Best Seller Items

  • Rafi

    225.00

    టు విద్యా రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విశేష కృషి సాగిస్తున్న కొద్దిమంది ఆధునిక తెలుగు రచయిత్రులలో సి. మృణాళిని స్థానం ప్రత్యేకం. పాత్రికేయురాలిగా, రేడియో వ్యాఖ్యాతగా, బుల్లితెర కార్యక్రమాల నిర్వాహకురాలిగా, విమర్శకురాలిగా, కథకురాలిగా, అనువాదకురాలిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యురాలిగా బహుముఖ ప్రతిభను చాటిన మృదుభాషి మృణాళిని. తన ప్రతిభను గౌరవిస్తూ ఇప్పటివరకు 23 పురస్కారాలను వివిధ సంస్థలు ఆమెకు అందజేశాయి.
    – సి. మృణాళిని

  • Rayalaseemalo Aadhunika Saahityam

    225.00
    విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
  • Oke Okkati

    299.00

    1 ఒకే ఒకటి

    1991 జూన్ 7 వ తేదీన భూమి 112 నిమిషాలపాటు అదిరింది. నిజంగా కాదు, అలా అనిపించింది అంతే.

    నేను ప్రఖ్యాత హాస్య చిత్రం ‘సిటీ స్లిక్కర్స్’ చూస్తున్నాను. ప్రేక్షకుల నవ్వులతో హాలు దద్దరిల్లి పోయింది. ఇంతవరకు వచ్చిన వాటిలో అది అత్యంత హాస్యచిత్రంగా పేరు పొందింది. అందులో అనూహ్యమైన జ్ఞానగుళికలు, అంతర్ దృష్టి డోసులు

    కూడా ఉన్నాయి. మరుపురాని ఒక దృశ్యంలో పట్టువదలని కౌ బాయ్ కర్లీ (కీర్తిశేషులు జాక్ పాలన్స్ నటించారు), సిటీ స్లిక్కర్ మిచ్ (బిల్లీ క్రిస్టల్ ఆ పాత్రలో) తప్పిపోయిన పశువులను వెతకటానికి బయలుదేరుతారు. ఆ సినిమాలో ఆద్యంతమూ దాదాపు వారు ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. పక్కపక్కనే సవారి చేస్తూ చివరికి ఇద్దరూ జీవితాన్ని గురించి ఒక సంభాషణలో కలుస్తారు. ఉన్నట్టుండి కర్లీ తన గుర్రాన్ని ఆపి మిచ్ వైపు తిరుగుతాడు.

    కర్రీ : నీకు జీవిత రహస్యం తెలుసా?

    మిచ్ : తెలీదు. ఏమిటి?

    కరీ : ఇది. [ఒక వేలు పైకి ఎత్తుతాడు]

    మిచ్ : నీ వేలా?

  • Banavathi

    250.00

    ప్రవేశిక

    ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, ‘త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి’ అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.

    అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?

    పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.

    ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం……….

  • Vidvamsam

    550.00

    కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా? · కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం · అంతర్జాతీయం · అణచివేత – అణచివేత చట్టాలు · విజన్ – విధ్వంసం …

  • Adugaduguna Tirugubatu

    499.00

    నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

    నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………

  • Bhramana Kaanksha

    300.00

    పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.

    ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.

    – అత్తలూరి నరసింహరావు

  • Jeevana Laalasa

    300.00

    విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా

    సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో

    నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.

    విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.

    ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….

    ఎన్. వేణుగోపాల్

  • Maha Swetha Devi

    350.00

    చోళీకే పీచే

    అనువాదం: కలేకూరి ప్రసాద్

    ‘అక్కడేముంది?’ అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు – ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు – హత్యలు – లాకప్లో చిత్రహింసలు వగైరా… వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం… చోళీకే పీఛే – రవికె మాటున….

    జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి – అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి ‘ఆత్మ’పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.

    ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ – కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా ‘ఖల్నాయక్ ‘ కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది……………..

  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    200.00

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

  • Shikhandi

    175.00

    క్వియర్లలో ఎన్ని రకాలున్నారో ముందు అర్థం చేసుకుందాం

    నాది పురుష శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.
    నాది స్త్రీ శరీరం. ఆ శరీరాన్ని నేను ఆమోదిస్తున్నాను. దీన్ని నేను అందరికీ ఇస్తాను.

    నాది పురుష శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.
    నాది స్త్రీ శరీరం. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నాకు ఎవరి పట్లా వాంఛ లేదు.

    నా శరీరం స్త్రీదో, పురుషుడిదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.
    నా శరీరం పురుషుడిదో, స్త్రీదో నాకు తెలియదు. నన్ను నేను స్త్రీలా భావించుకుంటున్నాను.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీదై ఉండాల్సింది. నాకు స్త్రీల పట్లే వాంఛ కలుగుతుంది.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిదై ఉండాల్సింది. నాకు పురుషుల పట్లే వాంఛ కలుగుతుంది.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. స్త్రీలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ స్త్రీల పట్లే.
    నాది స్త్రీ శరీరం. పురుషుడిలా బట్టలు వేసుకుంటాను. నా వాంఛ పురుషుల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీ పురుషులిద్దరి పట్లా నాకు వాంఛ ఉంది.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా పురుషుడి పట్లే.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నా వాంఛ కూడా స్త్రీల పట్లే.

