Best Seller Items

  • Karma

    అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
    వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
    200.00
  • Kaala Padalu

    220.00
  • Bathuku Sedyam

    బతుకు సేద్యం అనే నవలాసేద్యం

    శాంతి ప్రబోధ రాసిన ‘బతుకు సేద్యం’ నవల ఆమె పూర్వపు నవల వలే అతి క్లిష్టమైన సామాజిక సమస్య గురించినది. భూమితో, స్త్రీలతో, పర్యావరణంతో సంబంధం కలిగినది. ఈ నవల చదవటం మొదలు పెట్టిన కొద్దీ సేపటిలో నాకు బాగా పరిచయమైన విషయంవలే అనిపించింది. నిజమే, హైదరాబాదు దాని సమీప జిల్లాలలో గ్రామీణాభివృద్ధి గురించి తెలిసిన వారందరికీ ఆసక్తి కలిగించే విషయం. ఆసక్తి ఉన్న వారందరికీ తెలిసే విషయం. దాన్నలా ఉంచి నవలా ఇతివృత్తం గ్రామీణాభివృద్ధి, గ్రామ అంటే గ్రామం లోని ప్రజల అని ఇవాళ మనకు తేలికగా అర్ధమవుతుంది గానీ మరొకసారి జ్ఞప్తికి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు చాలాసార్లు గ్రామం అంటే ప్రజలని కాక ఇతర వనరులని మాత్రమే అర్ధమవుతున్న కాలంలో బతుకుతున్నాం. ప్రజలలో కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, ఆ కుటుంబాలలో మరింత ఆకలికి, చాకిరికి, అణచివేతకు గురవుతున్న స్త్రీలు గ్రామాలలో ముఖ్యులు. వారే గ్రామాన్ని కాపాడుతున్నారు. కుంటినడక నైనా నడిపిస్తున్నారు. ఐతే ఆ గ్రామీణ స్త్రీల గురించి స్వతంత్రం వచ్చిన చాలాకాలం వరకూ ఎవరికీ పట్టలేదు. స్వాతంత్య్రానంతర అభివృద్ధి ప్రణాళికలలో, కార్యక్రమాలలో ఆ నిరుపేద గ్రామీణ స్త్రీలకు చోటు దొరకలేదు………..

    330.00
  • Barilo

    కోడి పుంజు ఎంతో అందమైనది. అనేక రంగుల్లో ఆకర్షనీయంగా ఉంటుంది.
    మిగిలిన జాతుల పక్షులకు లేని విలక్షణ స్వభావం కోడిపుంజుది. ఎంతమాత్రం అంతకుముందు పరిచయం లేకపోయినా ఒకానొక వైరితత్వంతో పోరాడే గుణం వాటి రక్తంలోనే ఉంది. కోడిపుంజుల్లో ఉండే రోషాన్నీ పోరాటపటిమనీ సాంస్కృతిక విలాసంగా క్రీడావిన్యాసంగా జూదప్రక్రియగా మార్చుకున్నాడు మనిషి. చిన్నప్పట్నుంచీ సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాలు వినోదంగా మారడాన్ని గమనించాను. అలాగని నేనెప్పుడూ పందాల కోసం కోడిపుంజుల్ని పెంచడం, డబ్బులు పందెం ఒడ్డడం చేయలేదు.
    గత నాలుగైదేళ్లుగా యానాంకు దగ్గర్లోని మురమళ్ల, ఎదుర్లంక, పల్లంకుర్రు గ్రామాలకు వెళ్లేవాడిని. ఆధునిక కోడిపందాల్లో ఉపయోగించే సాంకేతికత, చుట్టూ జరిగే జూదాలు చూసి తెలుగుసాహిత్యం పెద్దగా స్పృశించని దీన్ని కథలు రాయాలనుకున్నాను. పల్లెలకెళ్లి సమాచారం సేకరించాను. అనేకమందితో మాట్లాడాను. ఫోన్లు చేశాను. గూగులమ్మ తలుపు తట్టాను.
    180.00
  • -7%

    Modati Ettu – మొదటి ఎత్తు

    Original price was: ₹230.00.Current price is: ₹215.00.
  • Penkutillu

    125.00
  • Periyar Reader

    పెరియార్ జీవిత సంగ్రహం

    1879 సెప్టెంబర్ 17 : – చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా ‘ఈ రోడ్’లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.

