-
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
Zero Number One
స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-
Vayuputra Sapadam
చెడు విజ్ర్రంభించింది
ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!
శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో…. ఆ నీలకంఠ… తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!
ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!
మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?
ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!
‘అమిష్, తూర్పు పాలో కోయిలో ఆయే మార్గంలోనే పయనిస్తున్నాడు’ – బిజినెస్ వరల్డ్
‘అద్బుతమైన వర్ణనాత్మక శైలి’ – శశి ధరూర్
‘భయంకరమైన యాక్షన్ ప్రతి పేజీని ఉత్కంఠభరితంగా చదివేలా చేస్తుంది’ – అనిల్ ధర్కర్
-
Suputrika Praptirastu
సుపుత్రికా ప్రాప్తిరస్తు
“తిరుమల ఎందుకండీ”
అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.
“దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.
“ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.
మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.
“మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది
మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.
భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.
తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..
-
-
Ghost Murders
ఘోస్ట్ మర్డర్స్ !
రాత్రి పదిదాటింది. ఇంకా భర్త రాజారావు ఇంటికి రాలేదు. విమల పరుపుమీద పడుకొంది. గదిలో జీరో వాట్ బల్బ్ వెలుగుతోంది. ఆమెకు నిద్రపట్టడంలేదు. క్లబ్బులో కూర్చుని చీట్లపేక ఆడుతూ భర్త ఇంటిని మర్చిపోయి వుంటాడు!
ఏదో చప్పుడయింది. ఉలిక్కిపడుతూ ఆమె లేచి కూర్చుంది. లోపల గదుల్లోంచి ఏదో చప్పుడు వినపడుతోంది. బాత్రూమ్ పక్కనున్న స్టోర్ రూమ్లోంచి ఆ చప్పుడు వస్తోందని ఆమె ఊహించింది. స్టోర్ రూమ్లో ఎంతో తుక్కుంది. ఆ గదిని బాగుచేయడానికి ఆమెకు టైము చిక్కడంలేదు. అప్పుడే ఈ ఇంటికొచ్చి మూడేళ్ళు దాటింది.
పక్కనే మరో పరుపుమీద పడుకున్న కూతురివైపు ఆమె చూసింది. సుందరి గాఢ నిద్రలోవుంది. ఆమె వయస్సు పదేళ్ళుంటుంది. విమల మళ్ళా పరుపుమీద వాలింది. ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి పక్క ఇంట్లోంచి.
విమల ఆలోచిస్తోంది పక్కఇంట్లో ఎవ్వరూలేరు. ఇంటికి తాళంవేసి వుంటుంది. పదేళ్ళక్రితం ఎవరో అడ్వకేట్ అందులో వుండేవాడు. కొడుకు చనిపోయాక అడ్వకేట్ భార్యతోసహా కాశీకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దికాలానికి కూతురుకూడా మరణించింది. ఇదంతా ఊళ్ళోవాళ్ళు చెప్తూంటే విమల విన్నది. ఆమెకు బియ్యం అమ్మే మీరయ్య జ్ఞప్తికొచ్చాడు.
ఆ వీధిలో వాళ్ళందరికీ గత ఇరవై ఏళ్ళగా మీరయ్య బియ్యం అమ్ముతున్నాడు. అతడికి అందరిచరిత్రా తెలుసు.
“విమలమ్మగారూ, పక్కింట్లో అడ్వకేట్ మూర్తి వుండేవారు. మంచి ప్రాక్టీస్. ఆయనకూతురు డాక్టర్ చలంగార్ని పెళ్ళాడింది. కాని ఆమె చనిపోయింది. కొడుకు శేఖర్ ఈ ఇంట్లోవుండే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెపేరు పార్వతి. పార్వతి చాలా అందంగా వుండేది. పార్వతి ప్రేమ ఫలించలేదు. శేఖర్ చనిపోయాడు. పార్వతి తల్లీ తండ్రి ఈ ఇల్లువిడిచి వెళ్ళిపోయారు,” అన్నాడు మీరయ్య ఒకసారి………………..
-
Raaga Saadhika
స్వర్గ నరకముల ఛాయా దేహళి
చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.
చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.
ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.
ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.
ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.
మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.
ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.
మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..
-
-
Shikari
శికారి
కొట్లాట కొంచెం తెరిపిచ్చె.
‘నానా’కు సారాయి మత్తు దిగిందో. ఎక్కిందో తెలేదు. సుంకులమ్మ కట్ట మీద కాల్లు బారజాపుకొని కూచోనుండాడు. కె.సి. కెనాలుకు వొక వారెంబడి కొట్టాలు, మట్టిమిద్దెలు ఉండాయి. వాటిల్లో ఉండే ఆడోల్లు, మొగోల్లు తాగినకాడికి తాగినారు.
అరిసినకాడికి అరుసుకుండారు.
గేరి మొగదాల రోడ్డువారగ, రెండు మూడు సాట్ల కొంతమంది ఆడోల్లు సారాయి అమ్ముకుంటా ఉండారు. సన్న సన్న క్యాన్లల్లో, సీసాల్లో సారాయి పోసుకుని కాలువ మీదేసిన రాళ్ల కింద సందుల్లో దాపెట్టినారు. అయిదు రూపాయలకు చిన్న లోటా, పది రూపాయలకు పెద్ద లోటా లెక్కన పోసిస్తుంటారు. దావన బోయేటోలను కూడా తాగేకి రామ్మని పిలుస్తా ఉండారు.
