగా ఆవిష్కరించే ఈ రచన మణికాంత్ గెల్లి కలం నుండి జాలువారిన భావోద్వేగ కావ్యం. నాన్న అంటే కేవలం ఒక వ్యక్తి కాదు — ఆయన ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక జీవన పాఠం.

    ఈ పుస్తకంలో రచయిత తన నాన్నతో గడిపిన క్షణాలను, వారి మధ్య జరిగిన మాటల యుద్ధాలను, మౌన సంభాషణలను, మరియు అనుచ్చరితమైన ప్రేమను అత్యంత సహజంగా మరియు హృదయస్పర్శిగా చిత్రిస్తారు. తండ్రి కోపం వెనక దాగిన అపారమైన ప్రేమను, మర్యాద వెనక ఉన్న ఆత్మీయతను పాఠకులు తమ స్వంత జీవితాలలో అనుభవించినట్లు అనిపిస్తుంది.

    తెలుగు కుటుంబ విలువలను, తరాల మధ్య అంతరాలను, మరియు తండ్రి-పిల్లల బంధపు లోతును అర్థం చేసుకోవాలనుకునే ప్రతి పాఠకుడూ తప్పక చదవాల్సిన పుస్తకం.

  • Nee Runam Theeredi Etla? – నీ రుణం తీరేది ఎట్ల? by Racha Ravi

    275.00

    Nee Runam Theeredi Etla? – నీ రుణం తీరేది ఎట్ల? by Racha Ravi

  • Odyssey-Homer

    250.00

    ప్రపంచ సాహిత్యంలో అమరగాథ

    ఒడిస్సీ  — హోమర్ రచన | వెంకట్ శిద్ధారెడ్డి అనువాదం

    సముద్రాలు, ప్రమాదాలు, దేవతలు, రాక్షసులు… ఒడిసీయస్ యాత్ర అన్నింటిని జయిస్తుంది!

    ప్రపంచ సాహిత్యంలో అమరగాథమైన హోమర్ రచించిన ఒడిస్సీ ను వెంకట్ శిద్ధారెడ్డి తెలుగు పాఠకులకు అందించిన ఈ అనువాద రచన, 214 పేజీలలో ఒక అపూర్వమైన సాహిత్య అనుభవాన్ని అందిస్తుంది. ట్రాయ్ యుద్ధం తర్వాత తన స్వగృహానికి తిరిగి వెళ్ళే ఒడిసీయస్ ప్రయాణం అనేక సాహసాలతో, దేవతల ఆశీర్వాదాలతో మరియు అడ్డంకులతో నిండియుంటుంది.

  • Palapitta Katha 2025

    200.00

    డా. కామరాజు వెంకట రమణరావు కథలు ఇప్పటిదాకా 80కి పైగా అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కవితలు, సాహిత్య విమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికి ఇతని కథలు మూడు సంపుటాలుగా వెలువడినాయి. అవి ‘పుట్టిల్లు’ (విశాలాంధ్ర, 2013), బురుజు వీధి కథలు (అస్త్ర 2023), కిటికీ అవతల (అస్త్ర 2024). ఇతనికి 2016లో ప్రతిష్టాత్మకమైన ‘చాసో స్ఫూర్తి’ అవార్డు ప్రదానం చేసారు. 2019లో ఇతని కథలమీద ‘కథారూప లక్షణాలు’ అనే విమర్శక గ్రంథాన్ని డా. టి.జి.ఆర్. ప్రసాద్, డా. వి. శ్రీధర్ లు వెలువరించారు. కొన్ని వ్యాసాలు కూడా ప్రచురిత మయ్యాయి. డా. రమణరావు రచనావ్యాసంగాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. రచనలు సామాజిక మార్పుకి దోహదపడాలని విశ్వసిస్తారు

  • Robin Hood by Veturi

    200.00

    చిలిపి చిన్నరి చికిలి పిట్టల

    పలుకు జిలిబిలి పాటలో

    అడవి గాలులు సుడిసి వచ్చే

    వడులలో సవ్వడులలో

    వినిపించు వీనులవిందుగా – రా

    బినుల పాట పసందుగా

    చోరుడైనా-వీరుడూ నగ

    ధీరుడూ సముదారుడూ –

    అయిన రాబిన్ అమరగాథలు

    కదుపుల గిట్ట కుదుపుల

    దుసికిలిన కెంధూళులూ.

