Best Seller Items

  • Amma Dairylo Konni Pageelu

    220.00

    Amma Dairylo Konni Pageelu – This book orderd customers will get Rs. 30 CASH BACK OFFER
    (APPLY FOR ONLY ADVANCE PAYMENT MADE TO PHONE PAY NUMBER 6281596253)

  • -18%

    Aadhunika Mahabharatham

    Original price was: ₹550.00.Current price is: ₹450.00.

        “ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…

                                        – పవన్ కళ్యాణ్

  • -10%

    Vaktha (Telugu Edition)

    Original price was: ₹200.00.Current price is: ₹180.00.

    మీరూ కావచ్చు ‘వక్త’
    వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

  • Gajula Sanchi

    150.00

     నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
                              ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా’ అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
    కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ……
                                                                                                                                                                                                                                                                                         – మొహమ్మద్ గౌస్

  • Soonyam

    250.00

    OONYAM novel by Mukthavaram Pardhasarathy పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు

  • Padileche Keratam

    200.00

    పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన సాగర్ ఘోష ఈ నవల। అంగవైకల్యంతో పాటు పేదరికంతో కూడా పోరాడి గెలిచిన సాగర్ తనలోని అంతర్ బహిర్ లోకాన్ని ఆవిష్కరిస్తూ, తన ఆంతరంగ కల్లోలాల్ని అక్షరబద్దం చేస్తూ రాసుకున్న ఆత్మ కథే “పడిలేచే కెరటం”। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో పోరాట పటిమను, స్ఫూర్తిని నింపే నవల ఇది।
                      అంగవైకల్యంతో బాధపడేవాళ్ళలో సున్నితంగా వ్యవహరించాలని తెల్సినా కొంతమంది , తెలియకుండా చాలామంది వాళ్ళని మానసికంగా హింస పెడుతుంటారు। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్సెన్సిటివ్ గా మారె దేశంలోనూ ఉండరేమో, వాళ్ళని తమ చూపుల్తో, మాటల్తో చేతలతోగాయాపారిచేవాళ్ళెందరో। చదువులేని జులాయి మనుషులు మాత్రమే వీళ్ళని ఎగతాళి చేసి బాధపెడతారనుకోవడం అపోహ మాత్రమే। ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా సంస్కారహీనంగా వాళ్ళని అవహేళన చేసి అవమానపరుస్తుంటారు। ” ఈ నవల హృదయంతో చదవండి। వాళ్ళ హృదయ ఘోష విన్పిస్తుంది। మీకళ్ళకు కొందరి జీవితాల్లో మనుషులు అనాలోచితంగానో, అహంకారంతోనో చేసే గాయాలు కన్పిస్తాయి।।

  • Komuram Bheemu

    250.00

    ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు

  • Irani Cafe

    150.00

    మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
    2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం  నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి. 
                కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
                                                                                                                                                                                                                                                – వి. మల్లికార్జున్    

  • Andaala Natudu Harnath

    250.00

    అందాలుచిందే రూపం…! అలచందమామ రూపం!!
    హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. ‘యూ ట్యూబ్’ వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి ‘పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన ‘శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము’ అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం.
    హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ ‘ఖిల్జీరాజ్యపతనం’ నాటకంలో కథానాయకుడి పాత్ర………….

  • Gypsylu

    150.00

     పైరగాల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ  ముందుకి సాగిపోయే సంచారులు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. భారతదేశపు గదులియా లోహర్, ఆఫ్రికా పశువుల కాపరులు , అరేబియా ఎడారిలో జీవించే ఒంటెల కాపరులు, మధ్య ఆసియా కొండల్లో తిరిగే డ్రోక్ పా పశువుల కాపరులు, ధృవప్రాంతాల్లోని సంచారులు, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీలు లాంటి అస్థిరవాసుల జీవితాలను “తెలుగు వెలుగు” లోనికి తీసుకురావటానికి ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ “జిప్సీలు”.