    1885 (ఆరేళ్ళ వయసు) : –  ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
    1889  పదేళ్ళ వయస్సు : – ప్రాథమిక విద్య పూర్తయింది.

    1891 (12 ఏళ్ళు) : – అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.

    1895   ; – తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
    1898 ; – అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
    1900 : – అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
    1904  : – తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను

    విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.

    చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి “యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ………..
    200.00
  • Lal Kitab

    300.00
  • Sir Thomas Munro

     రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.

         సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.

         తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.

     – రావినూతల శ్రీరాములు

    40.00
  • Spartacus

    200.00
  • -7%

    Life of Swami Vivekananda Set 2 Vols (Telugu)

    Original price was: ₹150.00.Current price is: ₹140.00.
  • Umar Kayyum

    60.00
  • Vanavasi

     భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ‘పథేర్ పాంచాలీ’ నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతిభూషన్ బంధోపాధ్యాయ కలం నుంచి జాలు వారిన మరో అపురూప రచన ఇది. ‘పథేర్ పాంచాలీ’తో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచన పరులైన విమర్శకుల అభిప్రాయం.
                                              నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.
     
    200.00
  • కోనసీమ కథలు

    కోనసీమ కథలు

    150.00
  • Dakkali Jaambapuraanam (Telugu)

    భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ ,
     తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ
     మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
    280.00
  • Idi Naa Godava

    కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో  ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.

    150.00
  • Ayn Rand Philosophy

    ఫిలాసఫీ; ఎవరికి అవసరం?

     

    (మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)

    నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?

    మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.

    మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.

    ‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………

    250.00
  • Kotha Katha 2024

    275.00
  • Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu

      నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                                                                            -ఏమి మౌరీన్.

                                                                                            -ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.

    225.00
  • Manasu Gathine Marchina ‘Freud’

    మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.

                 ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.

    175.00
  • Mee Jeevitanni Marchukovadaniki Okka Nimisham Chalu

    ఒక్క నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి 

    మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి సిద్దపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలు, మీకు అందిస్తున్నాడు.

    ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?

    ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలల వెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్ని సద్వినియోగం చెయ్యగల సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిముషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.

    విజయం….

    “అపురూపమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం, ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి, నీ శక్తీయుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడడం!”

    ఛాయిస్ లు….

    “నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్, చాన్సు కాదు!”

    మొండిపట్టు….

    “జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పాదు. మొండిపట్టు, ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కధ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలలు సాకారం కావడం చూడు.”

     

    ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఇప్పుడు నిమిష నిమిషానికీ మార్చుకోగలరు. మీరు ఉన్నతులు కాగలరు. ఎక్కువ పనిచేయ్యగలరు. ఎక్కువ సంపాదించగలరు. ఎక్కువ ప్రేమించగలరు. ఎక్కువ నవ్వగలరు.’                                 – మార్క్ విక్టర్ హేన్సన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్ సహా రచయిత.

    195.00
  • Meeku Merem Cheppukovali

    మీ కలలను సాకారం చేసుకునే శక్తీ మీరు సృష్టించుకోగలరు.

    ఈ రహస్యాలు తెలుసుకుని ….

    మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,

    మీకు మీరేం చెప్పుకోవాలి.

     

    మీ దృక్పధాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.

     

    * నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.

    * నాలో ప్రతిభ, సామర్ద్యం, నైపుణ్యం అన్ని వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.

    * ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.

    * నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.

    * నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనుక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.

