-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Dasarathi Sahityam- 4
₹400.00“దాశరథి అన్నిటికన్నా ముందు – మనిషి, ఏ కొద్దిపాటి వానచినుకులకైనా తబ్బిబ్బుకాగల రావిఆకు హృదయమున్నవాడు. అతనొక సంక్షుభిక తెలంగాణా ఉద్యమకాలంలో కాక, మరొక కాలంలో జన్మించినట్లయితే, ఏమి చేస్తుండేవాడో ఊహించడం కష్టం కాదనుకుంటాను.
ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ‘యాత్రాస్మృతి’ అనడం కన్నా, కవిపరంపరతో కలిసి చేసిన యాత్రాస్మృతి అనడం సముచితంగా ఉంటుంది. ఒకప్పుడు మహా రాష్ట్రదేశంలో సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్ వంటివారు ప్రోదిచేసి పోషించిన వర్కారీ సంప్రదాయంలో లాగా, పండరియాత్ర చేసే భక్త గాయకులు తమ యాత్రనొక కావ్యయాత్రగా మార్చుకున్నాడు. అతిసున్నితమైన, మసృణకోమలమైన ఆయన హృదయం ఏ పాటలు పాడుకున్నదో అన్న పాటలూ మనం వినలేకపోయాo. క్లుప్తంగా కనిపిస్తున్న ఈ పుస్తకం పుటల్లో రాసిన వ్యాక్యాలను సంభావించుకునే యోగ్యత ఒక్కటే మనకు మిగిలింది.
“మహారచయిత టాల్ స్టాయి ‘యుద్ధము శాంతి’గా పర్యవసించడానికి ఒక నవలగా రాసాడు. కాని దాశరథి విషయంలో ‘యుద్ధము – శాంతి’ ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి”.
– చినవీరభద్రుడు
-
-
-
-
-
-
Nurella Telugu Kadhalu
₹349.00హిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు. కాని- దారిన పోతూ పోతూ కింద రాలిన ఒక గన్నేరు పువ్వును అందుకొని దేవుని సమక్షాన పెట్టి అంతకు మించి వీలు కాదన్నట్టుగా కదిలిపోతారు మరికొందరు. ఇది అలాంటి ప్రయత్నం. తెలుగు కథ సమక్షంలో ఒక గన్నేరు పువ్వును పెట్టే ప్రయత్నం. వందేళ్ళలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొత్తాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని ఈ అడావిడి రోజుల్లో నూరేళ్ళ తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. కొండను అద్దంలో చూపించడం. దేశీయ కథా సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం బహుశా కొత్త. ఇది తెలుగు కథ ఘనత. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత.
-
-



































































































