-
-
Christu Charitra (Gurram Jashuva Rachanalu)
₹100.00పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
‘క్రీస్తు చరిత్ర’ (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.
క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగి చెప్పారు.
రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు.మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. కాని దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పర విరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.
-
Regadivittulu
₹250.00రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.
మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.
ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.