-
-
Amma Dairylo Konni Pageelu
Amma Dairylo Konni Pageelu – This book orderd customers will get Rs. 30 CASH BACK OFFER
(APPLY FOR ONLY ADVANCE PAYMENT MADE TO PHONE PAY NUMBER 6281596253) -
Aadhunika Mahabharatham
“ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…
– పవన్ కళ్యాణ్
₹550.00Original price was: ₹550.00.₹450.00Current price is: ₹450.00. -
Vaktha (Telugu Edition)
మీరూ కావచ్చు ‘వక్త’
వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.₹200.00Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00. -
Gajula Sanchi
నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా’ అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ……
– మొహమ్మద్ గౌస్ -
Komuram Bheemu
ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు
-
Irani Cafe
మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య.. వీళ్లు లేకపోతే నేననేవాడిని ఒకడ్ని లేను కాబట్టి ఈ పూట వాళ్ల పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నాకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తు చేసుకుంటున్నాను.
2014 లో సాక్షి బిల్డింగ్ పదకొండో ఫ్లోర్ లో షరీఫ్ అన్నతో చాయ్ తాగుతూ, ఆయనకు నేను నా ‘కారు చెప్పిన కథ’ చెప్పకపోయి ఉంటే కూడా ఇవ్వాళ నేను కథలు రాస్తూనే ఉండేవాడిననే అనుకుంటా. ఆ రోజు మాత్రం నాకు ఆ కథ రాయమని బలవంత పెట్టిన షరీఫ్ అన్నను నా మొదటి గురువని చెప్పాలి.
కథ నాకు ఏదో దార్లో దొరకలేదనుకుంటాను. ఒకటి నేనైనా వెతుక్కుంటూ వెళ్లి దాన్ని పట్టుకొని ఉంటా. లేదా కథైనా వెంటబడి నన్ను ప్రేయసిని చేసుకుని ఉంటుంది. పదహారేళ్లప్పుడు ఒక కథ రాసింది బాగా గుర్తు. ఏదో నేను మర్చిపోయిన పత్రికలో అది అచ్చయింది కూడా! పన్నెండు నెలలు ఆ పత్రిక ఫ్రీగా మా ఇంటికొచ్చింది. ఆ తర్వాత ‘నాతో నేను’ అని ఒక ఆత్మకథ రాసుకున్నా. ఒక వయసొచ్చాక అది చదివి నవ్వుకొని చించి పారేశా.
– వి. మల్లికార్జున్ -
Gypsylu
పైరగాల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముందుకి సాగిపోయే సంచారులు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు. భారతదేశపు గదులియా లోహర్, ఆఫ్రికా పశువుల కాపరులు , అరేబియా ఎడారిలో జీవించే ఒంటెల కాపరులు, మధ్య ఆసియా కొండల్లో తిరిగే డ్రోక్ పా పశువుల కాపరులు, ధృవప్రాంతాల్లోని సంచారులు, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీలు లాంటి అస్థిరవాసుల జీవితాలను “తెలుగు వెలుగు” లోనికి తీసుకురావటానికి ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ “జిప్సీలు”.
-
Veyipadagalu Nedu Chadivithe
వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే…
‘కాలచక్రం’ అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను.
భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు.
విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల…………… -
Sanchari
గంగిరెద్దుల వారి జీవితాల ఆధారంగా ఒక అసమతుల్య సమాజాన్ని సమగ్రంగా చిత్రించిన నవల సంచారి
-
Mandu Chupu
ప్రస్తావన
గోదావరి గలగలా ప్రవహిస్తోంది. గోల్డ్క్ సిగరెట్ కాలుస్తున్న కవి కుమారునికి ఆ పొగ ఘుమఘుమగానే వున్నట్టుంది. గోదావరి గట్టు గచ్చు చప్టా మీద ఏడెనిమిదిమంది మిత్రులు కూర్చున్నారు. వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలుతోంది. వాళ్లు గోదావరి వంక చూస్తున్నారను కుంటే నీళ్లల్లో మందు పోసినట్టే. వాళ్ల కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి. ఓ పావు గంట గడిచింది.
