Best Seller Items

  • Sri Vishnu Vidya

    800.00

    (శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
    “ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —

    -సామవేదం షణ్ముఖ శర్మ

  • Prapancha Cinima Charitra

    750.00

    ఇది మానవజాతి చరిత్ర

    మా ఊరి టెంటు సినిమాలో నేను చిన్నప్పుడు చూసిన తెలుగు సినిమానే నాకు మొట్టమొదట తెలిసిన సినిమా. చదువు కోసం మద్రాసు వచ్చిన తరువాత హిందీ, ఇంగ్లీషు సినిమాలు పరిచయమయ్యాయి. చాలా సంవత్సరాల వరకు సినిమాలంటే ఇవే అనే భ్రమలో ఉండేవాణ్ణి. 1951లో మొట్టమొదటిసారి మద్రాసులో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగినప్పుడు తెలిసొచ్చింది సినిమా విశ్వరూపం ఏమిటన్నది. Yukiwariso, Rashomon, Bycicle Theives, Umbrellas of Cherbourg లాంటి సినిమాలు చూసేసరికి ఒక్కసారిగా సినిమాల మీద నాకున్న దృక్పధం పూర్తిగా మారిపోయింది. ఇదొక గొప్ప కళ. మానవజాతిని ముందుకు నడిపించే శక్తి గల కళ. అప్పట్నుంచి, ప్రపంచంలో ఏ ఏ మూల ఏ ఏ సినిమాలు వున్నాయో వెతకటం మొదలుపెట్టాను.

    ఆ సమయంలో Marie Seton మద్రాసు వచ్చారు. ఆమె ఐసెన్స్టీన్ (Eisenstein) శిష్యురాలు. సినిమా మీద ఎంతో పరిశోధన చేసారు. ఆమెను నేను కలిసాను. రష్యన్…………………..

  • Adhe Kanthi By Mukunda Ramarao

    700.00

    తమిళ ప్రాంతం

    భక్తి అన్నది తలుపులు మూసుకుని తమకు తామే జరుపుకునే ఒక రహస్య ప్రక్రియలాగ, లేదా బహిరంగంగా అయితే పూజారుల పేరుతో వారి అధీనంలో జరగాల్సిన ప్రక్రియలాగ తయారుకావడంతో బౌద్ధం జైనం ప్రజలకు దగ్గరవుతున్న కాలం అది. బౌద్ధానికి, జైనానికి రాజుల అండదండలు కూడా తోడవటంతో ప్రజలో అసంతృప్తి మొదలయింది. దానిని ఎదుర్కొనేందుకు ‘భక్తి ఉద్యమం’ ఒక సంస్కరణ ఉద్యమంలా ముందుకొచ్చింది.

    సంగం కాలం తరువాత పశ్చిమ దక్కనీ ప్రాంతంలో చాళుక్యులు, కాంచీలోని పల్లవులు, మదురైలో పాండ్యులు (పల్లవ పాండ్య రాజ్యాలు పూర్తిగా తమిళ ప్రాంతంలోనివి) ఆరవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకూ ఒకరితో ఒకరు యుదాలు చేసుకుంటూ దక్షిణ ప్రాంతంలో వారి వారి రాజ్య విస్తీర్ణాల్ని, ప్రాబల్యాల్ని పెంచుకుంటూపోయారు.

    ఎనిమిదవ శతాబ్దం మధ్య భాగానికి రాష్ట్రకూటులు బదామీ చాళుక్యుల్ని ఓడించి బదామీ చాళిక్యుల సామ్రాజ్యాన్ని వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. కాలంతోపాటే సంగం కాలపునాటి దేవుళ్లు కూడా రూపాంతరం చెందారు. అప్పటి మాయన్ ‘విష్ణువు’గా, కురింజి పర్వతాల్లోని శివుని కుమారుడు ‘మురుగన్ స్కంద’ లేదా ‘సుబ్రమణ్యుడు’గా, విజయదేవతగా పూజలందుకున్న కొర్రవై (మురుగన్ తల్లి) శివుని భార్యగా చూడబడింది. అనేక శైవ వైష్ణవ దేవాలయాలు నిర్మాణమయ్యాయి. జైనుల్ని, బౌద్దుల్ని తరిమేసే ప్రయత్నాలు అన్ని వైపులనుండి ముమ్మరంగా సాగాయి. ప్రముఖ శివభక్తుడైన అప్పార్, మొదటి మహేంద్రవర్మన్ (580-630) రాజును జైనం నుండి శైవంలోకి తీసుకురాగలిగాడు.