  • Veyipadagalu Nedu Chadivithe

    225.00

    వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే…
    ‘కాలచక్రం’ అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను.
    భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు.
    విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల……………

  • Smasanam Dunnaru

    130.00

    స్మశానం దున్నేరు
              హరిజనుల మీద పెత్తనం చెలాయించినంత మాత్రాన తాము పెత్తందారులయి పోరు. పెత్తందారులకు తోట్టులుగానే మిగిలిపోతారు. తమ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తే తోత్తుల్ని కూడా వెంటాడి వేధిస్తారు అదే పెత్తందారులు.  బి.సి. కులాల సహకారం తీసుకుంటూనే హరిజనుల్ని అణచివేసే భూస్వామ్యపు అహంకారం, స్వార్ధం,  కుటిలవుహ్యంలోని ఎత్తుగడలు అర్ధమవుతాయి ఈ నవల చదివితే.
     
              ముఖ్యం గా పీడిత కులాల్లోని అంతర్గత వైరుధ్యాల్ని తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా రెచ్చగొట్టడమనే  పద్ధతి ఈనాటికీ కొనసాగడం వర్తమాన సామజిక,రాజకీయ పరిస్థితుల్ని గమనించినవారికి తేటతెల్లంగా కనిపిస్తుంది. అందుకే ‘స్మశానం దున్నేరు’ నవల కేవలం ఒక కధ మాత్రమే కాదు. ఒకనాటి జీవితాన్ని రికార్డు చేసిన నవల మాత్రమే కాదు, దానికి సామాజికపరమైన ప్రాసంగికత ఉంది.        
    …..గుడిపాటి    

  • Sanchari

    140.00

    గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి

  • Pakudu Rallu

    600.00

    సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రభావంతంగా బొమ్మకట్టించిన తోలి తెలుగు నవల.
            మద్రాసులో ముడున్నరేళ్ళు ‘చిత్రసీమ’ సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో ‘మాయాజలతారు’ నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
                                                                                          …… రావూరి భరద్వాజ 
                                                  
    రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2013 కు గాను  లభించింది. చిత్ర పరిశ్రమలో వ్యక్తుల అంతరంగాలను అద్భుతంగా అవిష్కరించిన ‘పాకుడురాళ్లు ‘నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించిన తెలుగు వారిలో ఆయన మూడో వ్యక్తి. తొలిసారిగా 1970లో విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ రచనకు దక్కిన ఈ పురస్కారం.. తర్వాత 1988లో ‘విశ్వంభర’ రచనకు గానూ సి.నారాయణరెడ్డిని వరించింది. ఆ తర్వాత సరిగ్గా పాతికేళ్ల అనంతరం జ్ఞాన్ పీఠ్ పురస్కారం మరోసారి తెలుగు రచయిత తలుపు తట్టింది.

  • Mandu Chupu

    125.00

    ప్రస్తావన
    గోదావరి గలగలా ప్రవహిస్తోంది. గోల్డ్క్ సిగరెట్ కాలుస్తున్న కవి కుమారునికి ఆ పొగ ఘుమఘుమగానే వున్నట్టుంది. గోదావరి గట్టు గచ్చు చప్టా మీద ఏడెనిమిదిమంది మిత్రులు కూర్చున్నారు. వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలుతోంది. వాళ్లు గోదావరి వంక చూస్తున్నారను కుంటే నీళ్లల్లో మందు పోసినట్టే. వాళ్ల కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి. ఓ పావు గంట గడిచింది.
    ‘శ్రీశ్రీ ఓ సినిమాలో అన్నట్టు… ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు’ అన్నాడు. కొటేషన్రావు. (అతని అసలు పేరు కోటేశ్వరరావు)……..