    165.00
  • Nakshtra Darsanam

    130.00
  • Nenevvaru? Sriramaniyam

     డా. ముదిగొండ వీరభద్రయ్య ఇంతకుముందు 60 సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను 2007 లో శ్రీ రమణాశ్రమంలో ఉండి రచించారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జ్ఞాన మననము, ఆత్మ శాస్త్రము, శ్రీ సత్యసాయి బోధనలు నేపథ్యంలో ‘అద్వైత జ్ఞాన ప్రకాశిక’ అన్న తత్త్వగ్రంథాలను (అన్నింటిని సత్యసాయి బుక్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ప్రచురించింది), భగవాన్ శ్రీ సత్యసాయి జీవిత మకరందం (బ్రౌన్ అకాడమీ ప్రచరణ) గ్రంథాన్నీ రచించారు.

                ఇప్పుడు ఈ “నేనెవరు – శ్రీ రమణీయం” అన్న గ్రంథాన్ని రచించి భగవాన్ రమణుల మార్గాన్ని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక కోసం రచించినవి.

                  హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్ష పదవి నుంచి 2004 లో విరమించాక ప్రస్తుతం వీరు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో గౌరవ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు.

                                                                                           – ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య

    130.00
  • Runam

    స్వచ్చమైన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో “ఋణం” అనే నామకరణం చేయడంలోనే ఈ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ ఈ “ఋణం” నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాదారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.

    250.00
  • Viswa Karma

    ప్రవేశిక

         ప్రాయ ఇతి శబ్దేన దోషసంపాదనం చిత్త మితి |

         శాస్త్ర ప్రతిషేధః తస్మా తాయ శ్చిత్తమిత్యాచ్యతే ॥

    భావం: అంటే దోషసంపాదనమని, చిత్తం అంటే దాన్ని నివారించుకోవడమని అర్థం. ప్రాయశ్చిత్తమంటే దోషాన్ని నివారించుకోడానికి చేసే కార్యక్రమమని అర్థం.

    * * *

    అదో నాలుగు నిట్రాళ్ళ ఇల్లు. బయట ‘వరదానం, ఆయుర్వేదాచారి’ అనే బోర్డుంది. ఆ ఇంట్లోని వెనక పెద్ద గది వంటగది. ఓవైపు నేల మీద పొయ్యి. మరోవైపు ధాన్యం బస్తాలు. మధ్య గదిలో ఓవైపు ఉయ్యాలబల్ల. మరోవైపు అతిధులు వస్తే పరచటానికి నాలుగు చాపలు. ఆ ఇంట్లో మరో రెండు గదులున్నాయి. వాటిలో ఒకదాన్నిండా ఆయుర్వేద మందులు, చిన్న మేజా బల్ల, కుర్చీ, వచ్చిన రోగులు కూర్చోడానికో బల్ల ఉన్నాయి. ఇంకో గది ఎత్తైన పందిరిపట్టెమంచం గల పడకగది.

    ఆ ఇంటి వెనకాల చాలా చెట్లున్నాయి. అవన్నీ ఔషధగుణాలు గల చెట్లే. నూతి గట్టు పక్కన స్నానానికి చుట్టూ దడి కట్టిన చిన్న పందిరి. దూరంగా వెనకో మరుగుదొడ్డి. ఆ ఇంటిముందో ఎడ్లబండి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు ఓ రోగిని చేతులు పట్టుకుని కిందకి దించారు. ఆయన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆ ఇంటి అరుగు మీద కళ్ళుమూసుకుని కూర్చున్న పండితయ్య ఆ రోగి వంక చూడలేదు. ఎనభై పైబడ్డ……………….

    300.00
  • Evariki Cheppaka

    280.00
  • Visalandhramu

    250.00
  • VELPULA KATHA|వేల్పుల కథ

    వేల్పుల కథ- రాంభట్ల కృష్ణమూర్తి

    150.00
  • తేరే బినా జిందగీ

    తేరే బినా జిందగీ

    120.00
  • రోబో బుద్ధ

    రాణి శివశంకరశర్మ కథలు
    ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
    నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
    క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
    మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
    ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
    జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
    శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
    అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
    మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
    ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
    మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు.

