-
-
-
-
-
-
Suputrika Praptirastu
సుపుత్రికా ప్రాప్తిరస్తు
“తిరుమల ఎందుకండీ”
అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.
“దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.
“ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.
మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.
“మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది
మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.
భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.
తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
నామిని ఇస్కూలు పుస్తకం
ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.
ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”
-
Karma
అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
-
Padileche Keratam
పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన సాగర్ ఘోష ఈ నవల। అంగవైకల్యంతో పాటు పేదరికంతో కూడా పోరాడి గెలిచిన సాగర్ తనలోని అంతర్ బహిర్ లోకాన్ని ఆవిష్కరిస్తూ, తన ఆంతరంగ కల్లోలాల్ని అక్షరబద్దం చేస్తూ రాసుకున్న ఆత్మ కథే “పడిలేచే కెరటం”। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో పోరాట పటిమను, స్ఫూర్తిని నింపే నవల ఇది।
అంగవైకల్యంతో బాధపడేవాళ్ళలో సున్నితంగా వ్యవహరించాలని తెల్సినా కొంతమంది , తెలియకుండా చాలామంది వాళ్ళని మానసికంగా హింస పెడుతుంటారు। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్సెన్సిటివ్ గా మారె దేశంలోనూ ఉండరేమో, వాళ్ళని తమ చూపుల్తో, మాటల్తో చేతలతోగాయాపారిచేవాళ్ళెందరో। చదువులేని జులాయి మనుషులు మాత్రమే వీళ్ళని ఎగతాళి చేసి బాధపెడతారనుకోవడం అపోహ మాత్రమే। ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా సంస్కారహీనంగా వాళ్ళని అవహేళన చేసి అవమానపరుస్తుంటారు। ” ఈ నవల హృదయంతో చదవండి। వాళ్ళ హృదయ ఘోష విన్పిస్తుంది। మీకళ్ళకు కొందరి జీవితాల్లో మనుషులు అనాలోచితంగానో, అహంకారంతోనో చేసే గాయాలు కన్పిస్తాయి।। -
-
-
-
-
Rayalaseemalo Aadhunika Saahityam
విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.