-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
That Last Melody
అది సాన్ జోస్ లోని వాలెన్ బర్గ్ పార్క్. ఉదయం ఏడున్నర అవుతోంది. ‘ బ్లాక్ ట్రాక్ సూట్ లో చేతికి స్మార్ట్ వాచ్, చెవుల్లో ఇయర్ బడ్స్ వాటర్ బాటిల్ పట్టుకుని జాగింగ్ చేస్తోంది సారా.
పాటలు వింటూ చుట్టూ గమనిస్తూ ప్రశాంతంగా తన ప్రపంచంలో తాను విహరిస్తోంది.
కనువిందు చేసే ఆ పచ్చదనాన్ని చూస్తూ, చెట్ల మీద కిలకిలమంటూ కచేరీ చేస్తున్న పక్షులని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ‘ఉడికించే చిలకమ్మా నన్నూరించే అనే లిరిక్స్ వినిపించింది చెవిలో.
అక్కడి తెల్ల పిల్లలు కొందరు హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆలాపించే’.
తన ముందు ఒక అమెరికన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ నడవడం గమనించింది. ‘ముత్యాల బంధాలే నీకందించే
వాళ్ళని చూడగానే ఏదో గుర్తొచ్చి కాస్త బాధ పడింది. ‘అచ్చట్లు ముచ్చట్లు.
ఆ ఆలోచనలతో నడక, పాట రెండూ ఆపింది. ఆ అమెరికన్ జంటను చూసి ఒకవైపు బాధ, మరోవైపు ఈర్ష్య, ఇంకో వైపు కోపం, ఇలా ఎన్నో భావాలు ఒక్కసారిగా కలిగాయి. వాళ్ళని దాటి జాగింగ్ చేస్తూ తనవైపుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. చూడ్డానికి ఇండియన్లా ఉన్నాడు. మరీ పొడవు కాదు, అతడి బరువుకు తగిన హైట్. చామనఛాయ రంగు. ఎర్లీ తర్టీస్లోలో ఉండి ఉండొచ్చు. జాగింగ్ సూట్లో, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు…………….. -
-
-
-
-
Kathala Godari
వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. -
-
-
-
Karma
అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్ధమవుతుంది.”
వంకీల జుత్తు, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్దముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఏడు ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సైజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలు బలిష్టుడని చాటు తున్నాయి.
-
-
పుల్లంపేట జరీచీర
“శ్రీపాదవారి కధలు విని వుండకపొతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కధలు చదివి ఆనందించే అదృష్టం.”
– మల్లాది రామకృష్ణ శాస్త్రి.
“అచ్చమైన వ్యావహారికాంద్రం వ్రాసిన వారిలో ప్రధమ గణ్యులు శ్రీపాద వారు”
– పిలకా గణపతి శాస్త్రి.
“సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రధమ గణనీయులు”
– విశ్వనాధ సత్యనారాయణ.
“ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు, ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు.”
– కొడవటిగంటి కుటుంబరావు.
“శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో బెట్టి కళ కట్టించును.”
– మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
“భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు – సుబ్రహ్మణ్యశాస్త్రి. ఏ సహ్రుదయున్నైనా తెలుగు బాషలో తెలుగు కధ రాసిన ఖ్యాతి ఎవరికీ దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా ‘వడ్లగింజలు’ రాసిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు.”
– ఉషశ్రీ.
వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు.
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్యరచనలు, నాటకాలు, రూపికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన – రచనలు, అనువాదాలు, వైద్యగ్రంధాలు కూడా రాశారు.
వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవి సింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారు పేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు. ‘ప్రబుద్దాంద్ర పత్రిక’ను చాలాకాలం నిర్వహించారు.
వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. గాంధీ – ఖద్దరు – హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తీ.
తెలుగు కధకులలో కనకాభిషేక గౌరవం (1956)లో అందుకున్న ప్రధములు.
-
Sir Thomas Munro
రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.
సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.
తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.
– రావినూతల శ్రీరాములు
-