Short Stories
-
By : Ranganayakamma
” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!
₹70.00” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!
-
-
Aadhunika Mahabharatham
“ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…
– పవన్ కళ్యాణ్
₹550.00Original price was: ₹550.00.₹450.00Current price is: ₹450.00. -
-
-
Amerika Ammayi
₹175.00హ్యాపీ నూతన సంవత్సరం
ఉద్యోగాల కోసం కొందరు, చదువుల కోసం కొందరు, ఇలా వారి వారి కలల వెంటపడి చేరుకునే గమ్యం ఒకటి ఉంది… అదే అమెరికా!
చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడి నుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడివారైనా పూర్ణకుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పి.లు అనీ అనుకునే రోజుల నుండీ… ‘ఆ వదినా, మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను. దార్లో మీ అబ్బాయికి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. ఇచ్చేసి వస్తాను’ అనే రోజుల్లోకి వచ్చేసాము. దూరం కొద్దీ విలువని అంచనా వేసే మనం, ఆ దూరం తగ్గిపోయేసరికి విలువనీ తగ్గించేస్తున్నామేమో?
ప్రపంచంలో అందరూ రెండే రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఉత్తములు అయితే మరొకళ్ళు అధములు. వీళ్ళు కాకుండా మరొక రకం ఉంది. అదే ‘మధ్యముల్’ అన్నమాట. పైన చెప్పిన రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అందరి సమస్యలు నెత్తిన వేస్కుని భూభారాన్ని మోసేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో ఫస్టు ఉండేవాళ్ళలో నేనొకదాన్ని. ఉద్యోగం వదిలేసి భర్త వెంట అమెరికావాసం వచ్చిన కాండిడేట్ని. వీసా సమస్యల వల్ల ఇంట్లో…………….. -
Amma Dairylo Konni Pageelu
₹220.00Amma Dairylo Konni Pageelu – This book orderd customers will get Rs. 30 CASH BACK OFFER
(APPLY FOR ONLY ADVANCE PAYMENT MADE TO PHONE PAY NUMBER 6281596253) -
Amrutham Kurisina Rathri
₹200.00Amrutham Kurisina Rathri
అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ “అమృతం కురిసినరాత్రి” కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.
ఇందులో ఉన్న కవితా ఖండికల పేర్లు:
ఆర్తగీతం, సి.ఐ.డి., రిపోర్ట్, వెళ్ళిపొండి – వెళ్ళిపొండి, టులాన్, మాగ్నకార్టా, గొంగళి పురుగులు, శిఖరారోహణ, భూలోకం, ప్రకటన, నిన్నరాత్రి, లయగీతం, యుద్ధంలో రేవు పట్టణం, కఠినోపనిషత్, శిక్షాపత్రం, ముసలివాడు, వేసవి, ప్రార్థన, మైనస్ ఇంటూ ప్లస్.
-
-
-
Aruna Netraalu
₹150.001. చేజారిన సిరి“నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.
“అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.
ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”
వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.
“ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”
నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,
“ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….
-
-
-
-
Attar ( Itara Kathalu)
₹150.001. చేజారిన సిరి“నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.
“అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.
ఖాళీ ఐన బీరుమగ్గును – ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, “పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ….. దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”
వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.
“ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”
నా కేసి నిశితంగా చూశాడు – నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,
“ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే – తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో………….
-
Ayn Rand Philosophy
₹250.00ఫిలాసఫీ; ఎవరికి అవసరం?(మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)
నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?
మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.
మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.
‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………
-
Ayn Rand Philosophy
₹250.00Ayn Rand Philosophy
ఫిలాసఫీ; ఎవరికి అవసరం?(మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)
నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?
మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.
మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.
‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………
-
-
-
-
-
-
CHARITRADAARULLO
₹180.00వేంకటేశ్వరునికి పరమభక్తుడై ఎన్నోసార్లు దర్శించి అనేక కైంకర్యాలు చేసి కవితాకన్యను కూడా సమర్పించిన కృష్ణదేవరాయలు విజయనగరంలో ఒక్క వేంకటేశ్వరాలయమైనా నిర్మించకపోవడం విచిత్రం.