  • Kollayi Gattithe Nemi

    250.00

    ఆంద్రదేశ చరిత్రలోనే 1920 -45ల పాతికేళ్ళకు అనిదంపూర్వమైన ప్రాముఖ్యం ఉంది. సామాజికంగా వీరేశలింగం ప్రభ్రుతులు సంస్కరణవాదధోరణులతో జాతి సంస్కారాన్ని ఎన్నో మెట్లెక్కించిన కాలం అది.
              సహాయ నిరాకరణం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని అపార త్యాగాలకు సంసిద్ధం చేసిన కాలం అది. సాహితీ, నవ్యసాహితీ, అభ్యుదయోద్యమాలు సాంస్కృతిక రంగాన్ని నూతన స్థాయికి చేర్చిన కాలం అది. 
              తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్ర శాస్త్రీయమైన అవగాహనతో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి, కళాత్మకత దెబ్బతినకుండా  “కొల్లాయిగట్టితేనేమి?” ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’, ‘రథచక్రాలు’, అనే చారిత్రక నవలలు మహీధర రామమోహనరావు రాశారు.
             కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్, ఫార్వర్డుబ్లాకు, రాయిస్టు, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అన్నీ కలిసి పరాయి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, సంక్లిష్ట చారిత్రిక గతితో మానవ సంబంధాలలో  వస్తున్న మార్పుల్ని  సజీవ రీతిలో చిత్రించిన నవలలు ఇవి.
    – మహీధర రామ మోహన రావు

  • Chivari Gudesa

    120.00

    చివరి గుడిసె
                యదార్ధమైన చేనులో ఎలుకల నుండి కాపాడటానికి మనణియానికి ఏ యానాది అవసరమయ్యాడో అదే యానాది బైరాగి ఆత్మిక క్షేత్రాన్ని కామక్రోధాలనే ఎలుకలు పది కొల్ల గొట్టటానికి కారణమయ్యాడు. వాస్తవ సన్నివేశము, ప్రతీకా ఇంత అద్బుతంగా కలగలిసిన రచనలు ఎంతో అరుదుగా కనిపిస్తాయి.  
    –          వాడ్రేవు చినవీరభద్రుడు.
                యానాది కులవృతి చేసుకుని బతికిన పాత తరానికి మన్నుగాడు చివరి ప్రతినిధి అయితే, పొట్టకూటికి మట్టి పని చేసుకొని బతికే కొత్త తరానికి చిన్నోడు మొదటి ప్రతినిధి అవుతాడు. అయితే కులం చిన్నోడిని అక్కడా వెంటాడుతుంది.
                                                                                                    –  అంబటి సురేంద్ర రాజు 

  • CHARITRADAARULLO

    180.00

    వేంకటేశ్వరునికి పరమభక్తుడై ఎన్నోసార్లు దర్శించి అనేక కైంకర్యాలు చేసి కవితాకన్యను కూడా సమర్పించిన కృష్ణదేవరాయలు విజయనగరంలో ఒక్క వేంకటేశ్వరాలయమైనా నిర్మించకపోవడం విచిత్రం.
    జినభవనాలు(మఠాలు) కట్టించుట, జినసాధువుల పూజలు చేయుట, జైనమునులకు నచ్చిన భోజనములు పెట్టుటలో ఇతర జైనులెవ్వరూ జినవల్లభునితో సరిపోలజాలరు. 

    దశావతారాలు శిష్టసాహిత్యం బాగా నాగరీకమైన తరువాత బలపడిన భావనలు. జానపద సాహిత్యంలోకి శిష్టసాహిత్యంనుండే దశావతారాలు వెళ్లాయి అని నా ఊహ. 
    ప్రపంచ వీరగాథ సాహిత్యచరిత్రలో పలనాటి వీరగాథ, కాటమరాజు కథ, బొబ్బిలియుద్ధం కథల వలన ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం ఏర్పడి వుంది. వీటిలో మొదటి రెండు పురాతనమైనవి. వాటితో పోలిస్తే బొబ్బిలి యుద్ధం, కథా ఆధునికమైనవే. 
    తెలివిడి అందినంతమేర చూస్తే రామదాసు పూర్వమైనా, సమకాలం లోనైనా, తరువాత చాలాకాలం వరకు రాముడే భజనకి ఆధారదైవం అనిపిస్తుంది.
    మధురాష్టకం చాలా సుబోధక రచన. భారతీయులకు ఏభాష వారికైనా అర్థమవుతుంది. అది పేరుకి సంస్కృతరచనే అయినా, ఆ స్తోత్రంలోని పదాలు అన్ని భారతీయ భాషలలో సర్వసాధారణంగా వాడే పదజాలమే. 

