NEW RELEASES

  • Spartacus

    200.00
  • Karma

    అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
    వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
    200.00
  • No thumb

    Buttabomma

    200.00
  • Nalo Unna Prema

    200.00
  • Maa Badi

    బడిపై నాకలవడిన భక్తిరసమే ప్రధానంగా, విద్యార్థి జీవిత స్మృతులు నింపే ఆనందమే నిధానంగా, నాట్యకళాభిమానమే ఆసరాగా, నా అనుభూతులను నివేదించా. తదాశ్రమ దినాలుస్మృతిపథంలోకి వస్తే, తీగకు లేజిగురుదయించినట్టు, మనసు పునర్వికాసం చెందే, సౌరభ్యం సంస్కారవాసనలు ఉడుగని సహృదయ సంపన్నులు పఠీత్రులోకంలో గుప్పెడున్నా, వారే నాకు పదికోట్లు. వారివారి వృత్త్యుద్యోగవిహిత కృత్యనిర్వహణానంతర సమయాల్లో, వారికీ బాలవ్యాసాంగం, ఏ పదినిమిషాల పాటు, విశ్రామ సమయ పఠనోపయుక్తమైనా నాయీ కృషి సత్ప్రయోజనకారి అయినట్టే భావిస్తా. మరి విద్యాజగత్తులో, ఏ పదిమంది విద్యార్థులకీ రచన, క్రమనిష్టాభినివేశ చిత్తత, సోదర విద్యార్థుల పట్ల సహృద్భావం, ఆచార్యుల పట్ల సద్వినయ సౌశీల్యం, బడిపట్ల భక్తీప్రపత్తులు ఉద్భోధించగల్గిన నేను సార్థకజనుణ్ణి అయితినని సంతసిస్తా.

    220.00
  • Rayalaseemalo Aadhunika Saahityam

    విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
    225.00
  • పల్నాడు కథలు

    తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ ‘పల్నాడు కథలు’ సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.

    225.00
  • Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu

      నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                                                                            -ఏమి మౌరీన్.

                                                                                            -ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.

    225.00
  • Meka Bathuku

    225.00
  • Banavathi

    ప్రవేశిక

    ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, ‘త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి’ అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.

    అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?

    పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.

    ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం……….

    250.00
  • Visalandhramu

    250.00
  • Runam

    స్వచ్చమైన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో “ఋణం” అనే నామకరణం చేయడంలోనే ఈ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ ఈ “ఋణం” నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాదారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.

    250.00
  • Ayn Rand Philosophy

    ఫిలాసఫీ; ఎవరికి అవసరం?

     

    (మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)

    నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?

    మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.

    మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.

    ‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………

    250.00
  • Ded End

    250.00
  • Komuram Bheemu

    ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ కొమురం భీము నవల ‘దండకారణ్య పర్స్‌పెక్టివ్’లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ. – వరవరరావు

    250.00
  • Karma Vipakam

    270.00
  • Kotha Katha 2024

    275.00
  • -8%

    Vaidyudu Lenichota (Telugu)

    వైద్యుడు లేని చోట
    వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
    అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
    సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
    నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
    సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
    పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.
    ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
    పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.
    సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్‌, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
    Original price was: ₹300.00.Current price is: ₹276.00.
  • Evariki Cheppaka

    280.00
  • Dakkali Jaambapuraanam (Telugu)

    భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ ,
     తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ
     మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
    280.00
  • -3%

    పుల్లంపేట జరీచీర

    “శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం.”
    – మల్లాది రామకృష్ణ శాస్త్రి.
    “అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు”
    – పిలకా గణపతి శాస్త్రి.
     “సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు”
    – విశ్వనాధ సత్యనారాయణ.
     “ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు.”
    – కొడవటిగంటి కుటుంబరావు.
    “శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును.”
    – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
    “భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు – సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా ‘వడ్లగింజలు’ రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు.”
    – ఉషశ్రీ.
    వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు.
    శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన – రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు.
    వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. ‘ప్రబుద్దాంద్ర పత్రిక’ను చాలాకాలం నిర్వహించారు.
    వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ – ఖద్దరు – హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ.
    తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.
    Original price was: ₹300.00.Current price is: ₹290.00.
  • Jeevana Laalasa

    విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా

    సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో

    నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.

    విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.

    ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….

    ఎన్. వేణుగోపాల్

    300.00
  • Bhramana Kaanksha

    పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.

    ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.

    – అత్తలూరి నరసింహరావు

    300.00
  • Viswa Karma

    ప్రవేశిక

         ప్రాయ ఇతి శబ్దేన దోషసంపాదనం చిత్త మితి |

         శాస్త్ర ప్రతిషేధః తస్మా తాయ శ్చిత్తమిత్యాచ్యతే ॥

    భావం: అంటే దోషసంపాదనమని, చిత్తం అంటే దాన్ని నివారించుకోవడమని అర్థం. ప్రాయశ్చిత్తమంటే దోషాన్ని నివారించుకోడానికి చేసే కార్యక్రమమని అర్థం.