    140.00
  • ఫూల్ ఔర్ కాంటే

    మట్టి మనుషుల మహాసంగ్రామం

    120.00
  • NUDI-NANUDI | నుడి-నానుడి

    సంపాదకులు: జయధీర్ తిరుమల రావు

    మతభావన ఆధిపత్య భవనాలే తప్ప భాషకి తత్వ శాస్త్రం ఉంటుందనే ఆలోచన చాలామందికి లేదు. మనకి విద్యాత్మక బాషా పండితులు. బాషా శాస్త్రవేత్తలు ఉన్నారే తప్ప బాషా తాత్వికులు లేరు. ఆ కొరత తెలుగా ఆంధ్రమా? రచయిత వాగరి వాగరి పేరు పెట్టుకున్న బి. స. బంగారయ్య గారు తీర్చారు.

    ఇంటి పోకడ బడి పోకడ సమాజం పోకడలని బాషా దృక్పథంతో లోతుగా అర్థం చేసుకున్న ఏకైక రచయిత బంగారయ్య.

    భార్యకు బదులు పెళ్ళాం భర్తకు బదులు మొగుడు రక్తము బదులు నెత్తురు స్తనం బదులు చన్ను అనే తెలుగు మాటలు వాడలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ అసలు సిసలు తెలుగు మాటలను మనం మరిచిపోతున్నాం. తెలుగు మాటలను నేటికీ చదువురాని గ్రామసీమల ప్రజలే వాడుతున్నారు. అలాంటి తెలుగు పలుకులు పండితులకి పామరులకు అనేకమందికి అర్ధమవుతుంటే దానిని పక్కన పెట్టడం ఎందుకు? ఇంత చిన్న విషయం గురించి పెద్ద పెద్ద పండితులు ఎందుకు ఆలోచించరు. ఇది ఈ పుస్తకంలో రచయిత ఆవేదన.

    200.00
  • నామిని ఇస్కూలు పుస్తకం

    ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.

    ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”

    200.00
  • Maa Badi

    బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.

    220.00
  • Gupta 91 By Patanjali Sastri

    గుప్తా ’91

    గుప్తా తడిలేకుండా శుభ్రంగా తల తుడుచుకుని వచ్చి చంకల్లో కొంచం పౌడరు చల్లుకొని, తువ్వాలు అవతల పారేసి లోపలి లాగులో అద్దం ముందు కూచున్నాడు. వంటింట్లో గుప్తాకి లంచి బాక్సు పెట్టి, అతని సంచిలో పెట్టి గదిలోకి వచ్చింది పార్వతి. చేతిలో దువ్వెన పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నా డతను. బ్రాహ్మీ నూనె సీసాలోంచి కొంచెం నూనె అరచేతిలోకి ఒంపుకుని రెండు చేతులకి రాసుకొని ఎదురుగా నుంచుని అతని నల్లటి వంకీల జుట్టుకి రాస్తోంది. ఆమె తెల్లటి పొట్ట అతనికి దగ్గరగా ఉండటంతో ముందుకు జరిగి పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు గుప్తా.

    “చాల్లెండి సంబడం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటి?” |
    “ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికి దీనికి సంబంధం ఉందాసల?”
    “ఇంక దువ్వుకోండి. మీ అమ్మగారికి టిఫిను పెట్టాలి.”
    “పూజ అవ్వలేదా?”
    “అత్తగారివాళ ఉషారుగా ఉన్నారు.”
    “అదేం?”

    “ఆవిడ ఫెండు మజ్ఞాన్నం ఒస్తాడట. కొంచెం టిఫిను ఎక్కువ చెయ్య | మన్నారు.”……………..

    175.00
  • Grahantaravasi

    భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
    స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
    శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
    ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు.

    100.00