  • Amerika Ammayi

    175.00

    హ్యాపీ నూతన సంవత్సరం
    ఉద్యోగాల కోసం కొందరు, చదువుల కోసం కొందరు, ఇలా వారి వారి కలల వెంటపడి చేరుకునే గమ్యం ఒకటి ఉంది… అదే అమెరికా!
    చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడి నుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడివారైనా పూర్ణకుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పి.లు అనీ అనుకునే రోజుల నుండీ… ‘ఆ వదినా, మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను. దార్లో మీ అబ్బాయికి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. ఇచ్చేసి వస్తాను’ అనే రోజుల్లోకి వచ్చేసాము. దూరం కొద్దీ విలువని అంచనా వేసే మనం, ఆ దూరం తగ్గిపోయేసరికి విలువనీ తగ్గించేస్తున్నామేమో?
    ప్రపంచంలో అందరూ రెండే రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఉత్తములు అయితే మరొకళ్ళు అధములు. వీళ్ళు కాకుండా మరొక రకం ఉంది. అదే ‘మధ్యముల్’ అన్నమాట. పైన చెప్పిన రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అందరి సమస్యలు నెత్తిన వేస్కుని భూభారాన్ని మోసేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో ఫస్టు ఉండేవాళ్ళలో నేనొకదాన్ని. ఉద్యోగం వదిలేసి భర్త వెంట అమెరికావాసం వచ్చిన కాండిడేట్ని. వీసా సమస్యల వల్ల ఇంట్లో……………..

  • Komuram Bheemu

    230.00

    ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు

  • Karma

    200.00
    అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
    వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
  • Bathuku Sedyam

    330.00

    బతుకు సేద్యం అనే నవలాసేద్యం

    శాంతి ప్రబోధ రాసిన ‘బతుకు సేద్యం’ నవల ఆమె పూర్వపు నవల వలే అతి క్లిష్టమైన సామాజిక సమస్య గురించినది. భూమితో, స్త్రీలతో, పర్యావరణంతో సంబంధం కలిగినది. ఈ నవల చదవటం మొదలు పెట్టిన కొద్దీ సేపటిలో నాకు బాగా పరిచయమైన విషయంవలే అనిపించింది. నిజమే, హైదరాబాదు దాని సమీప జిల్లాలలో గ్రామీణాభివృద్ధి గురించి తెలిసిన వారందరికీ ఆసక్తి కలిగించే విషయం. ఆసక్తి ఉన్న వారందరికీ తెలిసే విషయం. దాన్నలా ఉంచి నవలా ఇతివృత్తం గ్రామీణాభివృద్ధి, గ్రామ అంటే గ్రామం లోని ప్రజల అని ఇవాళ మనకు తేలికగా అర్ధమవుతుంది గానీ మరొకసారి జ్ఞప్తికి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు చాలాసార్లు గ్రామం అంటే ప్రజలని కాక ఇతర వనరులని మాత్రమే అర్ధమవుతున్న కాలంలో బతుకుతున్నాం. ప్రజలలో కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, ఆ కుటుంబాలలో మరింత ఆకలికి, చాకిరికి, అణచివేతకు గురవుతున్న స్త్రీలు గ్రామాలలో ముఖ్యులు. వారే గ్రామాన్ని కాపాడుతున్నారు. కుంటినడక నైనా నడిపిస్తున్నారు. ఐతే ఆ గ్రామీణ స్త్రీల గురించి స్వతంత్రం వచ్చిన చాలాకాలం వరకూ ఎవరికీ పట్టలేదు. స్వాతంత్య్రానంతర అభివృద్ధి ప్రణాళికలలో, కార్యక్రమాలలో ఆ నిరుపేద గ్రామీణ స్త్రీలకు చోటు దొరకలేదు………..

