-
Chivari Gudesa
₹120.00చివరి గుడిసె
యదార్ధమైన చేనులో ఎలుకల నుండి కాపాడటానికి మనణియానికి ఏ యానాది అవసరమయ్యాడో అదే యానాది బైరాగి ఆత్మిక క్షేత్రాన్ని కామక్రోధాలనే ఎలుకలు పది కొల్ల గొట్టటానికి కారణమయ్యాడు. వాస్తవ సన్నివేశము, ప్రతీకా ఇంత అద్బుతంగా కలగలిసిన రచనలు ఎంతో అరుదుగా కనిపిస్తాయి.
– వాడ్రేవు చినవీరభద్రుడు.
యానాది కులవృతి చేసుకుని బతికిన పాత తరానికి మన్నుగాడు చివరి ప్రతినిధి అయితే, పొట్టకూటికి మట్టి పని చేసుకొని బతికే కొత్త తరానికి చిన్నోడు మొదటి ప్రతినిధి అవుతాడు. అయితే కులం చిన్నోడిని అక్కడా వెంటాడుతుంది.
– అంబటి సురేంద్ర రాజు -
Kathala Godari
₹120.00వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. -
-
-
-
Smasanam Dunnaru
₹130.00స్మశానం దున్నేరు
హరిజనుల మీద పెత్తనం చెలాయించినంత మాత్రాన తాము పెత్తందారులయి పోరు. పెత్తందారులకు తోట్టులుగానే మిగిలిపోతారు. తమ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తే తోత్తుల్ని కూడా వెంటాడి వేధిస్తారు అదే పెత్తందారులు. బి.సి. కులాల సహకారం తీసుకుంటూనే హరిజనుల్ని అణచివేసే భూస్వామ్యపు అహంకారం, స్వార్ధం, కుటిలవుహ్యంలోని ఎత్తుగడలు అర్ధమవుతాయి ఈ నవల చదివితే.
ముఖ్యం గా పీడిత కులాల్లోని అంతర్గత వైరుధ్యాల్ని తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా రెచ్చగొట్టడమనే పద్ధతి ఈనాటికీ కొనసాగడం వర్తమాన సామజిక,రాజకీయ పరిస్థితుల్ని గమనించినవారికి తేటతెల్లంగా కనిపిస్తుంది. అందుకే ‘స్మశానం దున్నేరు’ నవల కేవలం ఒక కధ మాత్రమే కాదు. ఒకనాటి జీవితాన్ని రికార్డు చేసిన నవల మాత్రమే కాదు, దానికి సామాజికపరమైన ప్రాసంగికత ఉంది.
…..గుడిపాటి -
-
-
-
Zero Number One
₹150.00స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-
-
KGH Kathalu
₹150.00కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను. -
Akkineni Animuthyalu(Akkineni Shatajayanthi Shata Chitra Visheshalu)
₹150.00‘ధర్మపత్ని’ (1941) చిత్రంలో బాలనటుడుగా తెరపై కనిపించిన అక్కినేని నాగేశ్వరరావుకు హీరోగా తొలి చిత్రం ‘శ్రీ సీతారామజననం’.
-
-
-
-
Sagaram Eedatam Telikem Kadura
₹150.00సాగరం ఈదడం తేలికేం కాదురా
నాగ రచించిన సాగరం ఈదడం తేలికేం కాదురా తెలుగు సాహిత్యంలో ఒక స్పూర్తిదాయకమైన రచన. సాగరాన్ని ఈదటం తెలియకుండా అన్న శీర్షిక జీవితంలోని సవాల్లను, అనిశ్చితతలను, మరియు సాహసాన్ని సూచిస్తుంది. 133 పుటల ఈ చిన్న పుస్తకం పాఠకుని హృదయాన్ని లోతుల్లోకి లాగుతుంది.
- సాహసం మరియు సంఘర్షం: జీవితంలో అనిశ్చితతలను ఎదుర్కొనే విధానాన్ని స్పూర్తిదాయకంగా చిత్రించిన కధానికం.
- సంక్షిప్త రచన: 133 పుటలలో ప్రభావశాలిగా సాగే కధానికం — తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని అందిస్తుంది.
- ప్రేరణాత్మక సందేశం: సాగరాన్ని ఈదటం తెలియకుంటే ఏం చేస్తాం? అన్న ప్రశ్నకు సాహసంగా సమాధానం వెతికే కధానికం.
- ఆధునిక తెలుగు శైలి: నేటి పాఠకులకు స్పందించే సరళమైన, నేరుగా సాగే వాక్యనిర్మాణం.
-
-
Savaari-Kathalu సవారీ — కథలు
₹170.00సవారీ — కథలు
సంజయ్ ఖాన్ రచించిన సవారీ కథల సంకలనం, తెలుగు కథా సాహిత్యంలో ఒక విశిష్టమైన అధ్యాయం. ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళటం మాత్రమే కాదు — అది మనస్సును, అనుభవాలను, జీవితాన్ని మార్చే ప్రయాణం అన్న సందేశాన్ని ఈ కథలు పాఠకుకు అందిస్తాయి.
