-
-
Tholi Gayam
₹189.00బస్ స్టాప్ పిల్లలంటే ఎంత ప్రేమో! వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి
అందరూ వెళ్ళిపోతారు. కానీ వాళ్లు మళ్ళీ తిరిగి స్కూల్ నుండి వచ్చే వరకు బస్ స్టాప్ మాత్రం అక్కడే ఒంటరిగా, వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. అది వాళ్లతో మాట్లాడటానికి ఏరోజూ ప్రయత్నించదు, కానీ వాళ్ల మాటలు మాత్రం ఎంతో ఓపికగా, ప్రేమగా వింటుంది. ఆ ముద్దుముద్దు మాటలకు, వాళ్లకి వినపడకుండా నవ్వుతుంది కూడా. పాపం… సాయంత్రం బస్ తిరిగి వచ్చాక అయినా వాళ్లతో కొంతసేపు గడపాలని, రోజంతా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ పిల్లలు బస్ దిగాక, ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వకుండా, చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఏదేమైనా, ఎన్నిసార్లైనా… మరో రోజుకోసం ఎదురు చూడటమే తనకి తెలిసిన ప్రేమ.
బస్ స్టాప్ ఎప్పటిలాగే, ఈరోజూ కూడా పిల్లల మాటలు వినాలని రోడ్ వైపు చూస్తూ ఎదురుచూస్తుంది. పిల్లల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం, బస్ వచ్చేవరకు పక్కవారితో తమ పిల్లలకు ఎంత విలాసవంతమైన జీవితం ఇస్తున్నామో అనే పోటీల్లో నిమగ్నమయ్యి, అప్పుడప్పుడు రోడ్ వైపు బస్ కోసం చూస్తున్నారు. అలా చూసినప్పుడే, రావలసిన సమయానికి బస్ రాలేదని చిరాకుపడుతూ, మళ్లీ తమ పోటీల్లో మునిగిపోతున్నారు.
-
-
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
₹200.00“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
నామిని ఇస్కూలు పుస్తకం
₹200.00ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.
ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”
-
Karma
₹200.00అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
-
-
-
-
-
Robin Hood by Veturi
₹200.00చిలిపి చిన్నరి చికిలి పిట్టల
పలుకు జిలిబిలి పాటలో
అడవి గాలులు సుడిసి వచ్చే
వడులలో సవ్వడులలో
వినిపించు వీనులవిందుగా – రా
బినుల పాట పసందుగా
చోరుడైనా-వీరుడూ నగ
ధీరుడూ సముదారుడూ –
అయిన రాబిన్ అమరగాథలు
కదుపుల గిట్ట కుదుపుల
దుసికిలిన కెంధూళులూ.
-
Nee Premalo Munigaka
₹210.00అహంకారం . ఈ ఒక్క ఎక్కడి అహంకారం మనిషిని ఎక్కడి వరకైనా తెసుకువెళ్ళగలదు. ఎదుటి వాడి మీద గెలవాలి అనే అహంకారం, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి, పిచ్చోడిలా మార్చగలదు. నేను చేసేదే కరెక్ట్, నేను మాత్రమే తెలివిగలవాడిని, అందరి మీదా నేనే గెలవాలి అనే అహంకారం ఉన్న మనిషి ఎప్పటికి గెలవలేడు, ప్రశాంతంగా బ్రతకలేడు.
వర్షాకాలం కనుక ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉంది. సమయం ఉదయం ఆరవుతున్నా చలి వలన కలిగిన బద్దకంతో అనుకుంట హైదరాబాద్ నగరం అంతా నిద్ర మత్తులోనే ఉంది. కొందరు ఆఫీస్‌కి టైమ్ అవుతుందని తప్పక దుప్పటి తీసి బలవంతంగా లేస్తున్నారు. కొందరు ఇంకాసేపు ఆగి గుద్దాంలే అని, తమకి తామే సర్దిచెప్పుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. శుక్రవారం అందునా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా కావడంతో, కొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ వర్షం, చలిని లెక్కచేయకుండా పూజలు చేసి, లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేయాల్సిందే, అని పట్టు వదలకుండా లేచి తల స్నానాలు మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
జూబ్లీహిల్స్ పక్కన ఉన్న బస్తీలో ఒక చిన్న మూడు అంతస్తుల భవనం ఉంది. చెప్పుకోవడానికి మూడంతస్తుల భవనమే, కాని ఒక్కో అంతస్తులో ఇరికించి కట్టిన సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాని గోడలు పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం వలన ఆ మూడవ అంతస్తు పైన ఉన్న స్లాబ్ మధ్యలో ఉన్న సన్నని రంధ్రం గుండా కారుతున్న వర్షం నీరు, ఇంటి హాల్ నడి మధ్యలో పెట్టి ఉన్న పాత గిన్నెలో పడుతూ ఉంది. ఆ గిన్నెలో కారే ఒకో చినుకు టక్టాక్ మంటూ…..
-
Rayalaseemalo Aadhunika Saahityam
₹225.00విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
-
పల్నాడు కథలు
₹225.00తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ ‘పల్నాడు కథలు’ సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.
-
-
-
-
-
Banavathi
₹250.00ప్రవేశిక
ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, ‘త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి’ అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.
అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?
పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.
ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం……….
-
-
-
-
-

















































