కొన్ని కథలు మనసుని సున్నితంగా తట్టి లేపుతాయి. మనలో ప్రేమను, ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. అలాంటి కథలు కొంతకాలం మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు మీ చేతుల్లోకి రానున్న “నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ” కూడా అచ్చం అలాంటిదే. రచయిత్రి అద్భుతంగా మలిచిన ఈ ప్రేమ కథ మిమ్మల్ని మీ తొలి ప్రేమల్లోకి తీసుకెళ్తుంది. ప్రేమంటే ఆకర్షణ కాదు బాధ్యత అని గుర్తుచేస్తుంది. అనంతమైన ప్రేమ రూపాంతరం చెందుతూ మీ చేయి పట్టుకుని కొత్త లోకాల్లోకి తీసుకెళ్తుంది. కోల్పోయిన ప్రేమను తిరిగి పంచివ్వడంలో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఉత్సాహాన్నిస్తుంది అనంతమైన ప్రేమ. – పబ్లిషర్స్
| author name | Bhavani Chatharaju |
|---|---|
| Format | Paperback |