గ్రంథ విశేషాలు
- వైవిధ్యమైన కథలు: ప్రయాణం అనే ప్రతీకాన్ని కేంద్రంగా చేసుకొని, విభిన్న పాత్రల జీవిత అనుభవాలను చిత్రించిన కధా సంకలనం.
- మానవ స్వభావం: ప్రతి కధలో మానవ స్వభావంలోని సూక్ష్మతలు, బలహీనతలు నిజాయితిగా అందించిన రచన.
- సంజయ్ ఖాన్ శైలి: సరళమైన, ప్రవాహంగా సాగే తెలుగు వాక్యనిర్మాణం పాఠకుని కధలోకి లాగుతుంది.
- సామాజిక అంశాలు: సమాజంలోని వివిధ వర్గాల జీవితాన్ని స్పృశించే కధానికాలు.
-
-
-
That Last Melody
₹175.00అది సాన్ జోస్ లోని వాలెన్ బర్గ్ పార్క్. ఉదయం ఏడున్నర అవుతోంది. ‘ బ్లాక్ ట్రాక్ సూట్ లో చేతికి స్మార్ట్ వాచ్, చెవుల్లో ఇయర్ బడ్స్ వాటర్ బాటిల్ పట్టుకుని జాగింగ్ చేస్తోంది సారా.
పాటలు వింటూ చుట్టూ గమనిస్తూ ప్రశాంతంగా తన ప్రపంచంలో తాను విహరిస్తోంది.
కనువిందు చేసే ఆ పచ్చదనాన్ని చూస్తూ, చెట్ల మీద కిలకిలమంటూ కచేరీ చేస్తున్న పక్షులని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ‘ఉడికించే చిలకమ్మా నన్నూరించే అనే లిరిక్స్ వినిపించింది చెవిలో.
అక్కడి తెల్ల పిల్లలు కొందరు హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆలాపించే’.
తన ముందు ఒక అమెరికన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ నడవడం గమనించింది. ‘ముత్యాల బంధాలే నీకందించే
వాళ్ళని చూడగానే ఏదో గుర్తొచ్చి కాస్త బాధ పడింది. ‘అచ్చట్లు ముచ్చట్లు.
ఆ ఆలోచనలతో నడక, పాట రెండూ ఆపింది. ఆ అమెరికన్ జంటను చూసి ఒకవైపు బాధ, మరోవైపు ఈర్ష్య, ఇంకో వైపు కోపం, ఇలా ఎన్నో భావాలు ఒక్కసారిగా కలిగాయి. వాళ్ళని దాటి జాగింగ్ చేస్తూ తనవైపుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. చూడ్డానికి ఇండియన్లా ఉన్నాడు. మరీ పొడవు కాదు, అతడి బరువుకు తగిన హైట్. చామనఛాయ రంగు. ఎర్లీ తర్టీస్లోలో ఉండి ఉండొచ్చు. జాగింగ్ సూట్లో, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు…………….. -
-
-
-
-
-
-
-
-
Tholi Gayam
₹189.00బస్ స్టాప్ పిల్లలంటే ఎంత ప్రేమో! వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి
అందరూ వెళ్ళిపోతారు. కానీ వాళ్లు మళ్ళీ తిరిగి స్కూల్ నుండి వచ్చే వరకు బస్ స్టాప్ మాత్రం అక్కడే ఒంటరిగా, వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. అది వాళ్లతో మాట్లాడటానికి ఏరోజూ ప్రయత్నించదు, కానీ వాళ్ల మాటలు మాత్రం ఎంతో ఓపికగా, ప్రేమగా వింటుంది. ఆ ముద్దుముద్దు మాటలకు, వాళ్లకి వినపడకుండా నవ్వుతుంది కూడా. పాపం… సాయంత్రం బస్ తిరిగి వచ్చాక అయినా వాళ్లతో కొంతసేపు గడపాలని, రోజంతా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ పిల్లలు బస్ దిగాక, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వకుండా, చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఏదేమైనా, ఎన్నిసార్లైనా… మరో రోజుకోసం ఎదురు చూడటమే తనకి తెలిసిన ప్రేమ.
బస్ స్టాప్ ఎప్పటిలాగే, ఈరోజూ కూడా పిల్లల మాటలు వినాలని రోడ్ వైపు చూస్తూ ఎదురుచూస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం, బస్ వచ్చేవరకు పక్కవారితో తమ పిల్లలకు ఎంత విలాసవంతమైన జీవితం ఇస్తున్నామో అనే పోటీల్లో నిమగ్నమయ్యి, అప్పుడప్పుడు రోడ్ వైపు బస్ కోసం చూస్తున్నారు. అలా చూసినప్పుడే, రావలసిన సమయానికి బస్ రాలేదని చిరాకుపడుతూ, మళ్లీ తమ పోటీల్లో మునిగిపోతున్నారు.
-
-

































































