    నాది పురుష శరీరం. పురుషుడిలానే బట్టలు వేసుకుంటాను. స్త్రీలను కోరుకుంటాను.
    నాది స్త్రీ శరీరం. స్త్రీలానే బట్టలు వేసుకుంటాను. నేను పురుషుల్ని కోరుకుంటాను……………..

  • Zero Number One

    150.00

    స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.

    అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..

  • Vayuputra Sapadam

    325.00

    చెడు విజ్ర్రంభించింది

    ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!

    శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో…. ఆ నీలకంఠ… తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!

    ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!

    మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?

    ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!

    ‘అమిష్, తూర్పు పాలో కోయిలో ఆయే మార్గంలోనే పయనిస్తున్నాడు’ – బిజినెస్ వరల్డ్

    ‘అద్బుతమైన వర్ణనాత్మక శైలి’ – శశి ధరూర్

    ‘భయంకరమైన యాక్షన్ ప్రతి పేజీని ఉత్కంఠభరితంగా చదివేలా చేస్తుంది’ – అనిల్ ధర్కర్

  • Sita Mithila Yodha

    350.00

    ఆమె మనకు అవసరమైన యోధురాలు,

    మనం నిరీక్షించిన దేవత,

    ఆమె ధర్మాన్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది,

    భారతదేశం, 3400 బి.సి.

    భారతదేశం విభేదాలు, విద్వేషం, పేదరికంతో అల్లాడుతోంది ప్రజలు పాలకులను ద్వేషిస్తున్నారు. స్వార్థపరులైన, అవినీతిపరులైన ఉన్నతవర్గాల వారిని అసహ్యించుకుంటున్నారు. చిన్న చిదుగు అంటుకుంటే సంక్షోభమే. విదేశీయులు ఈ విభేదాలను ఉపయోగించుకుంటున్నారు. లంక రాక్షసరాజు రావణుడు రోజురోజుకీ శక్తిమంతుడవుతూ దురదృష్టవంతమైన సప్తసింధులో తన కోరలను లోతుగా దింపుతున్నాడు.

    పవిత్ర భారతభూమికి రక్షకులుగా ఉన్న రెండు శక్తివంతమైన తెగలు ఇంక ఉపేక్షించి చాలు అనుకున్నాయి. రక్షకుడు అవసరం అని భావించాయి. అవి అన్వేషణ ఆరంభించాయి. ఎవరో పసిబిడ్డను పొలంలో అనాథగా వదిలి వేశారు. తోడేళ్ళ బారు నుంచి ఒక రాబందు ఆమెను కాపాడింది. అందరూ విస్మరించిన, శక్తిహీనమైన మిథిల రాజ్యపాలకుడు ఆమెను దత్తత తీసుకున్నాడు. ఈ బిడ్డ ఏదో సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. కాని వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆమె సామాన్య బాలిక కాదు. ఆమె సీత.

    అమీష్ తాజా నవలతో మీ పౌరాణిక యాత్రను కొనసాగించండి: దత్తత తీసుకున్న అమ్మాయి చేసే ఉత్కంఠభరిత సాహసాలు చూడండి. ప్రధానమంత్రి అయింది. తరువాత దేవత అయింది. రామచంద్ర గ్రంథమాలలో ఇది రెండో పుస్తకం. మిమ్మల్ని వెనక్కి తీసుకెళుతుంది. ఎంత వెనక్కి అంటే ఆరంభానికి ముందేం జరిగిందో తెలుసుకొనేటంతగా. అమీష్ పౌరాణిక కల్పన గతాన్ని శోధించి భవిష్యతు అవకాశాలను ఒడిసిపడుతుంది.

    – దీపక్ చోప్రా

  • Suputrika Praptirastu

    200.00

    సుపుత్రికా ప్రాప్తిరస్తు

    “తిరుమల ఎందుకండీ”

    అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.

    “దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.

    “ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.

    మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.

    “మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది

    మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.

    భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.

    తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..

  • Sachin Tendulkar- Playing It My Way

    495.00

    సచిన్ టెండూల్కర్

    ప్లేయింగ్ ఇట్ మై వే – నా ఆత్మ కధ

    ఏ ఆత్మ కధా కూడా రచయిత జీవితంలో ప్రతీ వివరాన్ని ముందుంచలేదని నాకు అనిపించింది. అది సాధ్యం కాదు. ఎదో ఒక కారణం వల్ల రాయటానికి వీల్లేని వ్యక్తిగతమైన లేదా బహుశా సున్నితమైన అంశాలు ఉంటాయి. అయినా ఇప్పటి వరకు నేను నా కెరియర్ ని ఒక పూర్తి కధకు దగ్గరగా ఉండేలా చేయటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. నేను వర్ణించిన చాలా సంఘటనలు క్రికెట్ అభిమానులకు తెలిసినవే కానీ నేను ఇది వరకు అందరి ముందు చెప్పని ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. వాటిల్లో కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉన్నాయి, పాటకులకు ఆసక్తి కలిగించేవి ఎన్నో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.