    భక్తి ఉద్యమం పరిధిలో సంప్రదాయవాదులు, బ్రాహ్మణులు, శూద్రులు, దళితులు, స్త్రీలు అందరూ చేరారు. అది దాదాపు 6వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ విస్తరించింది. 6-9 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో రెండు ధార్మిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. శైవారాధకులైన అరవై మూడు మంది ‘నాయనార్లు’, వైష్ణవారాధకులైన పన్నెండు మంది ‘ఆళ్వార్లు’ వారివారి ఆరాధకుల పేరు మీద ఉద్యమాలు తీసుకొచ్చారు.

    ఈ ఉద్యమాలో మొటమొదటిసారిగా అప్పటివరకూ అణచివేయయబడ కులాలవాళు | కూడా ఉండటం విశేషం. ఈ రెండు ఉద్యమాలూ బౌద్ధం, జైనానికి విరుద్ధంగా పనిచేసాయి. సంగమ సాహిత్యంలోని ప్రేమాశౌర్యాలకు, భక్తి విలువల్ని జోడించిన ఆదర్శాల్ని వారు ప్రతిపాదికగా చేసుకున్నారు. సంగమ సాహిత్యంలో శివ, మురుగ, తిరుమల్ ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ ఆ తరువాత భక్తి ఉద్యమ కాలంలో శివుని ప్రాముఖ్యత ఎక్కువగానే ఉన్నా శైవం, వైష్ణవం అంటూ ఏదో ఒకే రూపాన్ని మాత్రమే ఆ ఉద్యమం తీసుకోలేదు. భక్తి కవులు వారు నమ్ముకున్న దైవాలను శృతిబద్దంగా స్తుతిస్తూ గ్రామ గ్రామాలకు తిరుగుతూ ప్రజలను ‘శైవం, వైష్ణవం రెండింటిలోకి వారు తీసుకురాగలిగారు. ధనికులు, వర్తకులు, నైపుణ్యం గల

    అదే……………..

  • మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

    650.00

    ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!

    పదండి చరిత్రలోతుల్లోకి… పదండి తోసుకు!

    మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!

    ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.

    మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.

    సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.

    పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.

    ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.

    మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.

  • Pakudu Rallu

    600.00

    సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
            మద్రాసులో ముడున్నరేళ్ళు ‘చిత్రసీమ’ సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో ‘మాయాజలతారు’ నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                                          …… రావూరి భరద్వాజ 
                                                  
    రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన ‘పాకుడురాళ్లు ‘నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో ‘విశ్వంభర’ రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

  • Susrutha Samhita

    600.00

    సుశ్రుతసంహిత – చికిత్సాస్థానము

    ప్రథమాధ్యాయము

    అవతారిక :- ఆయుర్వేదము యొక్క ప్రయోజనములు రెండు విధములు. వ్యాధులచే బీడింపబడువారికి వ్యాధులను బోగొట్టు టొకటి, స్వసులుగా నుండు వారి ఆరోగ్యమును కాపాడుకొను విధులను బోధించు టింకొకటి. ఈ రెండును నెరవేర్చ వలె ననిన వ్యాధితుల కుపకరించు నౌషధాది పరికరములు, దేశ కాలాది స్వరూపములు

    మొదలగువాని జ్ఞానమును, ఆయా ప్రత్యేక వ్యాధుల యొక్క నిదాన – పూర్వరూప – సంపాప్యుపర యాదుల జ్ఞానమును, చికిత్సకును నిదానమునకును గూడ విశేషోపశార మును జేయు శారీరజ్ఞానమును అత్యంతావశ్యకములై యున్నవి. ఆ మూడు విధము లను జ్ఞానములను గలుగ జేయుటకు వరుసగా సూత్ర- నిదాన – శారీర స్థానములు. ఇది వజలో చెప్పబడినవి.

