-
-
-
-
-
-
Andaala Natudu Harnath
₹250.00అందాలుచిందే రూపం…! అలచందమామ రూపం!!
హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. ‘యూ ట్యూబ్’ వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి ‘పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన ‘శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము’ అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం.
హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ ‘ఖిల్జీరాజ్యపతనం’ నాటకంలో కథానాయకుడి పాత్ర…………. -
Periyar Reader
₹200.00పెరియార్ జీవిత సంగ్రహం
1879 సెప్టెంబర్ 17 : – చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా ‘ఈ రోడ్’లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.
1885 (ఆరేళ్ళ వయసు) : – ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
1889 పదేళ్ళ వయస్సు : – ప్రాథమిక విద్య పూర్తయింది.
1891 (12 ఏళ్ళు) : – అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.
1895 ; – తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
1898 ; – అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
1900 : – అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
1904 : – తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను
విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.
చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి “యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ………..
-
Bhramana Kaanksha
₹300.00పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.
ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.
– అత్తలూరి నరసింహరావు
-
Christu Charitra (Gurram Jashuva Rachanalu)
₹100.00పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
‘క్రీస్తు చరిత్ర’ (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.
క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగి చెప్పారు.
రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు.మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. కాని దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పర విరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.
-
Nenu Mee Bramhanandam
₹275.00ఈ పుస్తకం ఎందుకు చదవాలి?
నేనేంటో నా సినిమాలు చెప్తాయి…
నేనేంటో మీ హృదయాలు చెప్తాయి…
నేనేంటో నా అవార్డులు చెప్తాయి…
నేనేంటో నా బిరుదులు చెప్తాయి…
కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు…
నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,
ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.
మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.
ఆ రెండోవైపే ఈ పుస్తకం!
ఇందులో నా జీవితం యథాతథం!!
***
ఒకరి అనుభవం – ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.
ఒకరి అనుభవం – ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.
ఆ ఒకరు మీరు కావొచ్చు!
మీలో ఒకరైనా కావొచ్చు!
అందుకే నేను – నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను………
-
Yedu Tharalu
₹250.00“పరిశుభ్రమైన గాలి క్షణమాత్రం సోకితేనే గజగజలాడిపోయే ఊపిరితిత్తులు;;; వొంటి నిండా బట్టలుండవు – మలవిసర్జన జరిగిపోతుంటే శుభ్రం(గా)చేసుకోవటానికి కూడా వీలు లేకుండా కాళ్ళూ, చేతులకు సంకెళ్ళు – పండ్లతో, గాయాలతో, చీము నెత్తురులోడే భుజాలు, మోచేతులు, పిర్రలు;;; పిచ్చలు కోసేయ్యటం – మర్మాంగాలు నరికెయ్యటం – ఎముకలను కరుచుకున్న మాంసం వూడొచ్చేదాకా కొట్టటం, నిండు గర్భిణులను పొట్ట కింద గుంత తవ్వి, బోర్ల పడుకోబెట్టి, కొరడాలతో కొట్టటం, జంతువులను వేటాడాల్సిన వేట కుక్కల చేత మనుషులను వేటాడించటం;;; చర్మాన్నీ, నరాల్ని, కండల్నీ, ఎముకనూ, ఒక్క వేటుతో ఛేధిస్తూ, ఓ గొడ్డలి మొన మన కుడి కాలును మన శరీరం నుండీ వేరు చేస్తుంటే…;;; అవయవాలుండవు; ఉన్నా అవి దొరల కోసం! తోడు లేదు – బిడ్డలు లేరు – సంసారం లేదు – స్వజనం లేరు – స్వగ్రామం లేదు – స్వదేశం లేదు – గతం లేదు – భవిష్యత్తు లేదు;;;” నాగరికత, హక్కుల ముసుగు లో ఓ జాతి మరో జాతి మీద సాగించిన దాష్టీకాలను, ఆకృత్యాలను, అర్ధం చేసుకోవటానికి “ROOTS / ఏడు తరాలు” – (By Alex Haley) ని చదవండి. INDEPENDENCE DAY అంటే హాలిడే కదా ఆడుకోవచ్చు అని ఎదురు చూసే పిల్లల చేతా, లాంగ్ వీకెండ్ ఏమో అని క్యాలెండర్లు వెతికే పెద్ద వాళ్ళ చేతా, ఈ పుస్తకం చదివించండి! స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ల విలువేంటో, దాని కోసం మన ముందు తరాల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, త్యాగాలు చేసుంటారో, ఎం కోల్పోయారో, కనీసం ఊహించనైనాగలరు !!
Reviewed By Seshumadhav Chaturvedula
విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన. ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.
‘రూట్స్’ పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
-
Mahatma Jyothirao Pule
₹150.00శ్రీ ధనంజయకీర్ గారు ఇంగ్లిష్ లో రాసిన Mahatma Joti Rao Phooley; Father of The Indian Social Revolution అనే గ్రంధానికి ఇది స్వేచ్చానువాదం.
నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ … వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం.
నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది.
స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే.
విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం.
ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.
అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు.
వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది.
హిందూమతోన్మాదం ఇవాళ …మతభక్తే … దేశభక్తి … అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇ లాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుంది.
రచయిత ధనంజయ్ కీర్ మహారాష్ట్రకు చెందిన వారు. డాక్టర్ అంబేడ్కర్ మిత్రుడు. 1969లో వెలువడిన మహాత్మా ఫూలే సమగ్ర వాజ్మయ్ పుస్తకానికి సంపాదకులు. ఆయన మహాత్మా జోతిరావ్ ఫూలే జీవితం గురించి చాలాకాలం పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ పుస్తక స్వేచ్ఛానువాదకురాలైన డా. విజయ భారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో అంబేడ్కర్, పురాణాలు-కులవ్యవస్థ పేరుతో రాసిన సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు ముఖ్యమైనవి.
-
-
Pravahinche Uttejam Che Guevara By Katyayani
₹200.00“చేగెవేరాని ” క్యూబా విప్లవానికో, బొలివియా పోరాటానికో పరిమితం చేసి చూడలేము. తను విప్లవ స్వప్నాల్ని ప్రపంచరీకరించిన భావుకుడు, విప్లవకారుడు. గెరిల్ల యోధుడు, అరుదైన నాయకుడు.. జీవన్మరణాలు రెంటికి సార్ధకత ఉండాలని తపించిన మనిషి.. అతని జీవితం లోని సమకాలీన ప్రాధాన్యతను మళ్లీ మన ముందుకు తెచ్చేదే ఈ రచన.
-
Sathavasamthala Ghantasala
₹500.00శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన” అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.
-శ్రీశ్రీ
అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల– డాక్టర్ సి. నారాయణ రెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగ భావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది!– దాశరధి
చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
తళతళ మెరయు గంధర్వతార
తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
వేలకొలది గీతమ్ముల నాలపించి
ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
కంఠకర్తారమాల! మా “ఘంటసాల!”– కరుణశ్రీ
-
-