Best Seller Items

  • Meeku Merem Cheppukovali

    165.00

    మీ కలలను సాకారం చేసుకునే శక్తీ మీరు సృష్టించుకోగలరు.

    ఈ రహస్యాలు తెలుసుకుని ….

    మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,

    మీకు మీరేం చెప్పుకోవాలి.

     

    మీ దృక్పధాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.

     

    * నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.

    * నాలో ప్రతిభ, సామర్ద్యం, నైపుణ్యం అన్ని వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.

    * ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.

    * నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.

    * నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనుక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.

  • Sradhdhaagni Jwaala

    175.00

    మొదటి ప్రసంగం

    మనం ఏదో ఆదర్శం గురించో, విశ్వాసం గురించో, ఏదో సంస్థ కోసమో ఏ రకమైన ప్రచారమూ చెయ్యడం లేదని ముందుగా నేను చెప్పదల్చుకున్నాను. బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతున్నదనేదాన్ని మనం కలిసి పరిశీలిస్తున్నాం. దీన్ని మనం భారతీయ లేక అమెరికన్ లేదా యూరోపియన్ దృక్పథాల ద్వారానో, ఏదో ఒక నిర్దిష్ట జాతీయ ప్రయోజనం దృష్ట్యానో చూడటం లేదు. ప్రపంచంలో నిజంగా ఏం జరుగుతోంది అన్న దానిని మనం కలిసి గమనిస్తున్నాం.

    మనం కలిసి ఆలోచిస్తున్నాం. అయితే ఒకే మనసుతో లేక ఒకే మానసిక ధోరణితో కాదు. కలిసి ఆలోచించడానికీ, ఒకే మనసుతో ఆలోచించడానికీ తేడా ఉంది. ఏకచిత్తం ఉండటం అంటే మనం ఏవో విశ్వాసాలకు, భావనలకు చేరుకున్నట్లు. ఒక నిశ్చయానికి వచ్చేసినట్లు. కాని కలిసి ఆలోచించడం అనేది చాలా విభిన్నమైనది. జరుగుతున్న విషయాలని నిరపేక్షంగా, నిష్పక్షపాతంగా చూసే…………….

  • Rameshwaram Kaakulu By Patanjali Sastri

    175.00

    పర్యావరణ వేత్త, కథకుడు తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి పేరు లేకుండా ఉత్తమ తెలుగు సాహిత్యం ఎప్పుడు పూర్తి కాదు. ఈ పుస్తకం లోని కథల్లో శాస్త్రి గారు తన సమాంతర వాస్తవికత దృక్పథానికి ఒక తాత్విక కోణాన్ని జత చేసారు. ఈ తాత్విక కోణం అనేది ఇదివరకటి కథల్లో లీలగా ఉన్నా కూడా ఈ సంకలనం లోని కథల్లో అది మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కారణం చేత ఇందులో కథలన్నీ ఓ మెట్టు పైనే ఉండడమే కాకుండా శాస్త్రిగారి భావజాలం లో వచ్చిన స్పష్టతకి అద్దం పడతాయి. అందుకే ఈ కథలు అన్ని ప్రపంచ ప్రఖ్యతి పొందిన కథల పక్కన పీఠం వేసుకుని కూర్చుంటాయి. In one word his stories are creative puzzles

    – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

  • Shikhandi

    175.00

    క్వియర్లలో ఎన్ని రకాలున్నారో ముందు అర్థం చేసుకుందాం

    నాది పురుష శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.
    నాది స్త్రీ శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.

    నాది పురుష శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.
    నాది స్త్రీ శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.

    నా శరీరం స్త్రీదో, పురుషుడిదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.
    నా శరీరం పురుషుడిదో, స్త్రీదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా పురుషుడి పట్లే.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీలను కోరుకుంటాను.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నేను పురుషుల్ని కోరుకుంటాను……………..

  • Gupta 91 By Patanjali Sastri

    175.00

    గుప్తా ’91

    గుప్తా తడిలేకుండా శుభ్రంగా తల తుడుచుకుని వచ్చి చంకల్లో కొంచం పౌడరు చల్లుకొని, తువ్వాలు అవతల పారేసి లోపలి లాగులో అద్దం ముందు కూచున్నాడు. వంటింట్లో గుప్తాకి లంచి బాక్సు పెట్టి, అతని సంచిలో పెట్టి గదిలోకి వచ్చింది పార్వతి. చేతిలో దువ్వెన పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నా డతను. బ్రాహ్మీ నూనె సీసాలోంచి కొంచెం నూనె అరచేతిలోకి ఒంపుకుని రెండు చేతులకి రాసుకొని ఎదురుగా నుంచుని అతని నల్లటి వంకీల జుట్టుకి రాస్తోంది. ఆమె తెల్లటి పొట్ట అతనికి దగ్గరగా ఉండటంతో ముందుకు జరిగి పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు గుప్తా.