    ఇప్పు డాయుర్వేద ప్రయోజనములగు వ్యాధి చికిత్సా – స్వస్థపరిరక్షణములను వివరింపవలసిన అవసరము కలిగెను. అందు మొదట జెప్పబడిన వ్యాధి చికిత్సాస్వరూప మును విపులముగా నిరూపించి పిమ్మట స్వస్థపరిరక్షణోపాయములను నిరూపింప సమ | కటి ఆ భగవంతుడగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాదులను గురించి చెప్పుచున్నారు…

    ఈ సుశ్రుత తంత్రమును గ్రంథము శల్యతంత్ర ప్రధానముగా చెప్పబడుట చేత ము నుందు అణచికిత్సలను వివరింపవలసియుండుటచేత ద్వివ్రణీ యమును చికిత్సను చెప్పుట శారంభించుచున్నారు, మూ!! అథాతో ద్వివ్రణీయం చికిత్సతం వ్యాఖ్యాస్యామః.

    “యథోవాచ భగవా? ధన్వ నరః సుశ్రుతాయ.

    చికిత్స కవసర మైన పూర్వాంగములు బాగుగా వివరించిన పైని ప్రసక్తమగు వ్యాధి చికిత్సను వివరింపవలసియుండుట చేత ద్విశ్రణీయ మను చికిత్స నీయధ్యాయ మునందు వివరించెద మని శ్రీ భగవద్ధన్వంతరి సుశ్రుతుని కొతు విధముగా జెప్పసాగెనట. మూ|| ద్వౌ వ శోభనతః – శారీర ఆగనుక చేతి. తయోః శారీరః పవన

    పిత్త కఫ శోణిత సన్ని పాత నిమిత్తు, ఆగస్తురది పురుష – పశు …………

  • Ade Nela By Mukunda Rama Rao

    600.00

       అనువాద కళని ఆపోసన పట్టిన రామారావు,. యిప్పుడు “అదే నెల” ద్వారా భారతదేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాల్ని, వాటి చారిత్రక నేపథ్యంలో సహా, మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలిలో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి , దాదాపు మూడు వేల మంది కవుల్ని యూ గ్రంధం ద్వారా అయన పరిచయం చేస్తున్నారు. ఏడూ వందలకు పైగా కవితల్ని అనువదించి, దేశంలోని భిన్న జాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే, వాటిమధ్య ఐక్యత కోసం ఒక వారధిని నిర్మిస్తున్నారు. ప్రాంతం, జాతి, భాష యేదైనా దేశంలోని లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి, కాశ్మిరం నుంచి కన్య కుమారి వరకూ, భిన్నకాలాల్లో వెల్లివిరిసిన భారతీయకవిత్వం దోహదపడుతుందని, వైవిధ్యమే యూ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, “అదే నెల” గ్రంధం మరోసారి నిరూపిస్తుంది.

                                                                                               -ముకుంద రామారావు.

  • Yajusha Purvaprayoga Rathnakaraha

    600.00
    • For kids
    • First published in 2014
    • Copyright by Wpbingo
  • Vidvamsam

    550.00

    కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా? · కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం · అంతర్జాతీయం · అణచివేత – అణచివేత చట్టాలు · విజన్ – విధ్వంసం …

  • Hamsa Vimshati Vignana Sarvasvamu By Dr Gunji Venkataratnam

    500.00

    హంసవింశతి: కావ్యము- కవి

    కథా కావ్యము

    సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. ‘కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.

    కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.

    తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.

    కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది………………

  • Sathavasamthala Ghantasala

    500.00

     శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన” అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.

    -శ్రీశ్రీ

    అతడు కోట్ల తెలుగుల ఎద
    అంచుల ఊగిన ఉయాల
    తీయని గాంధర్వ హేల
    గాయకమణి ఘంటసాల

    – డాక్టర్ సి. నారాయణ రెడ్డి
    ఘంటసాలవారి కమనీయ కంఠాన
    పలుకనట్టి రాగ భావమేది!
    ఘంటసాలవారి గాన ధారలలోన
    తడియనట్టి తెలుగు టెడద యేది!

    – దాశరధి

    చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
    తళతళ మెరయు గంధర్వతార
    తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
    వేలకొలది గీతమ్ముల నాలపించి
    ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
    కంఠకర్తారమాల! మా “ఘంటసాల!”

    – కరుణశ్రీ

  • Adugaduguna Tirugubatu

    499.00

    నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

    నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………