  • Sagaram Eedatam Telikem Kadura

    150.00

    సాగరం ఈదడం తేలికేం కాదురా

    నాగ రచించిన సాగరం ఈదడం తేలికేం కాదురా తెలుగు సాహిత్యంలో ఒక స్పూర్తిదాయకమైన రచన. సాగరాన్ని ఈదటం తెలియకుండా అన్న శీర్షిక జీవితంలోని సవాల్లను, అనిశ్చితతలను, మరియు సాహసాన్ని సూచిస్తుంది. 133 పుటల ఈ చిన్న పుస్తకం పాఠకుని హృదయాన్ని లోతుల్లోకి లాగుతుంది.

    • సాహసం మరియు సంఘర్షం: జీవితంలో అనిశ్చితతలను ఎదుర్కొనే విధానాన్ని స్పూర్తిదాయకంగా చిత్రించిన కధానికం.
    • సంక్షిప్త రచన: 133 పుటలలో ప్రభావశాలిగా సాగే కధానికం — తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందిస్తుంది.
    • ప్రేరణాత్మక సందేశం: సాగరాన్ని ఈదటం తెలియకుంటే ఏం చేస్తాం? అన్న ప్రశ్నకు సాహసంగా సమాధానం వెతికే కధానికం.
    • ఆధునిక తెలుగు శైలి: నేటి పాఠకులకు స్పందించే సరళమైన, నేరుగా సాగే వాక్యనిర్మాణం.
  • Savaari-Kathalu సవారీ — కథలు

    170.00

    సవారీ — కథలు

    సంజయ్ ఖాన్ రచించిన సవారీ కథల సంకలనం, తెలుగు కథా సాహిత్యంలో ఒక విశిష్టమైన అధ్యాయం. ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళటం మాత్రమే కాదు — అది మనస్సును, అనుభవాలను, జీవితాన్ని మార్చే ప్రయాణం అన్న సందేశాన్ని ఈ కథలు పాఠకుకు అందిస్తాయి.

    గ్రంథ విశేషాలు

    • వైవిధ్యమైన కథలు: ప్రయాణం అనే ప్రతీకాన్ని కేంద్రంగా చేసుకొని, విభిన్న పాత్రల జీవిత అనుభవాలను చిత్రించిన కధా సంకలనం.
    • మానవ స్వభావం: ప్రతి కధలో మానవ స్వభావంలోని సూక్ష్మతలు, బలహీనతలు నిజాయితిగా అందించిన రచన.
    • సంజయ్ ఖాన్ శైలి: సరళమైన, ప్రవాహంగా సాగే తెలుగు వాక్యనిర్మాణం పాఠకుని కధలోకి లాగుతుంది.
    • సామాజిక అంశాలు: సమాజంలోని వివిధ వర్గాల జీవితాన్ని స్పృశించే కధానికాలు.
  • Tyagaraju Atmavicharam

    300.00

    త్యాగరాజు ఆత్మవిచారం

    భమిడిపాటి కామేశ్వరరావు రచించిన ఈ అపూర్వమైన గ్రంథం, మహాభక్తుడు త్యాగరాజు స్వామి కీర్తనలను గద్యరూపంలో అందించే ఒక అద్వితీయమైన సాహిత్య కృషి. సంగీత సాహిత్యంలో అజరామరమైన స్థానం పొందిన త్యాగరాజు కీర్తనల భావగాంభీర్యాన్ని, భక్తి తత్త్వాన్ని సామాన్య పాఠకులకు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా గద్యంలో రూపొందించడం ఈ రచన యొక్క విశేషత.

    గ్రంథంలో ఉన్న విభాగాలు

    • ఆత్మవిచారం  (కీర్తనల గద్య రూపాంతరం): త్యాగరాజు స్వామి కీర్తనలలోని ఆధ్యాత్మిక సారాన్ని, భక్తి భావాన్ని గద్యంలో వివరించిన విభాగం.
    • ప్రహ్లాద భక్త విజయము: భక్త ప్రహ్లాదుని అచంచల భక్తి, దైవ సంరక్షణ, మరియు సత్యం యొక్క విజయాన్ని చిత్రించే కావ్యం యొక్క గద్య రూపాంతరం.
    • నౌకాచరిత్రము: త్యాగరాజు స్వామి రచించిన నౌకాచరిత్రం — శ్రీరాముని లీలలను వర్ణించే ఈ రచన యొక్క గద్య అనువాదం.
  • Nee Premalo Munigaka

    210.00

    అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.

    వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.

    జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ…..

  • Tholi Gayam

    189.00

    బస్ స్టాప్ పిల్లలంటే ఎంత ప్రేమో! వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి

    అందరూ వెళ్ళిపోతారు. కానీ వాళ్లు మళ్ళీ తిరిగి స్కూల్ నుండి వచ్చే వరకు బస్ స్టాప్ మాత్రం అక్కడే ఒంటరిగా, వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. అది వాళ్లతో మాట్లాడటానికి ఏరోజూ ప్రయత్నించదు, కానీ వాళ్ల మాటలు మాత్రం ఎంతో ఓపికగా, ప్రేమగా వింటుంది. ఆ ముద్దుముద్దు మాటలకు, వాళ్లకి వినపడకుండా నవ్వుతుంది కూడా. పాపం… సాయంత్రం బస్ తిరిగి వచ్చాక అయినా వాళ్లతో కొంతసేపు గడపాలని, రోజంతా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ పిల్లలు బస్ దిగాక, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వకుండా, చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఏదేమైనా, ఎన్నిసార్లైనా… మరో రోజుకోసం ఎదురు చూడటమే తనకి తెలిసిన ప్రేమ.

    బస్ స్టాప్ ఎప్పటిలాగే, ఈరోజూ కూడా పిల్లల మాటలు వినాలని రోడ్ వైపు చూస్తూ ఎదురుచూస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం, బస్ వచ్చేవరకు పక్కవారితో తమ పిల్లలకు ఎంత విలాసవంతమైన జీవితం ఇస్తున్నామో అనే పోటీల్లో నిమగ్నమయ్యి, అప్పుడప్పుడు రోడ్ వైపు బస్ కోసం చూస్తున్నారు. అలా చూసినప్పుడే, రావలసిన సమయానికి బస్ రాలేదని చిరాకుపడుతూ, మళ్లీ తమ పోటీల్లో మునిగిపోతున్నారు.

  • యామం (Yaamam)

    375.00

    Yaamam

    తమిళ సాహిత్యంలో చారిత్రక మైలురాయిగా నిలిచిన యామం — జాతీయ స్థాయి రాగూర్ సాహిత్య అవార్డు (₹1,00,000) విజేత — ఇప్పుడు తెలుగు అనువాద నవలగా మీ చేతుల్లో ఉంది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఎస్. రామకృష్ణన్ రాసిన ఈ తెలుగు చారిత్రక నవలను, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం పొందిన జిల్లేళ్ళ బాలాజీ సజీవంగా తెలుగులోకి తీసుకొచ్చారు.

    పద్దెనిమిదవ శతాబ్దపు వలస భారతదేశం నేపథ్యంలో, ఒకే రాత్రి అంతటా సమాంతరంగా సాగే అయిదు జీవితకథలు ఒక మహానాగరికతను కళ్ళముందు నిలబెడతాయి. మేజిక్ రియలిజం శైలిలో రాసిన ఈ దక్షిణ భారత సాహిత్యం లో మేటి రచన, తమిళ-తెలుగు అనువాద సాహిత్యంలో అరుదైన మణిపూస.

  • Na Jeevita Katha Maxim Gorky

    Original price was: ₹600.00.Current price is: ₹575.00.
  • Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

    200.00

    Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

    విభాగం-1

    వదిలించుకోవలసినవి
    “ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
    ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
    (శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

    భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
    మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
    మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
    మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
    ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………………

  • Adiyogi – The Source of Yoga (Telugu)

    200.00

    Adiyogi – The Source of Yoga (Telugu)

  • Vyasa Ramaniyam By Sri Ramana

    120.00

    Vyasa Ramaniyam By Sri Ramana

  • Three language Dictionary – Telugu – English – HIndi

    300.00

    Three language Dictionary – Telugu – English – HIndi

  • Science ku Desamlo Gaddukalam

    100.00

    Science ku Desamlo Gaddukalam