జినభవనాలు(మఠాలు) కట్టించుట, జినసాధువుల పూజలు చేయుట, జైనమునులకు నచ్చిన భోజనములు పెట్టుటలో ఇతర జైనులెవ్వరూ జినవల్లభునితో సరిపోలజాలరు.దశావతారాలు శిష్టసాహిత్యం బాగా నాగరీకమైన తరువాత బలపడిన భావనలు. జానపద సాహిత్యంలోకి శిష్టసాహిత్యంనుండే దశావతారాలు వెళ్లాయి అని నా ఊహ.
ప్రపంచ వీరగాథ సాహిత్యచరిత్రలో పలనాటి వీరగాథ, కాటమరాజు కథ, బొబ్బిలియుద్ధం కథల వలన ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం ఏర్పడి వుంది. వీటిలో మొదటి రెండు పురాతనమైనవి. వాటితో పోలిస్తే బొబ్బిలి యుద్ధం, కథా ఆధునికమైనవే.
తెలివిడి అందినంతమేర చూస్తే రామదాసు పూర్వమైనా, సమకాలం లోనైనా, తరువాత చాలాకాలం వరకు రాముడే భజనకి ఆధారదైవం అనిపిస్తుంది.
మధురాష్టకం చాలా సుబోధక రచన. భారతీయులకు ఏభాష వారికైనా అర్థమవుతుంది. అది పేరుకి సంస్కృతరచనే అయినా, ఆ స్తోత్రంలోని పదాలు అన్ని భారతీయ భాషలలో సర్వసాధారణంగా వాడే పదజాలమే. -
-
Chitti Raja (Telugu)
₹80.00చిన్ని గ్రహం నుంచి వచ్చాడు. ఓ చిట్టిరాజా, సహారా ఎడారిలో పాడైపోయిన తన విమానాన్ని బాగుచేసుకొంటున్న ఓ పైలట్న పలకరిస్తారు. ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తాడు. పైలట్ను తబ్బిబ్బు చేస్తాడు. అబ్బురపరుస్తాడు. ఆనందింపజేస్తాడు.
కనిపించి ఆనందపరిచినట్టే ఇట్టే మాయమై ఆలోచింపజేస్తాడు. చిట్టిరాజు పెద్దవాళ్లకు ఓ కనువిప్పు -
-
Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
₹390.00చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు… కంట కన్నీరు… గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ… ఇంకా ఏం కావాలి నాకు?
‘దర్గామిట్ట కథలు’ చదివిన పాఠకులు కొందరికి ‘పోలేరమ్మ బండ కథలు’ తెలియవు. ‘పోలేరమ్మ బండ కథలు’ చదివిన కొందరికి ‘దర్గామిట్ట కథలు’ ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను.
– మహమ్మద్ ఖదీర్ బాబు
-
-
-
Gajula Sanchi
₹150.00నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా’ అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ……
– మొహమ్మద్ గౌస్ -
Gangarajam Bidda
₹150.00బోర్లించిన చెప్పు
అనుకోకుండా ‘అమ్మ’ ఫోన్ చేసింది. శరత్కు నెల కింద కొడుకు పుట్టాడట. ఫంక్షన్ ఇవ్వాళ సాయంత్రం రంగనాథ ఆలయంలో చేస్తున్నారు. అందరినీ రమ్మని చెప్పింది. మరీ ఆలస్యంగా చెబుతున్నందుకు ‘మాఫ్’ చేయమంది. ‘కిస్మత్’ ఉండబట్టి, నా నంబర్ అంకుల్ పాతడైరీలో దొరికిందట. మగవాళ్లను అంకుల్ అని పిలిచినా, కొంచెం పెద్ద వయసు ఆడవాళ్లను నేను అమ్మ అనే అంటాను. కొత్తపేట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ల పై పోర్షన్లో మేము కిరాయికుండేవాళ్లం.
