-
-
Smasanam Dunnaru
స్మశానం దున్నేరు
హరిజనుల మీద పెత్తనం చెలాయించినంత మాత్రాన తాము పెత్తందారులయి పోరు. పెత్తందారులకు తోట్టులుగానే మిగిలిపోతారు. తమ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తే తోత్తుల్ని కూడా వెంటాడి వేధిస్తారు అదే పెత్తందారులు. బి.సి. కులాల సహకారం తీసుకుంటూనే హరిజనుల్ని అణచివేసే భూస్వామ్యపు అహంకారం, స్వార్ధం, కుటిలవుహ్యంలోని ఎత్తుగడలు అర్ధమవుతాయి ఈ నవల చదివితే.
ముఖ్యం గా పీడిత కులాల్లోని అంతర్గత వైరుధ్యాల్ని తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా రెచ్చగొట్టడమనే పద్ధతి ఈనాటికీ కొనసాగడం వర్తమాన సామజిక,రాజకీయ పరిస్థితుల్ని గమనించినవారికి తేటతెల్లంగా కనిపిస్తుంది. అందుకే ‘స్మశానం దున్నేరు’ నవల కేవలం ఒక కధ మాత్రమే కాదు. ఒకనాటి జీవితాన్ని రికార్డు చేసిన నవల మాత్రమే కాదు, దానికి సామాజికపరమైన ప్రాసంగికత ఉంది.
…..గుడిపాటి -
-
Zero Number One
స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-
-
KGH Kathalu
కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను. -
-
-
-
That Last Melody
అది సాన్ జోస్ లోని వాలెన్ బర్గ్ పార్క్. ఉదయం ఏడున్నర అవుతోంది. ‘ బ్లాక్ ట్రాక్ సూట్ లో చేతికి స్మార్ట్ వాచ్, చెవుల్లో ఇయర్ బడ్స్ వాటర్ బాటిల్ పట్టుకుని జాగింగ్ చేస్తోంది సారా.
పాటలు వింటూ చుట్టూ గమనిస్తూ ప్రశాంతంగా తన ప్రపంచంలో తాను విహరిస్తోంది.
కనువిందు చేసే ఆ పచ్చదనాన్ని చూస్తూ, చెట్ల మీద కిలకిలమంటూ కచేరీ చేస్తున్న పక్షులని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ‘ఉడికించే చిలకమ్మా నన్నూరించే అనే లిరిక్స్ వినిపించింది చెవిలో.
అక్కడి తెల్ల పిల్లలు కొందరు హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆలాపించే’.
తన ముందు ఒక అమెరికన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ నడవడం గమనించింది. ‘ముత్యాల బంధాలే నీకందించే
వాళ్ళని చూడగానే ఏదో గుర్తొచ్చి కాస్త బాధ పడింది. ‘అచ్చట్లు ముచ్చట్లు.
ఆ ఆలోచనలతో నడక, పాట రెండూ ఆపింది. ఆ అమెరికన్ జంటను చూసి ఒకవైపు బాధ, మరోవైపు ఈర్ష్య, ఇంకో వైపు కోపం, ఇలా ఎన్నో భావాలు ఒక్కసారిగా కలిగాయి. వాళ్ళని దాటి జాగింగ్ చేస్తూ తనవైపుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. చూడ్డానికి ఇండియన్లా ఉన్నాడు. మరీ పొడవు కాదు, అతడి బరువుకు తగిన హైట్. చామనఛాయ రంగు. ఎర్లీ తర్టీస్లోలో ఉండి ఉండొచ్చు. జాగింగ్ సూట్లో, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు…………….. -