    – సచిన్ టెండూల్కర్

    ముంబయిలో పుట్టిన సచిన్ టెండూల్కర్ 1989 లో 16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లో తొలిసారిగా తన టెస్ట్ ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత అపురూపమైన, మనోరంజనం కలిగించే బ్యాట్స్ మన్ లలో ఒకరు, టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు రెండింటిలో కూడా వేరే ఇతర క్రీడాకారుడి కంటే ఆయన ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసి విజయం సాధించారు. ఆయన తన 17వ ఏట తోలి టెస్ట్ సెంచరీ చేశారు. 36వ ఏట ఆయన వన్డే డబుల్ సెంచరీ చేసిన తోలి క్రీడాకారుడుగా మారారు. 2012 లో తన 100వ అంతర్జాతీయ సెంచరీనీ సాధించారు. 2009 లో ఆయన భారత్ తో ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకొని 2011 లో ప్రపంచ కప్పు గెలుచుకున్నారు. 2013 లో తన స్వస్థలం ముంబయి ప్రజల ముందు తన 200వ మరియు చివరి టెస్ట్ ఆడిన తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించారు.

  • Rameshwaram Kaakulu By Patanjali Sastri

    175.00

    పర్యావరణ వేత్త, కథకుడు తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి పేరు లేకుండా ఉత్తమ తెలుగు సాహిత్యం ఎప్పుడు పూర్తి కాదు. ఈ పుస్తకం లోని కథల్లో శాస్త్రి గారు తన సమాంతర వాస్తవికత దృక్పథానికి ఒక తాత్విక కోణాన్ని జత చేసారు. ఈ తాత్విక కోణం అనేది ఇదివరకటి కథల్లో లీలగా ఉన్నా కూడా ఈ సంకలనం లోని కథల్లో అది మరింత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కారణం చేత ఇందులో కథలన్నీ ఓ మెట్టు పైనే ఉండడమే కాకుండా శాస్త్రిగారి భావజాలం లో వచ్చిన స్పష్టతకి అద్దం పడతాయి. అందుకే ఈ కథలు అన్ని ప్రపంచ ప్రఖ్యతి పొందిన కథల పక్కన పీఠం వేసుకుని కూర్చుంటాయి. In one word his stories are creative puzzles

    – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

  • Lanka Yuddam By Amish

    499.00

    ఇందులోని పాత్రలు,
    ముఖ్యమైన తెగల జాబితా
    (అకారాది క్రమంలో)

    అకంపనుడు: ఒక అక్రమ రవాణా వ్యాపారి, రావణుని సన్నిహిత సహాయకుడు అరిష్టనేమి: మలయపుత్రుల సైన్యాధ్యక్షుడు, విశ్వామిత్రుని కుడిభుజం

    అన్నపూర్ణా దేవి: మలయపుత్రుల రాజధానియైన అగస్యకూటంలో నివసించే ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు

    అశ్వపతి: భరతఖండానికి నైరుతి సరిహద్దురాజ్యమైన కేకేయ రాజ్యానికి రాజు, కైకేయికి తండ్రి, దశరధునికి విశ్వాసపాత్రుడైన సహచరుడు

    భరతుడు: రాముని సవతి సోదరుడు; దశరధుడు, కైకేయిల పుత్రుడు

    దశరథుడు: కోశల చక్రవర్తి, సప్తసింధు సామ్రాజ్యాధినేత, రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నుల

    హనుమంతుడు: ఒక నాగా, వాయుపుత్ర తెగ సభ్యుడు

    ఇంద్రజిత్తు: రావణుడు, మండోదరిల పుత్రుడు

    జనకుడు: మిథిలకు రాజు, సీతకు తండ్రి

    జటాయువు: మలయపుత్ర తెగలో ఒక దళపతి, సీతారాములు నాగా మిత్రుడు.

    కైకసి: రుషి విశ్రావసుని మొదటి భార్య, రావణ కుంభకర్ణుల తల్లి

    కన్యాకుమారి: కన్యారూపంలోని దేవత అని అర్థం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాలికల శరీరంలో మాతృదేవత (అమ్మతల్లి) తాత్కాలికంగా నివసిస్తుందని విశ్వాసం. అలాంటి బాలికలను సజీవదేవతా మూర్తులుగా అర్చించేవారు

    ఖర: లంకాసైన్యంలో ఒక దళపతి, సమీచి ప్రియుడు……………..

  • Gangarajam Bidda

    150.00

    బోర్లించిన చెప్పు

    అనుకోకుండా ‘అమ్మ’ ఫోన్ చేసింది. శరత్కు నెల కింద కొడుకు పుట్టాడట. ఫంక్షన్ ఇవ్వాళ సాయంత్రం రంగనాథ ఆలయంలో చేస్తున్నారు. అందరినీ రమ్మని చెప్పింది. మరీ ఆలస్యంగా చెబుతున్నందుకు ‘మాఫ్’ చేయమంది. ‘కిస్మత్’ ఉండబట్టి, నా నంబర్ అంకుల్ పాతడైరీలో దొరికిందట. మగవాళ్లను అంకుల్ అని పిలిచినా, కొంచెం పెద్ద వయసు ఆడవాళ్లను నేను అమ్మ అనే అంటాను. కొత్తపేట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ల పై పోర్షన్లో మేము కిరాయికుండేవాళ్లం.

    ఆదివారం, అందునా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, పైగా పెద్ద ఎంగేజ్మెంట్స్ కూడా లేవు కాబట్టి బయల్దేరాను. హైదరాబాద్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. మాకు ఇంత దగ్గర్లో ఇంత పెద్ద గుడి వుందనే తెలీదు నాకు. గుడికి బయట అంటూ ఏమీలేదు. చెప్పుల్తోనే లోనికి వెళ్లి, భారీ దర్వాజా పక్కకు విడిచాను. వదిలిన చెప్పుల్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువమంది వచ్చినట్టు లేదు. ఫంక్షన్ ఆరింటికని చెప్పింది. ఫ్యామిలీగా వెళ్తే వేరే… ఇలాంటి చోట నాకు ఏమీ తోచదనే, మరీ టైముకు వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని ఓ అరగంట ఆలస్యంగా చేరేట్టే ప్లాన్ చేసుకున్నాను. అయినా జనం వచ్చినప్పుడే వస్తారు.

