‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని, ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరిచి వారి ఏలుబడిలో ఉండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాకా స్వతంత్ర పాలనగా ఉండేది. అలాంటి పాలెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’ గా పిలువబడే వ్యక్తి, ఒక సామూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి.
కుంఫీణీ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షస కబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో వారిపై 1846 లోనే విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు. చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహరెడ్డి సహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.
Palegadu
₹120.00
In stock
Format | Paperback |
---|---|
Deliveried | 4 – 9 DAYS |
Author | V Azeez |
Reviews
There are no reviews yet.