తాగనీక వచ్చినోల్లు అరుసుకుంటా, గప్పాలు కొడతా ఉండారు.
కెనాలు గట్టు మీద నుండి బంగారుపేట మెయిను రోడ్డు దాక సారాయి వాసన గాల్లో తేల్తా ఉంది. అది మామూలు సారాయి వాసన గాదు. ఏదేదో కలిసి కుళ్లి మురిగిపోయిన వాసన. ఆడంతా సుళ్లు తిరుగుతుండాది.
అంతలో ముందు నానా కూతురు ‘గుడ్ల’ బొంగురు గొంతు పెట్టుకోని శికారి గేరంతా ఏకం జేసింది. ‘డొక్కోని’ మీదికిపోయి బండబూతులు తిట్టింది. కీకరక అరిసి మీదబడి కొట్టింది.
ఆ టయాన ఆమె తాగిందో లేదో గాని, అప్పటికే తాగినోల్లు రయ్యరయ్య సుంకులమ్మ కట్ట మీదికి వచ్చినారు.
డొక్కో సంగతి మ చెప్పనీక లేదు.
వాడు కుండ ఉన్నది ఎవరైనా యా పొద్దయినా చూసి ఉంటే గదా.
పెళ్లాం మీదికి బాణం పోయినట్లే పోయినాడు. జుట్టుపట్టుకోని కిందపడనూకి కొట్టినాడు. గుమి ఎట్ల లేచెనో గాని లేచె. ఒక్క దొబ్బు దొబ్బితే డొక్కోడు యిరుసుకోని ఆంత దూరాన పోయి పడ్నాడు……….
-
-
Gulamgiri
భారతదేశంలో కులం గురించిన సిద్దాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తోలి దార్శనికుడు జ్యోతిరావు ఫులే. (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని అయన కోరుకున్నారు. ఫులే ఆలోచనలకీ, విశ్లేషణకీ ‘గులాంగిరీ’ అడ్డం పడుతుంది.1873 లో మొదటి సరిగా ప్రచురించబడిన ఈ పుస్తకం ఇప్పటికి ఆదరణ పొందుతూనే ఉంది.
ఈ పుస్తకం అంతా జ్యోతిరావు ఫులే, దోండిబా( వాసుదేవ్ ఖుంబార్) మధ్య సంవాదం లా సాగుతుంది.
ఏ రోజునైతే మనిషి బానిసగా మారిపోతాడో, ఆ రోజునే అతడి సద్గుణాల్లో సగభాగం నశిస్తుంది.
– హొమర్
-
Tejo Tungabhadra By Vasudendra , Ranganadha Ramachandrarao
అర్ధరాత్రి సమయంలో తేజోనది ప్రవాహించే సవ్వడి తప్ప ఇతర సవ్వడులు లిస్బన్ నగరంలో అంతగా వినిపించవు. కొంచెం చెవులు రిక్కించి వింటే దూరంలో సముద్రపు ఘోష మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తుంది. మౌనసరోవరంలో రాయి విసిరినట్టు గంటకొకసారి తప్పనిసరిగా అంతఃపురం గంట సమయం సూచించటానికి చప్పుడు చేస్తుంది. వయసుదాటినవారు ఆ గంట చప్పుడుకు పక్కకు దొర్లుతారు. పిన్నవాళ్ళకు మెలకువ కూడా రాదు. సంవత్సరం నిండిన పసిబిడ్డలు ఒక్కోసారి ఆకలితో మేల్కొని ఏడుస్తారు. తల్లి స్తనం దొరకగానే మిన్నకుండిపోతారు. అంతఃపురంలోని కొన్ని కాగడాలు తప్ప వీధి దీపాలు ఎప్పుడో ఆరిపోయివుంటాయి.
అదొక వానాకాలపు రోజు. సాయంత్రమంతా వాన కురిసి, మొత్తం నగరాన్నంతా తడిపింది. ఆ వర్షానికి బయటికెక్కడికీ వెళ్ళలేని జనం భోజనం చేసి, పీకలదాకా వైన్ తాగి, తొందరగా నిద్రలోకి జారిపోయారు. అంతఃపురం గంట పన్నెండుసార్లు చప్పుడు చేసి ఇంకా పదిహేను నిముషాలు కూడా కాలేదు. ఆ సమయంలో అంతఃపురం వంటింటి కట్టడం వెనుక భాగం నుంచి, ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం పిల్లిలా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. ఆ ఆకారం అటూ ఇటూ చూస్తూ, ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకుంటూ అంతఃపురం ప్రహరీగోడవైపుకు నడవసాగింది. పొడవాటి గుడ్డలో ఏదో మూట కట్టుకుని, దాన్ని నడుముకు చుట్టుకుంది. అప్పుడప్పుడు దాన్ని ముట్టి చూసుకుంటూ………………..
-
-
-
-
-
-
-
-
-