తెలుగు భాషా పద నిఘంటువులు చాలా వచ్చాయి. వాటిలో కావ్యభాషకు పదజాలమే ఎక్కువగా లభిస్తుంది. ప్రత్యేక నిఘంటువులద్వారా, పదకోశాలద్వారా – పరిభాషా పదాలకూ, ప్రత్యేక పదాలకూ, వృత్తి పదాలకూ, పదబంధాలకూ అర్థాలు కూడా లభిస్తాయి. ఇలాంటి వాటిలో నానార్థ పదకోశాలు, పర్యాయపద పదకోశాలు, మాండలిక నిఘంటువులు, మాండలిక వృత్తి పదకోశాలు, పత్రికాభాషా పదకోశాలు చేరతాయి. ఈ పదకోశం ఆధునిక ప్రమాణ రూపాలను మాత్రమే గ్రహించింది. అంతేకాదు ఇతర నిఘంటువులలో సులభంగా లభ్యంకాని పర్షో అరబిక్ పదాలు, ఆంగ్ల పదాలు కొన్ని ఇందులో లభిస్తాయి. సమాచార రంగంలో వ్యాప్తిలో వున్న మరికొన్ని పదాలను కూడా చేర్చాము. ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే. ఇంకా ప్రసార సాధనాల్లో నలిగిన చాలా అన్య దేశ్యాలనూ, సృజనాత్మక భాషలో కనిపించే మరెన్నో మాండలిక పదాలనూ నిఘంటువులలో మనం చేర్చుకోవలసిన అవసరం ఎంతో వుంది.
ఈ వాడుకతెలుగు పదకోశంలో దాదాపు 20,000 పదాలు ఉన్నాయి. తెలుగు భాషాభిమానుల సూచనలను అనుసరించి మలి ముద్రణలో ఈనాటి అవసరాలకు తగినట్లుగా మరిన్ని పదాలను ఈ కోశంలో చేర్చడానికి ప్రయత్నిస్తామని సవినయంగా మనవి. మా ఈ తొలి ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ….
– ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
Reviews
There are no reviews yet.