Aathi Goppa Rahasyam

Rs.699.00

In stock

ప్రారంభం

‘ది సీక్రెట్’ను 2006లో విడుదలచేసిన తర్వాత నా జీవితం నేను కలలు కన్న జీవితంగా మారిందని నేను మాత్రమే చెప్పగలను. ది సీక్రెట్ సూత్రాలను మతపరంగా సాధన చేయసాగాను. నా మనస్సు ప్రధానంగా అనుకూలంగా మారింది. దానివలన నా జీవితం అనుకూల స్థితిలో ప్రతిబింబించింది. నా సంతోషం, ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక విషయాలలో ఈ స్థితి కనిపించింది. నాలోని ఒక సహజమైన ప్రేమతో జీవితంలో అన్నిటికీ నేను కృతజ్ఞతగా ఉండడం కూడా జరిగింది.

కానీ ఇన్ని జరిగినా, లోలోపల నన్ను మరేదో సత్యాన్వేషణకు ప్రేరేపించసాగింది. నా శోధన కొనసాగించమని ఏదో శక్తి నన్ను ముందుకు నడిపిస్తోంది. అయితే ఎందుకోసం అనేది నాకు తెలియదు.

ఆ సమయంలో ఎలా మారానో తెలియదు. ఒక పది సంవత్సరాల ప్రయాణం! యూరోప్లో ప్రాచీన సంప్రదాయం రోజ్ క్రాస్ ఆర్డర్, బోధనల అధ్యయనంతో ప్రయాణం ప్రారంభించాను. అనేక సంవత్సరాలపాటు వారు చేసిన ప్రగాఢ బోధనలను నేను అధ్యయనం చేశాను. అంతేకాక, కొన్ని సంవత్సరాలపాటు బౌద్ధమతం, క్రైస్తవ మతానికి చెందిన అనేక పుస్తకాలు, వేదాంతం, హిందూమతం, తావోయిజం, సూఫిజంలపై అధ్యయనం చేశాను. ప్రాచీన సాంప్రదాయాలను అధ్యయనం చేసిన తర్వాత, నా శోధన వర్తమానం వైపు మళ్లింది……….

author name

Rhonda Byrne

Format

Paperback