    “చాల్లెండి సంబడం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటి?” |
    “ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికి దీనికి సంబంధం ఉందాసల?”
    “ఇంక దువ్వుకోండి. మీ అమ్మగారికి టిఫిను పెట్టాలి.”
    “పూజ అవ్వలేదా?”
    “అత్తగారివాళ ఉషారుగా ఉన్నారు.”
    “అదేం?”

    “ఆవిడ ఫెండు మజ్ఞాన్నం ఒస్తాడట. కొంచెం టిఫిను ఎక్కువ చెయ్య | మన్నారు.”……………..

  • Manasu Gathine Marchina ‘Freud’

    175.00

    మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.

                 ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.

  • Amerika Ammayi

    175.00

    హ్యాపీ నూతన సంవత్సరం
    ఉద్యోగాల కోసం కొందరు, చదువుల కోసం కొందరు, ఇలా వారి వారి కలల వెంటపడి చేరుకునే గమ్యం ఒకటి ఉంది… అదే అమెరికా!
    చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడి నుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడివారైనా పూర్ణకుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పి.లు అనీ అనుకునే రోజుల నుండీ… ‘ఆ వదినా, మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను. దార్లో మీ అబ్బాయికి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. ఇచ్చేసి వస్తాను’ అనే రోజుల్లోకి వచ్చేసాము. దూరం కొద్దీ విలువని అంచనా వేసే మనం, ఆ దూరం తగ్గిపోయేసరికి విలువనీ తగ్గించేస్తున్నామేమో?
    ప్రపంచంలో అందరూ రెండే రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఉత్తములు అయితే మరొకళ్ళు అధములు. వీళ్ళు కాకుండా మరొక రకం ఉంది. అదే ‘మధ్యముల్’ అన్నమాట. పైన చెప్పిన రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అందరి సమస్యలు నెత్తిన వేస్కుని భూభారాన్ని మోసేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో ఫస్టు ఉండేవాళ్ళలో నేనొకదాన్ని. ఉద్యోగం వదిలేసి భర్త వెంట అమెరికావాసం వచ్చిన కాండిడేట్ని. వీసా సమస్యల వల్ల ఇంట్లో……………..

  • That Last Melody

    175.00

    అది సాన్ జోస్ లోని వాలెన్ బర్గ్ పార్క్. ఉదయం ఏడున్నర అవుతోంది. ‘ బ్లాక్ ట్రాక్ సూట్ లో చేతికి స్మార్ట్ వాచ్, చెవుల్లో ఇయర్ బడ్స్ వాటర్ బాటిల్ పట్టుకుని జాగింగ్ చేస్తోంది సారా.
    పాటలు వింటూ చుట్టూ గమనిస్తూ ప్రశాంతంగా తన ప్రపంచంలో తాను విహరిస్తోంది.
    కనువిందు చేసే ఆ పచ్చదనాన్ని చూస్తూ, చెట్ల మీద కిలకిలమంటూ కచేరీ చేస్తున్న పక్షులని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ‘ఉడికించే చిలకమ్మా నన్నూరించే అనే లిరిక్స్ వినిపించింది చెవిలో.
    అక్కడి తెల్ల పిల్లలు కొందరు హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆలాపించే’.
    తన ముందు ఒక అమెరికన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ నడవడం గమనించింది. ‘ముత్యాల బంధాలే నీకందించే
    వాళ్ళని చూడగానే ఏదో గుర్తొచ్చి కాస్త బాధ పడింది. ‘అచ్చట్లు ముచ్చట్లు.
    ఆ ఆలోచనలతో నడక, పాట రెండూ ఆపింది. ఆ అమెరికన్ జంటను చూసి ఒకవైపు బాధ, మరోవైపు ఈర్ష్య, ఇంకో వైపు కోపం, ఇలా ఎన్నో భావాలు ఒక్కసారిగా కలిగాయి. వాళ్ళని దాటి జాగింగ్ చేస్తూ తనవైపుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. చూడ్డానికి ఇండియన్లా ఉన్నాడు. మరీ పొడవు కాదు, అతడి బరువుకు తగిన హైట్. చామనఛాయ రంగు. ఎర్లీ తర్టీస్లోలో ఉండి ఉండొచ్చు. జాగింగ్ సూట్లో, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు……………..