ధునిక జీవన సాహితీవేత్త యండమూరి
నాకు ఊహ తెలిసినప్పటి నుండే కాదు, ఎరుక ఏర్పడిన నాటి నుండీ యండమూరి ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం, నిన్నటి తనతో నేటి తను పోటీ పడుతూ… తనని తాను అధిగమిస్తూ రావడం చూస్తున్నాను.
ఎప్పుడో ‘కుక్క నాటిక చూసి అబ్బా అనుకున్నాను. నాటక రచన నుండి నవలాకారుడిగా, వ్యక్తిత్వ వికాస రచనల నుండి వివిధ రంగాల వ్యక్తులను ప్రభావితం చేసే వక్తగా, విజేతల జీవితాలను అక్షరీకరించే బాధ్యుడిగా, ఇలా మారుతున్న కాలానికీ, తరానికి కావలసిన అవసరాలను గుర్తిస్తూ, ఆ అవసరాలకు తగిన మార్గదర్శకత్వం వహిస్తూ వస్తున్న తనను గమనిస్తూ వస్తున్నాను. నిజమైన గెలుపంటే ఇదే కదా.
మహా మహా రచయిత్రుల గిరజాల జుత్తు, ఆరడుగుల ఆజానుబాహువుల పడవంత కార్లలో పయనిస్తున్న నన్ను, ఆ ఊహాకాశ విహరణ నుండి భూమార్గం పట్టించిన రచయిత యండమూరి. ఒక్క నన్నేనా… అనేకానేకులను వివిధ రంగాలలో శిఖరాగ్రాలకు చేర్చిన చోదక శక్తిమాన్ – యండమూరి. నేనెప్పుడు సభలకు, కాలేజీలకు ఇంకెన్నో సంస్థలకు వక్తగా వెళ్ళినా (అకడమిక్ గా కాకుండా) ఏం చదివానో చెప్పాల్సి వస్తే…..
నన్నయ్య నుండి నారాయణరెడ్డి వరకూ కందుకూరి నుండి యండమూరి వీరేంద్రనాథ్ వరకూ అని చెబుతాను.
నామీద యండమూరి ప్రభావం గురించి చెప్పాలంటే, 1993 లో యండమూరి ఒక పుస్తకంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘బర్న్ ది షిప్’ అన్న అధ్యాయంలో రిస్క తీసుకుంటే యాభై శాతం విఫలం, యాభై శాతం సఫలం కావచ్చు. రిస్క్ తీసుకోకుంటే | మాత్రం వంద శాతం విఫలమే” అనే వాక్యాలు చదివి, గవర్నమెంటు కొలువుకి నిరాదు. జలపాతవేగంతో సినీసాగరంలో దూకినవాణి. ఆ విధంగా సినీగేయ రచయితను అయి | ఆరాలన్న నా ‘కసి’ కి ఆజ్యం పోసి మండించిన పరోక్ష యాజకుడు యండమూరి |
రాములమ్మ నుండి రాగూర్ దాకా, రోబో నుండి ఆర్.ఆర్.ఆర్ దాకా సినీ గేయ | రచయితగా ఇరవై తొమ్మిదేళ్ళుగా ప్రవహిస్తున్నాను. ఎప్పుడైనా వృత్తిగత జీవితం ఎదురితగా…………
Reviews
There are no reviews yet.