    రోడ్డు పక్కనున్న గుడే అది. అయినా అంతటి రొద లోనికి రాకుండా గడప ఆలయాలకే ప్రత్యేకమైన నిశ్శబ్దం చెవులకు వినబడుతోంది. వెళ్తూనే, అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించింది, “కైసే హో బేటా” అంటూ, పొద్దున…………

  • Avunu Nenu Gelavalanukuntunnanu Kani Ela?

    120.00

    సంతోషంగా ఉండండి (Be Happy)

    ఎప్పుడు సంతోషంగా ఉండడం మన హక్కు, సంతోషమే సగం బలం. కానీ, ఎక్కువ మంది ఈ విషయం గుర్తించక ఎప్పుడు ఏదో నిరాశతో, బాధతో బ్రతుకుతూ ఉంటారు. బాధపడటం అనేది Negative Energy. దీని వలన మనకు అన్ని Negative ఫలితాలు ఉంటాయి కానీ Postive ఫలితాలు ఉండవు. ‘మనం బాధతో ఉంటే దానిని బ్రతకడం అంటారు. సంతోషంగా ఉంటే దానిని జీవించడం అంటారు. సంతోషం మరియు నవ్వుతో యవ్వనం తిరిగి వస్తుంది. ”

    –షేక్స్పియర్

    ఆనందానికి FORMULA :-

    ఆనందం = ఆరోగ్యం +సంపద+మంచి మానవ సంబంధాలు

    ఆరోగ్యం = వ్యాయామం + మంచి తిండి + సరిపడ నిద్ర

    సమస్యలు అందరికీ ఉంటాయి :-

    ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది. ఆఖరికి సంపన్నుడు ముఖేష్ అంబానీ కైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్న వాళ్ళకు చిన్న సమస్యలు ఉంటాయి. పెద్దవాళ్ళకు పెద్ద సమస్యలు ఉంటాయి. కానీ, సమస్యలు అనేవి Common

    సమీపంలో ఏదో భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేను ప్రతిరోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడ కాసేపు కూర్చుంటాను. చాలా మంది పేదకార్మికులు అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ పనిచేస్తుంటారు. వారి పిల్లలు ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని “రైలు బండి రైలు” అనే ఆట ఆడుతుంటారు. ఎవరైనా ఒకరు ఇంజన్ అవుతారు, మిగిలినవారు బోగీలు అవుతారు. ప్రతిరోజు ఈ పిల్లలు మలుపులు తిరుగుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉండే ఈ ఆటను చూడడం నాకు ఇష్టమైన దినచర్యగా మారిపోయింది.

    0 చాలా రోజులు వాళ్ళ ఆటలు గమనిస్తున్నాను. ఇంజన్గా ఉన్న పిల్లవాడు మరో రోజు బోగిగా, బోగీగా ఉన్న పిల్లలు ఇంజన్ గా ఇలా మారుతూనే ఉన్నారు కానీ, ఒక చిన్న బాలుడు, సగం నిక్కరు మాత్రమే ధరించి తన చేతిలో ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రాన్ని పట్టుకుని రోజువారీ గార్డుగానే ఉంటున్నాడు………….

  • Attar ( Itara Kathalu)

    150.00
    1. చేజారిన సిరి

     

    “నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.

    “అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.

    ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”

    వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.

    “ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”

    నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,

    “ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….

  • Aruna Netraalu

    150.00
    1. చేజారిన సిరి

     

    “నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.

    “అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.

    ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”

    వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.

    “ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”

    నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,

    “ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….

  • Christu Charitra (Gurram Jashuva Rachanalu)

    100.00

    పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.

    ‘క్రీస్తు చరిత్ర’ (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.

    క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగి చెప్పారు.
    రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు.

    మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. కాని దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పర విరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.

  • Ghost Murders

    300.00

    ఘోస్ట్ మర్డర్స్ !

    రాత్రి పదిదాటింది. ఇంకా భర్త రాజారావు ఇంటికి రాలేదు. విమల పరుపుమీద పడుకొంది. గదిలో జీరో వాట్ బల్బ్ వెలుగుతోంది. ఆమెకు నిద్రపట్టడంలేదు. క్లబ్బులో కూర్చుని చీట్లపేక ఆడుతూ భర్త ఇంటిని మర్చిపోయి వుంటాడు!

    ఏదో చప్పుడయింది. ఉలిక్కిపడుతూ ఆమె లేచి కూర్చుంది. లోపల గదుల్లోంచి ఏదో చప్పుడు వినపడుతోంది. బాత్రూమ్ పక్కనున్న స్టోర్ రూమ్లోంచి ఆ చప్పుడు వస్తోందని ఆమె ఊహించింది. స్టోర్ రూమ్లో ఎంతో తుక్కుంది. ఆ గదిని బాగుచేయడానికి ఆమెకు టైము చిక్కడంలేదు. అప్పుడే ఈ ఇంటికొచ్చి మూడేళ్ళు దాటింది.

    పక్కనే మరో పరుపుమీద పడుకున్న కూతురివైపు ఆమె చూసింది. సుందరి గాఢ నిద్రలోవుంది. ఆమె వయస్సు పదేళ్ళుంటుంది. విమల మళ్ళా పరుపుమీద వాలింది. ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి పక్క ఇంట్లోంచి.

