Andhamaina Viplavam

Rs.300.00

In stock

SKU: PEAP001 Category: Tag:
Author: Pro V Srinivasa Chakravarti

ఇటలీలో కళాచంద్రోదయం

ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది.

కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది.

అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం.

ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది?

ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. – తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,…………

 

Author

Pro V Srinivasa Chakravarti

Format

Paperback