Pachani Vanamoolikalu Pasidi Aarogyam

Rs.400.00

In stock

SKU: JP0022 Category: Tag:
Author: Dr K Nishteswar
   భారతదేశంలో పెరుగుతున్న వేలాది వనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యులు మరియు గిరిజనులు చాలా వ్యాధుల చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. వాటిల్లో అత్యంత శక్తివంతమైన కొన్ని వనమూలికలతో ఎంతో ప్రయోజనకారిగా ఉండే ఉపయోగాల వివరాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. మన చుట్టూ పెరుగుతున్న నేలవుసిరి కామెర్లకు దివ్యౌషధం. రోజూ 4-6 తులసీ ఆకులు నమిలితే మానసిక ఆందోళనలు దూరంగా ఉంచవచ్చును. పెన్నేరును పొడిచేసి ప్రతినిత్యం సేవిస్తే వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎయిడ్స్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. నీరసం, నరాల బలహీనత తగ్గుతుంది. వెల్లుల్లి, వాము పొడి రోజూ సేవిస్తే రక్తంలో కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంది గుండె నొప్పి రాకుండా నిరోధించవచ్చును. పొడపత్రి, నేరేడు గింజలు,  వెంపలి విత్తనాలు డయాబెటిస్ రోగులకు మంచి ప్రయోజనకారిగా ఉంటాయి. ఇటువంటి నిరపాయకరమైన మూలికల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
Author

Dr K Nishteswar

Format

Paperback