    విమల ఆలోచిస్తోంది పక్కఇంట్లో ఎవ్వరూలేరు. ఇంటికి తాళంవేసి వుంటుంది. పదేళ్ళక్రితం ఎవరో అడ్వకేట్ అందులో వుండేవాడు. కొడుకు చనిపోయాక అడ్వకేట్ భార్యతోసహా కాశీకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దికాలానికి కూతురుకూడా మరణించింది. ఇదంతా ఊళ్ళోవాళ్ళు చెప్తూంటే విమల విన్నది. ఆమెకు బియ్యం అమ్మే మీరయ్య జ్ఞప్తికొచ్చాడు.

    ఆ వీధిలో వాళ్ళందరికీ గత ఇరవై ఏళ్ళగా మీరయ్య బియ్యం అమ్ముతున్నాడు. అతడికి అందరిచరిత్రా తెలుసు.

    “విమలమ్మగారూ, పక్కింట్లో అడ్వకేట్ మూర్తి వుండేవారు. మంచి ప్రాక్టీస్. ఆయనకూతురు డాక్టర్ చలంగార్ని పెళ్ళాడింది. కాని ఆమె చనిపోయింది. కొడుకు శేఖర్ ఈ ఇంట్లోవుండే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెపేరు పార్వతి. పార్వతి చాలా అందంగా వుండేది. పార్వతి ప్రేమ ఫలించలేదు. శేఖర్ చనిపోయాడు. పార్వతి తల్లీ తండ్రి ఈ ఇల్లువిడిచి వెళ్ళిపోయారు,” అన్నాడు మీరయ్య ఒకసారి………………..

  • Mr Mohamatam

    150.00

    మొహమాటం లేకుండా ముందే ఓ మాట

    అన్నిటికన్నా ముందే చెప్పేసేయాలనుకుంటున్న మాటిది. ముందుమాటగా ఇక్కడే కంప్లీట్ క్లారిటీ ఇచ్చేద్దామని. ఈ బుక్ లో ఇంట్రావర్టుల తాలూకు మనస్తత్వం గురించో, తెగ రీసెర్చ్ చేసేసి ఫ్రాయిడ్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పే థిసీస్ ల గురించో, ఇంట్రావర్షన్లోంచి బైటపడాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలనో చెప్పే మనోవైజ్ఞానిక సూత్రాల గురించో ఎక్కడా డిస్కస్ చేయలేదు. అలాంటి అంశాలేవీ పొరపాట్న కూడా ఉండవిందులో

    జస్ట్ ఓ ఇంట్రావర్ నేను అబ్జర్వ్ చేసినవీ, నాకు అనిపించినవీ, ఇలా అయి ఉంటే ఎలా ఉంటుంది అన్న what if కాన్సెప్ట్ ఊహించుకున్నవీ.. అలా రాసుకున్న ర్యాండమ్ రైటింగ్స్ ఛాప్టర్ల కలెక్షనే ఈ బుక్.

    ఈ పుస్తకంతో ఇంట్రావర్ట్స్ అందరూ ఇంతే అని డిఫైన్ చేయడమో,ఈ లక్షణాలు లేకపోతే ఇంట్రావర్ట్స్ కాదు అనో తేల్చే పనేమీ పెట్టుకోలేదు. ఇందులోని సిచ్యుయేషన్స్ మీరు పక్కా ఫేస్ చేసుండాలనీ లేదు. ఇలా నాకెప్పుడూ అనిపించలేదే అని అక్కడక్కడా మీరు ఫీలయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. కొన్నిటి దగ్గర అరే.. ఇది ఎన్నిసార్లు ఎక్స్ పీరియన్స్ చేశానో అనిపించొచ్చు. ఇంకొన్నిటి దగ్గర క్యారెక్టర్కి కనెక్టయి ఆ ప్లేస్ లో మీకు మీరు కనిపించొచ్చు.

    ఫైనల్గా బుక్ ఇలాగే ఉండాలని, ఇలానే రాయాలని లెక్కలేసుకుని రాసింది. కాదు. అఫ్ కోర్స్.. నేను లెక్కల్లో చాలా వీక్) కాబట్టి take light.

    “why so serious”

    జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్.

    – మురళి సర్కార్ (రచయిత)

  • Na Daivam N T R

    250.00

    అది ఒక యోగం.

    ఆయన ఒక దైవం!

    ఇది నిజం.

    ఈనాటి ఈ బంధం ఏనాటిదో…

    ఉడతాభక్తిగా ఈ పొత్తం.

    ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే అభిమానం.

    ఋషిని చూసాను ఆయనలో.

    ౠకలకు కాదు ఇది.

    ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది.

    ఏనాటికీ చెక్కు చెదరని అభిమానం అది.

    ఐరావతం ఎక్కినంత ఆనందం, ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తే… ఒకింత అనుమానం వద్దు, ఆయన దీవిస్తే అంతే… ఓటమి ఉండదు. అంతా ముందడుగే. ఔత్సాహికుల్లారా నిద్రలేవగానే అంతఃకరణ శుద్ధితో ఆయన్ని స్మరించుకోండి. అంతా మంచే జరుగుతుంది.

    అ నుంచి అః వరకు ఇది నా దైవానికి సమర్పించిన అక్షరమాల.