‘శ్రీశ్రీ ఓ సినిమాలో అన్నట్టు… ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు’ అన్నాడు. కొటేషన్రావు. (అతని అసలు పేరు కోటేశ్వరరావు)…….. -
CHARITRADAARULLO
వేంకటేశ్వరునికి పరమభక్తుడై ఎన్నోసార్లు దర్శించి అనేక కైంకర్యాలు చేసి కవితాకన్యను కూడా సమర్పించిన కృష్ణదేవరాయలు విజయనగరంలో ఒక్క వేంకటేశ్వరాలయమైనా నిర్మించకపోవడం విచిత్రం.
జినభవనాలు(మఠాలు) కట్టించుట, జినసాధువుల పూజలు చేయుట, జైనమునులకు నచ్చిన భోజనములు పెట్టుటలో ఇతర జైనులెవ్వరూ జినవల్లభునితో సరిపోలజాలరు.దశావతారాలు శిష్టసాహిత్యం బాగా నాగరీకమైన తరువాత బలపడిన భావనలు. జానపద సాహిత్యంలోకి శిష్టసాహిత్యంనుండే దశావతారాలు వెళ్లాయి అని నా ఊహ.
ప్రపంచ వీరగాథ సాహిత్యచరిత్రలో పలనాటి వీరగాథ, కాటమరాజు కథ, బొబ్బిలియుద్ధం కథల వలన ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం ఏర్పడి వుంది. వీటిలో మొదటి రెండు పురాతనమైనవి. వాటితో పోలిస్తే బొబ్బిలి యుద్ధం, కథా ఆధునికమైనవే.
తెలివిడి అందినంతమేర చూస్తే రామదాసు పూర్వమైనా, సమకాలం లోనైనా, తరువాత చాలాకాలం వరకు రాముడే భజనకి ఆధారదైవం అనిపిస్తుంది.
మధురాష్టకం చాలా సుబోధక రచన. భారతీయులకు ఏభాష వారికైనా అర్థమవుతుంది. అది పేరుకి సంస్కృతరచనే అయినా, ఆ స్తోత్రంలోని పదాలు అన్ని భారతీయ భాషలలో సర్వసాధారణంగా వాడే పదజాలమే. -
Amerika Ammayi
హ్యాపీ నూతన సంవత్సరం
ఉద్యోగాల కోసం కొందరు, చదువుల కోసం కొందరు, ఇలా వారి వారి కలల వెంటపడి చేరుకునే గమ్యం ఒకటి ఉంది… అదే అమెరికా!
చిన్నతనంలో ఎంతో అబ్బురంగా, స్వర్గానికి మరోపేరుగా తలచిన దేశం. అక్కడి విశేషాలు, వస్తువులు, అక్కడి నుంచి వచ్చిన మనుషులూ, అందరూ ఎంతో గొప్పవారనీ, దేశంలో ఎంతటి పేరున్న గుడివారైనా పూర్ణకుంభంతో స్వాగతం పలికేటంత వి.వి.ఐ.పి.లు అనీ అనుకునే రోజుల నుండీ… ‘ఆ వదినా, మా పిల్లకి ఆవకాయ్ పట్టడానికి సాయానికి అమెరికా వెళ్తున్నాను. దార్లో మీ అబ్బాయికి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. ఇచ్చేసి వస్తాను’ అనే రోజుల్లోకి వచ్చేసాము. దూరం కొద్దీ విలువని అంచనా వేసే మనం, ఆ దూరం తగ్గిపోయేసరికి విలువనీ తగ్గించేస్తున్నామేమో?
ప్రపంచంలో అందరూ రెండే రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఉత్తములు అయితే మరొకళ్ళు అధములు. వీళ్ళు కాకుండా మరొక రకం ఉంది. అదే ‘మధ్యముల్’ అన్నమాట. పైన చెప్పిన రెండు రకాల వారి గురించి చర్చిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు మాత్రం అందరి సమస్యలు నెత్తిన వేస్కుని భూభారాన్ని మోసేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో ఫస్టు ఉండేవాళ్ళలో నేనొకదాన్ని. ఉద్యోగం వదిలేసి భర్త వెంట అమెరికావాసం వచ్చిన కాండిడేట్ని. వీసా సమస్యల వల్ల ఇంట్లో…………….. -
-
-
Life of Swami Vivekananda Set 2 Vols (Telugu)
₹150.00Original price was: ₹150.00.₹140.00Current price is: ₹140.00. -
-
Vanavasi
భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ‘పథేర్ పాంచాలీ’ నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతిభూషన్ బంధోపాధ్యాయ కలం నుంచి జాలు వారిన మరో అపురూప రచన ఇది. ‘పథేర్ పాంచాలీ’తో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచన పరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.
