నాకు ఒక్కటే కనిపించింది!
మహాభారతంలో అవతారమూర్తి శ్రీ వ్యాస మహర్షి మానవజాతికోసం భీష్ముడి పాత్ర ద్వారా అందించిన మహోన్నతమైన ‘మానవ సంబంధాల దివ్యౌషధం’ ఈ శ్లోకం. ఈ శ్లోక స్ఫూర్తిని స్పృశించేముందు చేంబోలు శ్రీరామశాస్త్రి చేసిన ఈ సంకలనం చదవగానే ఏమనిపించిందో చెప్పాలి.
ఇప్పటి రోజుల్లో ఆత్మకథలుగానీ, ఎవరెవరో రాసిపెట్టే జీవితకథలుగానీ – అధిక శాతం – వాస్తవాల్ని మరుగుపర్చి, లేదా నిజాయితీకి ముసుగు వేసి, అవలక్షణాలున్న మనిషిని కూడా మహానుభావుడిగా ప్రదర్శించే ప్రయత్నాలే. అలాంటి రచనలు చూసి చూసి, జీవితకథలు అంటే తేనెలద్దిన ఆయుర్వేదపు గుళికల్లాంటి చేదుమందులే అన్న అభిప్రాయం కలుగుతున్న రోజులివి.
ఇలాంటి రోజుల్లో … ‘సమ్మాన్యుడు’ అయిన యోగి గారి కుటుంబంలో చేంబోలు శ్రీరామశాస్త్రి అనే ఓ తమ్ముడు తాను జన్మించిన దగ్గరనుంచి చాలా దగ్గరనుంచి చూసిన తన అన్నగారి జీవిత శైలి గురించి, జీవనగమన రీతి గురించి, ఆలోచనా సరళి గురించి… ఇలా పలు కోణాల్లో విశ్లేషించి, ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా రాయటం ఓ సాహసం.
అన్నగారు స్వర్గస్థులయ్యాకనే ఆ తమ్ముడు ఈ రచన చేసి ఉంటే, దీని నిజాయితీ
ఉండేదేమో! కాని 2015 లోనే ప్రారంభించిన ఈ రచనని ఆయనకే చూపించి “నీ గురించి నా విశ్లేషణ ఇది అన్నయ్యా” అని చెబితే, ఆ అన్నగారు దాన్ని ఆసాంతం చదివి, “నా వ్యక్తిత్వాన్ని భలే బాగా పట్టుకున్నావురా అబ్బాయి” అన్నాడు. ప్రశంసాపూర్వకంగా.
ఏమిటా వ్యక్తిత్వం?
Reviews
There are no reviews yet.