    ఎక్కడో మేడూరు అనే గ్రామంలో పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మల కడుపున నాల్గవ సంతానంగా జన్మించిన ఈ పరుచూరి గోపాలకృష్ణ గుండెల్లో దైవంగా నందమూరి తారకరామారావు గారు ఎలా వెలిశారు, ఆ దైవం ఆశీస్సులు………..

  • Piradousi

    80.00

    సుకవి

    పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సృష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా సృజించినవాడు……………

  • Prapanchaniki Kotha Rupam Edham Kadalirandi

    300.00

    ఉపోద్ఘాతం

    “ఈ భూగోళం మనిషికి మాత్రమే) చెందినది కాదు. మనిషే ఈ
    భూగోళానికి చెందుతాడు. ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే ఒకే రక్తం
    లాగా ఈ భూగోళం తనకు చెందిన చరాచరాలకు మధ్య సంబంధాన్ని
    కలిపే ఉంచుతుంది.”

    – అమెరికాలోని దువామిష్ తెగ నాయకుడి మాట

    ఈ పుస్తకాన్ని వ్రాయటానికి నేను కలమూ, కాగితమూ చేత పట్టుకుని కూర్చున్నప్పుడు, నేను నా ఓక్ బ్రూక్ టెర్రేస్ టవర్లోని పద్దెనిమిదవ అంతస్తులోని గవాక్షం ద్వారా పరికిస్తే, చుట్టూరా చికాగో నగర వినువీధుల్లోని ఆకాశ హర్మ్యాలెన్నో కనిపించాయి. నిజానికి ఈ దృశ్యం గత ఏభై అయిదు సంవత్సరాలుగా నేను చూస్తుండగానే పెరుగుతూ, ఆకాశపు తెల్లమబ్బులను అందుకుంటూ, ఈ ప్రపంచంలో మానవుడు సాధించిన, సాధిస్తున్న ఎన్నో విజయాలనూ, వాటిని సాకారం చేసిన ఎన్నో సాంకేతిక అద్భుతాలనూ ప్రస్తావిస్తున్నాయి. గత డెబ్బది అయిదు సంవత్సరాలలో మన ప్రపంచం ఎన్నో రకాలుగా మార్పు చెందింది. ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొంది. జనాభా నాలుగు రెట్లయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాము. ప్రపంచంలో శాంతి చాలావరకు నెలకొని ఉంది. ఈ సమయంలోనే మౌలిక సదుపాయాలూ పెరిగాయి.

    పేదరికం తగ్గు ముఖం పట్టింది. విద్య అనేది అందరికీ అందుబాటుగా విస్తరించింది. సాంకేతిక విజ్ఞానం పరివ్యాప్తమయింది. ఇంకా మనమందరమూ అనుసంధానించ బడ్డాం.

  • Raaga Saadhika

    100.00

    స్వర్గ నరకముల ఛాయా దేహళి

    చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.

    చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.

    ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.

    ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.

    ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.

    మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.

    ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.

    మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..

  • Sradhdhaagni Jwaala

    175.00

    మొదటి ప్రసంగం

    మనం ఏదో ఆదర్శం గురించో, విశ్వాసం గురించో, ఏదో సంస్థ కోసమో ఏ రకమైన ప్రచారమూ చెయ్యడం లేదని ముందుగా నేను చెప్పదల్చుకున్నాను. బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతున్నదనేదాన్ని మనం కలిసి పరిశీలిస్తున్నాం. దీన్ని మనం భారతీయ లేక అమెరికన్ లేదా యూరోపియన్ దృక్పథాల ద్వారానో, ఏదో ఒక నిర్దిష్ట జాతీయ ప్రయోజనం దృష్ట్యానో చూడటం లేదు. ప్రపంచంలో నిజంగా ఏం జరుగుతోంది అన్న దానిని మనం కలిసి గమనిస్తున్నాం.

    మనం కలిసి ఆలోచిస్తున్నాం. అయితే ఒకే మనసుతో లేక ఒకే మానసిక ధోరణితో కాదు. కలిసి ఆలోచించడానికీ, ఒకే మనసుతో ఆలోచించడానికీ తేడా ఉంది. ఏకచిత్తం ఉండటం అంటే మనం ఏవో విశ్వాసాలకు, భావనలకు చేరుకున్నట్లు. ఒక నిశ్చయానికి వచ్చేసినట్లు. కాని కలిసి ఆలోచించడం అనేది చాలా విభిన్నమైనది. జరుగుతున్న విషయాలని నిరపేక్షంగా, నిష్పక్షపాతంగా చూసే…………….

  • Susrutha Samhita

    600.00

    సుశ్రుతసంహిత – చికిత్సాస్థానము

    ప్రథమాధ్యాయము

    అవతారిక :- ఆయుర్వేదము యొక్క ప్రయోజనములు రెండు విధములు. వ్యాధులచే బీడింపబడువారికి వ్యాధులను బోగొట్టు టొకటి, స్వసులుగా నుండు వారి ఆరోగ్యమును కాపాడుకొను విధులను బోధించు టింకొకటి. ఈ రెండును నెరవేర్చ వలె ననిన వ్యాధితుల కుపకరించు నౌషధాది పరికరములు, దేశ కాలాది స్వరూపములు

    మొదలగువాని జ్ఞానమును, ఆయా ప్రత్యేక వ్యాధుల యొక్క నిదాన – పూర్వరూప – సంపాప్యుపర యాదుల జ్ఞానమును, చికిత్సకును నిదానమునకును గూడ విశేషోపశార మును జేయు శారీరజ్ఞానమును అత్యంతావశ్యకములై యున్నవి. ఆ మూడు విధము లను జ్ఞానములను గలుగ జేయుటకు వరుసగా సూత్ర- నిదాన – శారీర స్థానములు. ఇది వజలో చెప్పబడినవి.