  • Barilo

    180.00
    కోడి పుంజు ఎంతో అందమైనది. అనేక రంగుల్లో ఆకర్షనీయంగా ఉంటుంది.
    మిగిలిన జాతుల పక్షులకు లేని విలక్షణ స్వభావం కోడిపుంజుది. ఎంతమాత్రం అంతకుముందు పరిచయం లేకపోయినా ఒకానొక వైరితత్వంతో పోరాడే గుణం వాటి రక్తంలోనే ఉంది. కోడిపుంజుల్లో ఉండే రోషాన్నీ పోరాటపటిమనీ సాంస్కృతిక విలాసంగా క్రీడావిన్యాసంగా జూదప్రక్రియగా మార్చుకున్నాడు మనిషి. చిన్నప్పట్నుంచీ సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాలు వినోదంగా మారడాన్ని గమనించాను. అలాగని నేనెప్పుడూ పందాల కోసం కోడిపుంజుల్ని పెంచడం, డబ్బులు పందెం ఒడ్డడం చేయలేదు.
    గత నాలుగైదేళ్లుగా యానాంకు దగ్గర్లోని మురమళ్ల, ఎదుర్లంక, పల్లంకుర్రు గ్రామాలకు వెళ్లేవాడిని. ఆధునిక కోడిపందాల్లో ఉపయోగించే సాంకేతికత, చుట్టూ జరిగే జూదాలు చూసి తెలుగుసాహిత్యం పెద్దగా స్పృశించని దీన్ని కథలు రాయాలనుకున్నాను. పల్లెలకెళ్లి సమాచారం సేకరించాను. అనేకమందితో మాట్లాడాను. ఫోన్లు చేశాను. గూగులమ్మ తలుపు తట్టాను.
  • -7%

    Modati Ettu – మొదటి ఎత్తు

    Original price was: ₹230.00.Current price is: ₹215.00.
  • Mudu Darulu

    395.00
    రాజకీయాలు….ఒక సమాలోచన
    చరిత్రను తిరగదోడటం దేనికి? చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా? రావచ్చు. కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు, వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది. చరిత్రను అవలోకించడం ద్వారా నిర్మొహమాటంగా, నిర్ద్వంద్వంగా సంఘటనను విశ్లేషించే వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి, చరిత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. అలా అని చెప్పి, భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఇప్పుడు కాచివడబోయాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి పాత్ర అమోఘమైనది. దాని రచనకు పూనుకుంటే అదొక ఉద్గ్రంథమే అవుతుంది. కానీ అది ఈ రచయిత పని కాదు.
    స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా భాషప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మన రాజకీయాలను, సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మన చరిత్రలో ఆనాటి సంఘటనలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరణను కోరుతూ ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగాయి. వాటిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు కూడా జరగకపోలేదు. ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను………………..
  • Periyar Reader

    200.00
    పెరియార్ జీవిత సంగ్రహం

    1879 సెప్టెంబర్ 17 : – చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా ‘ఈ రోడ్’లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.

    1885 (ఆరేళ్ళ వయసు) : –  ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
    1889  పదేళ్ళ వయస్సు : – ప్రాథమిక విద్య పూర్తయింది.

    1891 (12 ఏళ్ళు) : – అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.

    1895   ; – తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
    1898 ; – అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
    1900 : – అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
    1904  : – తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను

    విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.

    చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి “యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ………..
  • -7%

    Pillalu Ela Nerchukuntaru

    Original price was: ₹350.00.Current price is: ₹325.00.
  • -3%

    పుల్లంపేట జరీచీర

    Original price was: ₹300.00.Current price is: ₹290.00.
    “శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం.”
    – మల్లాది రామకృష్ణ శాస్త్రి.
    “అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు”
    – పిలకా గణపతి శాస్త్రి.
     “సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు”
    – విశ్వనాధ సత్యనారాయణ.
     “ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు.”
    – కొడవటిగంటి కుటుంబరావు.
    “శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును.”
    – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
    “భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు – సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా ‘వడ్లగింజలు’ రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు.”
    – ఉషశ్రీ.
    వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు.
    శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన – రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు.
    వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. ‘ప్రబుద్దాంద్ర పత్రిక’ను చాలాకాలం నిర్వహించారు.
    వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ – ఖద్దరు – హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ.
    తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.
  • Sir Thomas Munro

    40.00

     రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.

         సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.

         తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.

     – రావినూతల శ్రీరాములు