    * * *

    అదో నాలుగు నిట్రాళ్ళ ఇల్లు. బయట ‘వరదానం, ఆయుర్వేదాచారి’ అనే బోర్డుంది. ఆ ఇంట్లోని వెనక పెద్ద గది వంటగది. ఓవైపు నేల మీద పొయ్యి. మరోవైపు ధాన్యం బస్తాలు. మధ్య గదిలో ఓవైపు ఉయ్యాలబల్ల. మరోవైపు అతిధులు వస్తే పరచటానికి నాలుగు చాపలు. ఆ ఇంట్లో మరో రెండు గదులున్నాయి. వాటిలో ఒకదాన్నిండా ఆయుర్వేద మందులు, చిన్న మేజా బల్ల, కుర్చీ, వచ్చిన రోగులు కూర్చోడానికో బల్ల ఉన్నాయి. ఇంకో గది ఎత్తైన పందిరిపట్టెమంచం గల పడకగది.

    ఆ ఇంటి వెనకాల చాలా చెట్లున్నాయి. అవన్నీ ఔషధగుణాలు గల చెట్లే. నూతి గట్టు పక్కన స్నానానికి చుట్టూ దడి కట్టిన చిన్న పందిరి. దూరంగా వెనకో మరుగుదొడ్డి. ఆ ఇంటిముందో ఎడ్లబండి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు ఓ రోగిని చేతులు పట్టుకుని కిందకి దించారు. ఆయన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఆ ఇంటి అరుగు మీద కళ్ళుమూసుకుని కూర్చున్న పండితయ్య ఆ రోగి వంక చూడలేదు. ఎనభై పైబడ్డ……………….

    300.00
  • Vayuputra Sapadam

    చెడు విజ్ర్రంభించింది

    ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!

    శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో…. ఆ నీలకంఠ… తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!

    ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!

    మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?

    ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!

    ‘అమిష్, తూర్పు పాలో కోయిలో ఆయే మార్గంలోనే పయనిస్తున్నాడు’ – బిజినెస్ వరల్డ్

    ‘అద్బుతమైన వర్ణనాత్మక శైలి’ – శశి ధరూర్

    ‘భయంకరమైన యాక్షన్ ప్రతి పేజీని ఉత్కంఠభరితంగా చదివేలా చేస్తుంది’ – అనిల్ ధర్కర్

    325.00
  • Niyam Puram

    325.00
  • Maha Swetha Devi

    చోళీకే పీచే

    అనువాదం: కలేకూరి ప్రసాద్

    ‘అక్కడేముంది?’ అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు – ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు – హత్యలు – లాకప్లో చిత్రహింసలు వగైరా… వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం… చోళీకే పీఛే – రవికె మాటున….

    జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి – అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి ‘ఆత్మ’పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.

    ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ – కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా ‘ఖల్నాయక్ ‘ కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది……………..

    350.00
  • Enduku Tho Modalu

    ఉపోద్ఘాతం

    ‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి

    నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ ‘ఎందుకు’ ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.

    ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. ‘ఎందుకు’ కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది………….

    399.00
  • Sachin Tendulkar- Playing It My Way

    సచిన్ టెండూల్కర్

    ప్లేయింగ్ ఇట్ మై వే – నా ఆత్మ కధ

    ఏ ఆత్మ కధా కూడా రచయిత జీవితంలో ప్రతీ వివరాన్ని ముందుంచలేదని నాకు అనిపించింది. అది సాధ్యం కాదు. ఎదో ఒక కారణం వల్ల రాయటానికి వీల్లేని వ్యక్తిగతమైన లేదా బహుశా సున్నితమైన అంశాలు ఉంటాయి. అయినా ఇప్పటి వరకు నేను నా కెరియర్ ని ఒక పూర్తి కధకు దగ్గరగా ఉండేలా చేయటానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. నేను వర్ణించిన చాలా సంఘటనలు క్రికెట్ అభిమానులకు తెలిసినవే కానీ నేను ఇది వరకు అందరి ముందు చెప్పని ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. వాటిల్లో కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా ఉన్నాయి, పాటకులకు ఆసక్తి కలిగించేవి ఎన్నో దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.

    – సచిన్ టెండూల్కర్

    ముంబయిలో పుట్టిన సచిన్ టెండూల్కర్ 1989 లో 16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లో తొలిసారిగా తన టెస్ట్ ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత అపురూపమైన, మనోరంజనం కలిగించే బ్యాట్స్ మన్ లలో ఒకరు, టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు రెండింటిలో కూడా వేరే ఇతర క్రీడాకారుడి కంటే ఆయన ఎక్కువ పరుగులు మరియు ఎక్కువ సెంచరీలు చేసి విజయం సాధించారు. ఆయన తన 17వ ఏట తోలి టెస్ట్ సెంచరీ చేశారు. 36వ ఏట ఆయన వన్డే డబుల్ సెంచరీ చేసిన తోలి క్రీడాకారుడుగా మారారు. 2012 లో తన 100వ అంతర్జాతీయ సెంచరీనీ సాధించారు. 2009 లో ఆయన భారత్ తో ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నత స్థానానికి చేరుకొని 2011 లో ప్రపంచ కప్పు గెలుచుకున్నారు. 2013 లో తన స్వస్థలం ముంబయి ప్రజల ముందు తన 200వ మరియు చివరి టెస్ట్ ఆడిన తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమించారు.

    495.00
  • Adugaduguna Tirugubatu

    నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

    నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………

    499.00