    ఇప్పు డాయుర్వేద ప్రయోజనములగు వ్యాధి చికిత్సా – స్వస్థపరిరక్షణములను వివరింపవలసిన అవసరము కలిగెను. అందు మొదట జెప్పబడిన వ్యాధి చికిత్సాస్వరూప మును విపులముగా నిరూపించి పిమ్మట స్వస్థపరిరక్షణోపాయములను నిరూపింప సమ | కటి ఆ భగవంతుడగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాదులను గురించి చెప్పుచున్నారు…

    ఈ సుశ్రుత తంత్రమును గ్రంథము శల్యతంత్ర ప్రధానముగా చెప్పబడుట చేత ము నుందు అణచికిత్సలను వివరింపవలసియుండుటచేత ద్వివ్రణీ యమును చికిత్సను చెప్పుట శారంభించుచున్నారు, మూ!! అథాతో ద్వివ్రణీయం చికిత్సతం వ్యాఖ్యాస్యామః.

    “యథోవాచ భగవా? ధన్వ నరః సుశ్రుతాయ.

    చికిత్స కవసర మైన పూర్వాంగములు బాగుగా వివరించిన పైని ప్రసక్తమగు వ్యాధి చికిత్సను వివరింపవలసియుండుట చేత ద్విశ్రణీయ మను చికిత్స నీయధ్యాయ మునందు వివరించెద మని శ్రీ భగవద్ధన్వంతరి సుశ్రుతుని కొతు విధముగా జెప్పసాగెనట. మూ|| ద్వౌ వ శోభనతః – శారీర ఆగనుక చేతి. తయోః శారీరః పవన

    పిత్త కఫ శోణిత సన్ని పాత నిమిత్తు, ఆగస్తురది పురుష – పశు …………

  • Thribhujapu Naalugo Konam

    250.00

    విధ్వంస దృశ్యం

    ఇరుకిరుకు దారుల్లో నిప్పు కుంపట్ల మధ్య నడుస్తున్నట్టుగా ఉంది. ధరలు భగ్గుమనడమంటే ఏమో అనుకున్నావ్ ఇప్పుడర్థమౌతోంది కదూ! బాగా కమిలి మగ్గుతున్న, కుళ్ళి పులుస్తున్న, మోటారు ఇంధనం కాలుతున్న, శరీరాల చెమట కంపు కొడుతున్న ఘాటు వాసన గంధక ధూమంలా, చెదరని మేఘంలా ఒళ్ళంతా చిరచిరలాడిస్తూ… పండి పక్వానికొస్తున్న తియ్యటి వాసన కదిలీ కదలని పిల్ల తెమ్మెరలా లిప్తకాలం పాటు ముఖాన్ని స్పృశిస్తూ…

    గాలి వీచదు, చెమట ఆరదు. అయినా, ముదురుటెండలో మార్కెట్ కని బయల్దేరి పాలిస్టర్ చీర ఎందుకు కట్టుకున్నానా అని ఇప్పుడు వాపోవడం నిజంగా బుద్ధితక్కువ పనే. అదిగో ఆ బెంగాలీ అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి. నీలిపూల తెల్లని కాటన్ ప్రింటెడ్ – మైసూర్ కాటన్ లేదా యూపీ హ్యాండ్లూమ్ వెరైటీ… పెద్దపెద్ద పూలతలు డిజైన్ గా అద్దిన పొడవాటి చీరకొంగు దాదాపు నేలకు ఆనుతూ, ఒత్తయిన నల్లని కురచ జుట్టు పోనీటైల్ ముడి చిన్నగా చెదరుతూ, కొంగుచాటు నీలి జాకెట్ ఎగువ నున్నటి మెడ అక్కణ్నుంచి అవతలివైపు దిగువకు విస్తరించుకుపోయిన వీపు అందంగా బహిర్గతమౌతూ, స్లీవ్స్ జబ్బల దంతపు వర్ణం కాంతి మెడలోని సన్నని బంగారు గొలుసు తళతళలతో పోటీ పడుతూ… నాజూకుగా నడుస్తున్న ఆ సింపుల్బ్యూటీ ఆమె మోస్తున్న ప్లాస్టిక్ బుట్టలో నవనవలాడుతున్న కూరగాయల రాశిలాగే తాజాదనానికి నిలువెత్తు నిర్వచనం. పేరు హేమగాత్రి లేదా సుమగాత్రి అయి ఉండాలి. పాలతో స్నానం చేయించినట్లుగా తెల్లగా మెరుస్తున్న బుల్లికారులో స్టీరింగు ముందు కూర్చున్న యువకుడు డోర్ తెరిచి బుట్ట అందుకుంటూ నవ్వుతూ… దబ్బపండు రంగు నిండు బుగ్గల మీద క్లీన్ షేవింగ్ బాపతు పచ్చని చారలు చిత్రంగా సాగుతూ ఎర్రనినోట్లోని సూపర్వైట్ పలువరుస టి.వి. ప్రకటనల్లోలాగా ఫ్లాష్ ఫ్లాష్… నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. జి.ఎం.గారి అబ్బాయో, చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయో అయి ఉండాలి. దేనికైనా పెట్టి పుట్టాలంటారు! ……………

  • Ivee Mana Moolaalu

    450.00

    సాహసం, కానీ ఎంతో అవసరం

    కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.

    ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.

    ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.

    —-ఇవీ మన మూలాలు 7

  • Nenu Mee Bramhanandam

    275.00

    ఈ పుస్తకం ఎందుకు చదవాలి?

     

    నేనేంటో నా సినిమాలు చెప్తాయి…

    నేనేంటో మీ హృదయాలు చెప్తాయి…

    నేనేంటో నా అవార్డులు చెప్తాయి…

    నేనేంటో నా బిరుదులు చెప్తాయి…

    కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు…

    నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,

    ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.

    మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.

    ఆ రెండోవైపే ఈ పుస్తకం!

    ఇందులో నా జీవితం యథాతథం!!

    ***

    ఒకరి అనుభవం – ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.

    ఒకరి అనుభవం – ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.

    ఆ ఒకరు మీరు కావొచ్చు!

    మీలో ఒకరైనా కావొచ్చు!

    అందుకే నేను – నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను………

  • Okka Karachaalanam Chey

    100.00

    చలిని జయిద్దాం

    కిటికీ అద్దాల్ని
    అలుముకున్న చలి
    తలుపుల సందులోంచి
    ఇళ్లలోకి దౌర్జన్యంగా
    దూసుకువస్తోంది

    కాళ్లను చుట్టుకుని
    గోళ్ల నుంచి పాకి
    వేళ్లను మొద్దుబారిస్తోంది
    కనురెప్పలపై పొడిపొడిగా పేరుకుని
    చూపుల్నిమంచుగా మారుస్తోంది
    చలి శరీరాన్ని గడ్డకట్టిస్తోంది
    జీవితాన్ని నిస్తేజం చేస్తోంది.

    మాటలపైనా, పలకరింపులపైనా
    చిరునవ్వుల పైనా
    పొగమంచు క్రమ్ముకుంటోంది
    చలి చర్మాన్ని వేడెక్కకుండా
    అడ్డుకుంటూ
    మెదడులోకి ప్రవేశించి
    ఆలోచనలను
    మృత్యువాయువై చుట్టుకుంటోంది
    చలి నిటారుగా ఉన్న
    వెన్నెముకల్ని పరిహాసమాడుతూ
    కర్కశ స్పర్శతో జలదరింపజేస్తోంది…………..

  • Shikari

    300.00

    శికారి 

    కొట్లాట కొంచెం తెరిపిచ్చె.

    ‘నానా’కు సారాయి మత్తు దిగిందో. ఎక్కిందో తెలేదు. సుంకులమ్మ కట్ట మీద కాల్లు బారజాపుకొని కూచోనుండాడు. కె.సి. కెనాలుకు వొక వారెంబడి కొట్టాలు, మట్టిమిద్దెలు ఉండాయి. వాటిల్లో ఉండే ఆడోల్లు, మొగోల్లు తాగినకాడికి తాగినారు.

    అరిసినకాడికి అరుసుకుండారు.

    గేరి మొగదాల రోడ్డువారగ, రెండు మూడు సాట్ల కొంతమంది ఆడోల్లు సారాయి అమ్ముకుంటా ఉండారు. సన్న సన్న క్యాన్లల్లో, సీసాల్లో సారాయి పోసుకుని కాలువ మీదేసిన రాళ్ల కింద సందుల్లో దాపెట్టినారు. అయిదు రూపాయలకు చిన్న లోటా, పది రూపాయలకు పెద్ద లోటా లెక్కన పోసిస్తుంటారు. దావన బోయేటోలను కూడా తాగేకి రామ్మని పిలుస్తా ఉండారు.

    తాగనీక వచ్చినోల్లు అరుసుకుంటా, గప్పాలు కొడతా ఉండారు.

    కెనాలు గట్టు మీద నుండి బంగారుపేట మెయిను రోడ్డు దాక సారాయి వాసన గాల్లో తేల్తా ఉంది. అది మామూలు సారాయి వాసన గాదు. ఏదేదో కలిసి కుళ్లి మురిగిపోయిన వాసన. ఆడంతా సుళ్లు తిరుగుతుండాది.

    అంతలో ముందు నానా కూతురు ‘గుడ్ల’ బొంగురు గొంతు పెట్టుకోని శికారి గేరంతా ఏకం జేసింది. ‘డొక్కోని’ మీదికిపోయి బండబూతులు తిట్టింది. కీకరక అరిసి మీదబడి కొట్టింది.

    ఆ టయాన ఆమె తాగిందో లేదో గాని, అప్పటికే తాగినోల్లు రయ్యరయ్య సుంకులమ్మ కట్ట మీదికి వచ్చినారు.

    డొక్కో సంగతి మ చెప్పనీక లేదు.

    వాడు కుండ ఉన్నది ఎవరైనా యా పొద్దయినా చూసి ఉంటే గదా.

    పెళ్లాం మీదికి బాణం పోయినట్లే పోయినాడు. జుట్టుపట్టుకోని కిందపడనూకి కొట్టినాడు. గుమి ఎట్ల లేచెనో గాని లేచె. ఒక్క దొబ్బు దొబ్బితే డొక్కోడు యిరుసుకోని ఆంత దూరాన పోయి పడ్నాడు……….

  • Hamsa Vimshati Vignana Sarvasvamu By Dr Gunji Venkataratnam

    500.00

    హంసవింశతి: కావ్యము- కవి

    కథా కావ్యము

    సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. ‘కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.

    కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.

    తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.

    కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది………………