Chandamama Kathalu- 3 (1970- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

400.00

In stock

Author: Vasundhara

రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి పౌష్టికాహారం కావాలి. మానసిక వికాసానికి చదువు కావాలి. ఐతే పిల్లలకి పౌష్టికాహారం కంటే ఫలహారాలూ, చిరు తిళ్లూ ఎక్కువిష్టం. అందుకని వాళ్ల ఆరోగ్యానికి భంగం కలగకుండా, ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్లను రూపొందించాలి. అలాగే పిల్లలకి చదువుకంటే ఆటపాటలూ, కథలూ ఎక్కువిష్టం. అందుకని అవి జ్ఞాన, విజ్ఞాన, వికాసాలకు అడ్డుపడకుండా, మనసుకి ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని, వినోదాన్ని కలిగిస్తూ అర్థవంతమై ఉండాలి. కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక ‘చందమామ’ అన్నది నిర్వివాదాంశం. ఆ కథలు సంప్రదాయపు గొప్పతనం చెబుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. తప్పొప్పులు వివరిస్తాయి. క్రమశిక్షణని ప్రబోధిస్తాయి. నవ్విస్తాయి. ఒళ్ళు జలదరింపజేస్తూనే అలరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అవి చదువే అనిపిస్తాయి. ఒక్కోసారి అవే చదువనిపిస్తాయి.

                  చందమామ కథలు చదువుతూ ఎదిగిన మాకు అవెంత ప్రయోజనకరమో తెలుసు. ఎదిగేక అదే ఒరవడిని అనుసరిస్తూ మేమూ పిల్లల కథలు వ్రాస్తే, వాటిని చందమామే ఆదరించడం విశేషం. అలా అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చందమామకు కృతజ్ఞులం.

               1947లో ఆరంభమైన చందమామ నిరవధికంగా 66 ఏళ్ళు కొనసాగి 2013లో కనుమరుగైంది. ఆ పత్రికలో వచ్చిన వందలాది మా కథల్ని, నేటి బాలలకి మళ్లీ అంత అందంగానూ అందిస్తామంటూ ముందుకొచ్చారు జె.పి. పబ్లిషర్స్. మా కథల పట్ల వారి అభిమానానికి ధన్యవాదాలు. బాలసాహిత్యం పట్ల వారి అంకిత భావానికి అభినందనలు. ఇక పాఠకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.

Author

Vasundhara

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Chandamama Kathalu- 3 (1970- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)”

Your email address will not be published. Required fields are marked *