-
-
-
-
-
Piradousi
సుకవి
పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సృష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణి మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా సృజించినవాడు……………
-
-
-
Maa Kathalu 2022 By Ch Sivarama Prasad
అనామిక
– గడ్డం దేవీప్రసాద్
హఠాత్తుగా పెద్ద వర్షం కురవడంతో రోడ్డుపై నడుస్తున్న నేను పరుగెత్తి ఓఇంటి తలుపు దగ్గరగా వెళ్ళి నిలుచున్నాను. తల తడవలేదు కానీ వర్షం ఏటవాలుగా పడుతున్నప్పుడు ప్యాంటు తడుస్తోంది. పూణేలో ట్రైనింగ్ కోసం వచ్చిన నేను మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడంతో ఇక్కడి ఒక పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న గౌతమ్ అనే మిత్రునితో కలిసి అతని బండిపైన తిరుగుతూ ఓషో ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలస్ చూసి దగ్గుషేత్ గణేష్ మందిరానికి వచ్చాము. ఇంతలో గౌతమ్కు వాళ్ళ ఎస్.ఐ. నుండి ఫోన్ వస్తే త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు.
“అందరి ఆ! భారీ బారిష్ హెరాహీ హై ఇస్తే అభి హిట్ న హెూనే దో” లోపలికి రండి. వర్షం ఎక్కువగా వస్తోంది. ఇది ఇప్పట్లో తగ్గదు) అంటూ ఒకామె తలుపు తీసి లోనికి రమ్మని చెప్పింది. నేను తప్పనిసరి పరిస్థితిలో లోనికి వెళ్ళాను………….
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Nalla Pillana Grovi
సాహిత్య భ్రమరం
ఆ మధ్య విశాఖపట్టణంలో జరిగిన ఒక బాలసాహిత్యం వర్క్ షాపుకి వెళ్ళినప్పుడు వెంకట నారాయణ పరిచయమయ్యాడు. పరిచయమంటే మామూలుగా కుశలప్రశ్నలు అడగడమో, తీరిగ్గా, నింపాదిగా విశేషాలు తెలుసుకోవడమో కాదు, ఆ ఉన్న కొద్ది సేపట్లోనూ నాతో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలనీ, సాహిత్యం గురించి తనకి ఉన్న అనేక అభిప్రాయాలూ, ప్రశ్నలూ, ఆశ్చర్యార్థకాలూ అన్నీ అక్కడికక్కడే అప్పటికప్పుడే నాతో పంచుకోవాలనీ, ఓ! చెప్పలేనంత ఆతృత, దాహం కనిపించింది అతడిలో.
సరిగ్గా నా రాజమండ్రి రోజుల్లో నేనట్లానే ఉండేవాణ్ణి. ఎవరేనా కవి, రచయిత,………………….
-
-
-
Gelupu Sare. . . Batakadam Elaa?
‘గెలుపు సరే బతకడం ఎలా’ అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్నా రచనలు, ఉద్భోదిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్దతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్దతి ‘ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు’ అంటూనే ఎలా ఉండకూడదో, అలా ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటోందని కనిపించని వ్యంగ్యంతో రాసిన రచన ఇది. ఏ ప్రక్రియకీ వొంగనిది.
– కె. ఎన్. వై. పతంజలి
-
-
-
-
-
Mandu Chupu
ప్రస్తావన
గోదావరి గలగలా ప్రవహిస్తోంది. గోల్డ్క్ సిగరెట్ కాలుస్తున్న కవి కుమారునికి ఆ పొగ ఘుమఘుమగానే వున్నట్టుంది. గోదావరి గట్టు గచ్చు చప్టా మీద ఏడెనిమిదిమంది మిత్రులు కూర్చున్నారు. వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలుతోంది. వాళ్లు గోదావరి వంక చూస్తున్నారను కుంటే నీళ్లల్లో మందు పోసినట్టే. వాళ్ల కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి. ఓ పావు గంట గడిచింది.
‘శ్రీశ్రీ ఓ సినిమాలో అన్నట్టు… ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు’ అన్నాడు. కొటేషన్రావు. (అతని అసలు పేరు కోటేశ్వరరావు)…….. -
Nenevvaru? Sriramaniyam
డా. ముదిగొండ వీరభద్రయ్య ఇంతకుముందు 60 సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను 2007 లో శ్రీ రమణాశ్రమంలో ఉండి రచించారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జ్ఞాన మననము, ఆత్మ శాస్త్రము, శ్రీ సత్యసాయి బోధనలు నేపథ్యంలో ‘అద్వైత జ్ఞాన ప్రకాశిక’ అన్న తత్త్వగ్రంథాలను (అన్నింటిని సత్యసాయి బుక్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ప్రచురించింది), భగవాన్ శ్రీ సత్యసాయి జీవిత మకరందం (బ్రౌన్ అకాడమీ ప్రచరణ) గ్రంథాన్నీ రచించారు.
ఇప్పుడు ఈ “నేనెవరు – శ్రీ రమణీయం” అన్న గ్రంథాన్ని రచించి భగవాన్ రమణుల మార్గాన్ని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక కోసం రచించినవి.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్ష పదవి నుంచి 2004 లో విరమించాక ప్రస్తుతం వీరు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో గౌరవ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు.
– ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
-
-
-
-
-
రోబో బుద్ధ
రాణి శివశంకరశర్మ కథలు
ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు. -
Life of Swami Vivekananda Set 2 Vols (Telugu)
₹150.00Original price was: ₹150.00.₹140.00Current price is: ₹140.00. -
Sanchari
గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
-
-