ఆదివారం, అందునా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, పైగా పెద్ద ఎంగేజ్మెంట్స్ కూడా లేవు కాబట్టి బయల్దేరాను. హైదరాబాద్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. మాకు ఇంత దగ్గర్లో ఇంత పెద్ద గుడి వుందనే తెలీదు నాకు. గుడికి బయట అంటూ ఏమీలేదు. చెప్పుల్తోనే లోనికి వెళ్లి, భారీ దర్వాజా పక్కకు విడిచాను. వదిలిన చెప్పుల్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువమంది వచ్చినట్టు లేదు. ఫంక్షన్ ఆరింటికని చెప్పింది. ఫ్యామిలీగా వెళ్తే వేరే… ఇలాంటి చోట నాకు ఏమీ తోచదనే, మరీ టైముకు వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని ఓ అరగంట ఆలస్యంగా చేరేట్టే ప్లాన్ చేసుకున్నాను. అయినా జనం వచ్చినప్పుడే వస్తారు.
రోడ్డు పక్కనున్న గుడే అది. అయినా అంతటి రొద లోనికి రాకుండా గడప ఆలయాలకే ప్రత్యేకమైన నిశ్శబ్దం చెవులకు వినబడుతోంది. వెళ్తూనే, అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించింది, “కైసే హో బేటా” అంటూ, పొద్దున…………
-
Gelupu Sare. . . Batakadam Elaa?
₹120.00‘గెలుపు సరే బతకడం ఎలా’ అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్నా రచనలు, ఉద్భోదిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్దతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్దతి ‘ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు’ అంటూనే ఎలా ఉండకూడదో, అలా ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటోందని కనిపించని వ్యంగ్యంతో రాసిన రచన ఇది. ఏ ప్రక్రియకీ వొంగనిది.
– కె. ఎన్. వై. పతంజలి
-
-
Gupta 91 By Patanjali Sastri
₹175.00గుప్తా ’91
గుప్తా తడిలేకుండా శుభ్రంగా తల తుడుచుకుని వచ్చి చంకల్లో కొంచం పౌడరు చల్లుకొని, తువ్వాలు అవతల పారేసి లోపలి లాగులో అద్దం ముందు కూచున్నాడు. వంటింట్లో గుప్తాకి లంచి బాక్సు పెట్టి, అతని సంచిలో పెట్టి గదిలోకి వచ్చింది పార్వతి. చేతిలో దువ్వెన పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నా డతను. బ్రాహ్మీ నూనె సీసాలోంచి కొంచెం నూనె అరచేతిలోకి ఒంపుకుని రెండు చేతులకి రాసుకొని ఎదురుగా నుంచుని అతని నల్లటి వంకీల జుట్టుకి రాస్తోంది. ఆమె తెల్లటి పొట్ట అతనికి దగ్గరగా ఉండటంతో ముందుకు జరిగి పొట్టమీద ముద్దు పెట్టుకున్నాడు గుప్తా.
“చాల్లెండి సంబడం. ఎదిగిన పిల్లలున్నారని తెలీదేటి?” |
“ఆళ్లెదిగితే నేనేం జెయ్యనే? దానికి దీనికి సంబంధం ఉందాసల?”
“ఇంక దువ్వుకోండి. మీ అమ్మగారికి టిఫిను పెట్టాలి.”
“పూజ అవ్వలేదా?”
“అత్తగారివాళ ఉషారుగా ఉన్నారు.”
“అదేం?”“ఆవిడ ఫెండు మజ్ఞాన్నం ఒస్తాడట. కొంచెం టిఫిను ఎక్కువ చెయ్య | మన్నారు.”……………..
-
Gypsylu
₹150.00పైరగాల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముందుకి సాగిపోయే సంచారులు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. భారతదేశపు గదులియా లోహర్, ఆఫ్రికా పశువుల కాపరులు , అరేబియా ఎడారిలో జీవించే ఒంటెల కాపరులు, మధ్య ఆసియా కొండల్లో తిరిగే డ్రోక్ పా పశువుల కాపరులు, ధృవప్రాంతాల్లోని సంచారులు, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీలు లాంటి అస్థిరవాసుల జీవితాలను “తెలుగు వెలుగు” లోనికి తీసుకురావటానికి ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ “జిప్సీలు”.
-
Idi Naa Godava
₹150.00కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.
-
-
Irani Cafe
₹150.00మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి.
కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
– వి. మల్లికార్జున్ -
K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili
₹120.00K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili
-
-
-
-
-
Kathalela Rastaru? ? By Sarvari
₹300.00కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు
– ఆరుద్ర
“మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి.
మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.)
బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి.
“చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.
భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,………
-
-
Kishan Chander Enika Chesina Kathanikalu By R Chandrasekhara Reddy , Jai Ratan
₹200.00కిషన్ చందర్ కథలను అనువాదం చెయ్యడం నాకు గొప్ప అనుభూతి. మనకు తెలియని జీవిత పార్శ్వలను కొన్ని ఆవిష్కరిస్తే మరికొన్ని మనకు తెలిసిన విషయాలనే కొత్తగా ప్రదర్శిస్తాయి. వాస్తవికత కళాత్మకతల కలనేత కిషన్ చందర్ కథానికా సాహిత్యం. దేశ విభజన నాటి విషాదాలను, యుద్ధానుభవాలను, అరుదైన మానవ సంబంధాలను మనం కిషన్ చందర్ కథలలో చూడవచ్చు . అంతేకాదు మనిషి విలువలను విస్మరించిన మనకార్య నిర్వహణ వ్యవస్థ నగ్నరూపాన్ని కూడా కొన్ని కథలలో చదివి నిబిడాశ్చర్యంలో మునిగిపోతాం. మౌఢ్యం మన జాతిని ఎలా వెర్రిదానిని చేస్తుందో తెలుసుకుంటాం.
– జై రతన్, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
-
-
Komuram Bheemu
₹250.00ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు
-
Kondamallu
₹300.00Kondamallu
అడవి మొగ్గల వాన గోరటి వెంకన్న
డవి మొగ్గల వాన.. చెంచు గిరుల కోన, కారుకోడి పదును, బ్రహ్మనాయుడి కదును కథావరణంలోకి మనలను అలవోకగా తీసుకుపోయే నవల ఇది. అడవిని ఆలంబన చేసుకొని, తనే ఒక ఆదివాసిగా మారి చెంచుల జీవితాన్ని చిత్రిక పట్టిన తొట్ట తొలి చారిత్రక నవల. రచనా మౌలిక తత్వాన్ని ఆకళింపు చేసుకున్న, గతాన్ని తొవ్వి ఉన్నవి, విన్నవి, వర్తమాన అధ్యయనంలో కన్నవి, ఎరుకపడినవి అన్నింటిని కుప్ప పోసి ఉద్వేగ భరిత శైలితో ప్రాణప్రతిష్ట చేసిన నవలే కొండమల్లు.
“పోసగు ముత్యపు సరులు మోహరించిన రీతి తమలోన దొరలు శబ్దముల” గూర్చి (పింగళి సూరన) అల్లిన గాథ ఇది. అడవిలో కృతక విలాసాలు ఉండవు. కానీ ఆహ్లాదమంత అడవి ఒడిలోనే ఉన్నదన్నంత గొప్పగా ఉంటుంది. ఋతువు ఋతువుకు మారే అడవి అందాలుంటాయి. ఎగిరే ఎన్నో పిట్టలు తమ భాషలో శబ్దం నొంపుతూ మనలను మురిపెంగా పలకరిస్తాయి. ఎన్నో పాకే చెట్ల తీగలు లేత మునివేళ్ళతో మనల్ని తడుముతాయి. పుటల నిండా పరుచుకున్న అడవి చెట్ల పుప్పడి సుగంధం మనల మరో లోకం మైకంలోకి తీసుకు వెళ్తుంది. ఆధునిక జీవన అవిటి తనాన్ని వెనుకకు నెట్టే శక్తి గల అక్షర పొదుగు ఈ నవల.. పసరుటాకుల నులి స్పర్శ, దేహ మాలిన్యాన్ని తొలగించే కొండ పసుపు ఇది. అలసటను మరిపించే ఇప్పపూల. అమ్మ సిరుల సామ్రాజ్యపు ఒద్దిమాను బండాగారమిది…………………………..
-


































































































