-
-
-
-
-
Gulamgiri
భారతదేశంలో కులం గురించిన సిద్దాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తోలి దార్శనికుడు జ్యోతిరావు ఫులే. (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని అయన కోరుకున్నారు. ఫులే ఆలోచనలకీ, విశ్లేషణకీ ‘గులాంగిరీ’ అడ్డం పడుతుంది.1873 లో మొదటి సరిగా ప్రచురించబడిన ఈ పుస్తకం ఇప్పటికి ఆదరణ పొందుతూనే ఉంది.
ఈ పుస్తకం అంతా జ్యోతిరావు ఫులే, దోండిబా( వాసుదేవ్ ఖుంబార్) మధ్య సంవాదం లా సాగుతుంది.
ఏ రోజునైతే మనిషి బానిసగా మారిపోతాడో, ఆ రోజునే అతడి సద్గుణాల్లో సగభాగం నశిస్తుంది.
– హొమర్
-
Raaga Saadhika
స్వర్గ నరకముల ఛాయా దేహళి
చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.
చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.
ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.
ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.
ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.
మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.
ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.
మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..
-
-
-
Grahantaravasi
భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. -
-
Chivari Gudesa
చివరి గుడిసె
యదార్ధమైన చేనులో ఎలుకల నుండి కాపాడటానికి మనణియానికి ఏ యానాది అవసరమయ్యాడో అదే యానాది బైరాగి ఆత్మిక క్షేత్రాన్ని కామక్రోధాలనే ఎలుకలు పది కొల్ల గొట్టటానికి కారణమయ్యాడు. వాస్తవ సన్నివేశము, ప్రతీకా ఇంత అద్బుతంగా కలగలిసిన రచనలు ఎంతో అరుదుగా కనిపిస్తాయి.
– వాడ్రేవు చినవీరభద్రుడు.
యానాది కులవృతి చేసుకుని బతికిన పాత తరానికి మన్నుగాడు చివరి ప్రతినిధి అయితే, పొట్టకూటికి మట్టి పని చేసుకొని బతికే కొత్త తరానికి చిన్నోడు మొదటి ప్రతినిధి అవుతాడు. అయితే కులం చిన్నోడిని అక్కడా వెంటాడుతుంది.
– అంబటి సురేంద్ర రాజు -
Kathala Godari
వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. -