-
Vaidyudu Lenichota (Telugu)
వైద్యుడు లేని చోట
వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
₹300.00Original price was: ₹300.00.₹276.00Current price is: ₹276.00. -
-
-
Gelupu Sare. . . Batakadam Elaa?
‘గెలుపు సరే బతకడం ఎలా’ అనేది కెరీర్ గైడెన్స్ పేరిట వస్తున్నా రచనలు, ఉద్భోదిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్దతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్దతి ‘ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు’ అంటూనే ఎలా ఉండకూడదో, అలా ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటోందని కనిపించని వ్యంగ్యంతో రాసిన రచన ఇది. ఏ ప్రక్రియకీ వొంగనిది.
– కె. ఎన్. వై. పతంజలి
-
Idi Naa Godava
కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.
-
Ayn Rand Philosophy
ఫిలాసఫీ; ఎవరికి అవసరం?(మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)
నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?
మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.
మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.
‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………
-
-
Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu
నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
-ఏమి మౌరీన్.
-ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.
-
Manasu Gathine Marchina ‘Freud’
మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.
ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.
-
Mee Jeevitanni Marchukovadaniki Okka Nimisham Chalu
ఒక్క నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి
మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి సిద్దపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలు, మీకు అందిస్తున్నాడు.
ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?
ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలల వెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్ని సద్వినియోగం చెయ్యగల సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిముషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.
విజయం….
“అపురూపమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం, ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి, నీ శక్తీయుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడడం!”
ఛాయిస్ లు….
“నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్, చాన్సు కాదు!”
మొండిపట్టు….
“జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పాదు. మొండిపట్టు, ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కధ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలలు సాకారం కావడం చూడు.”
ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఇప్పుడు నిమిష నిమిషానికీ మార్చుకోగలరు. మీరు ఉన్నతులు కాగలరు. ఎక్కువ పనిచేయ్యగలరు. ఎక్కువ సంపాదించగలరు. ఎక్కువ ప్రేమించగలరు. ఎక్కువ నవ్వగలరు.’ – మార్క్ విక్టర్ హేన్సన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్ సహా రచయిత.
-
Meeku Merem Cheppukovali
మీ కలలను సాకారం చేసుకునే శక్తీ మీరు సృష్టించుకోగలరు.
ఈ రహస్యాలు తెలుసుకుని ….
మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,
మీకు మీరేం చెప్పుకోవాలి.
మీ దృక్పధాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.
* నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.
* నాలో ప్రతిభ, సామర్ద్యం, నైపుణ్యం అన్ని వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.
* ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.
* నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.
* నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనుక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.
-
-
Nenevvaru? Sriramaniyam
డా. ముదిగొండ వీరభద్రయ్య ఇంతకుముందు 60 సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను 2007 లో శ్రీ రమణాశ్రమంలో ఉండి రచించారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జ్ఞాన మననము, ఆత్మ శాస్త్రము, శ్రీ సత్యసాయి బోధనలు నేపథ్యంలో ‘అద్వైత జ్ఞాన ప్రకాశిక’ అన్న తత్త్వగ్రంథాలను (అన్నింటిని సత్యసాయి బుక్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ప్రచురించింది), భగవాన్ శ్రీ సత్యసాయి జీవిత మకరందం (బ్రౌన్ అకాడమీ ప్రచరణ) గ్రంథాన్నీ రచించారు.
ఇప్పుడు ఈ “నేనెవరు – శ్రీ రమణీయం” అన్న గ్రంథాన్ని రచించి భగవాన్ రమణుల మార్గాన్ని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక కోసం రచించినవి.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్ష పదవి నుంచి 2004 లో విరమించాక ప్రస్తుతం వీరు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో గౌరవ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు.
– ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
-
Runam
స్వచ్చమైన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో “ఋణం” అనే నామకరణం చేయడంలోనే ఈ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ ఈ “ఋణం” నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాదారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.
-
Viswa Karma
ప్రవేశిక
ప్రాయ ఇతి శబ్దేన దోషసంపాదనం చిత్త మితి |
శాస్త్ర ప్రతిషేధః తస్మా తాయ శ్చిత్తమిత్యాచ్యతే ॥
భావం: అంటే దోషసంపాదనమని, చిత్తం అంటే దాన్ని నివారించుకోవడమని అర్థం. ప్రాయశ్చిత్తమంటే దోషాన్ని నివారించుకోడానికి చేసే కార్యక్రమమని అర్థం.
* * *
అదో నాలుగు నిట్రాళ్ళ ఇల్లు. బయట ‘వరదానం, ఆయుర్వేదాచారి’ అనే బోర్డుంది. ఆ ఇంట్లోని వెనక పెద్ద గది వంటగది. ఓవైపు నేల మీద పొయ్యి. మరోవైపు ధాన్యం బస్తాలు. మధ్య గదిలో ఓవైపు ఉయ్యాలబల్ల. మరోవైపు అతిధులు వస్తే పరచటానికి నాలుగు చాపలు. ఆ ఇంట్లో మరో రెండు గదులున్నాయి. వాటిలో ఒకదాన్నిండా ఆయుర్వేద మందులు, చిన్న మేజా బల్ల, కుర్చీ, వచ్చిన రోగులు కూర్చోడానికో బల్ల ఉన్నాయి. ఇంకో గది ఎత్తైన పందిరిపట్టెమంచం గల పడకగది.
ఆ ఇంటి వెనకాల చాలా చెట్లున్నాయి. అవన్నీ ఔషధగుణాలు గల చెట్లే. నూతి గట్టు పక్కన స్నానానికి చుట్టూ దడి కట్టిన చిన్న పందిరి. దూరంగా వెనకో మరుగుదొడ్డి. ఆ ఇంటిముందో ఎడ్లబండి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు ఓ రోగిని చేతులు పట్టుకుని కిందకి దించారు. ఆయన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆ ఇంటి అరుగు మీద కళ్ళుమూసుకుని కూర్చున్న పండితయ్య ఆ రోగి వంక చూడలేదు. ఎనభై పైబడ్డ……………….
-
-
-
-
-
రోబో బుద్ధ
రాణి శివశంకరశర్మ కథలు
ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు. -
-
-
NUDI-NANUDI | నుడి-నానుడి
సంపాదకులు: జయధీర్ తిరుమల రావు
మతభావన ఆధిపత్య భవనాలే తప్ప భాషకి తత్వ శాస్త్రం ఉంటుందనే ఆలోచన చాలామందికి లేదు. మనకి విద్యాత్మక బాషా పండితులు. బాషా శాస్త్రవేత్తలు ఉన్నారే తప్ప బాషా తాత్వికులు లేరు. ఆ కొరత తెలుగా ఆంధ్రమా? రచయిత వాగరి వాగరి పేరు పెట్టుకున్న బి. స. బంగారయ్య గారు తీర్చారు.
ఇంటి పోకడ బడి పోకడ సమాజం పోకడలని బాషా దృక్పథంతో లోతుగా అర్థం చేసుకున్న ఏకైక రచయిత బంగారయ్య.
భార్యకు బదులు పెళ్ళాం భర్తకు బదులు మొగుడు రక్తము బదులు నెత్తురు స్తనం బదులు చన్ను అనే తెలుగు మాటలు వాడలేమా? సంస్కృత పదాలు వాడీ వాడీ అసలు సిసలు తెలుగు మాటలను మనం మరిచిపోతున్నాం. తెలుగు మాటలను నేటికీ చదువురాని గ్రామసీమల ప్రజలే వాడుతున్నారు. అలాంటి తెలుగు పలుకులు పండితులకి పామరులకు అనేకమందికి అర్ధమవుతుంటే దానిని పక్కన పెట్టడం ఎందుకు? ఇంత చిన్న విషయం గురించి పెద్ద పెద్ద పండితులు ఎందుకు ఆలోచించరు. ఇది ఈ పుస్తకంలో రచయిత ఆవేదన.
-
Maa Badi
బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.