Swarajyaspurthi @ 75

Rs.300.00

In stock

SKU: VELUGU001 Category: Tag:
Author: Rami Naidu

                                                                                  గరిమెళ్ళని ఎందుకు విస్మరించాం?

                                                                                                                                                                                             జయధీర్ తిరుమలరావు

 

తెలుగు సాహిత్య విమర్శకులు స్వాతంత్ర్య పోరాట సాహిత్యానికి

అన్యాయం చేశారు.

ఆధునిక చరిత్ర విభాగంలో దానికి తగిన స్థానం ఇచ్చినా ఆ సాహిత్యం మాత్రం అస్పృశ్యమైంది. వేలాది సృజనాత్మక సాహిత్యగ్రంథాలు (గేయాలు, నాటకాలు, హరికథలు ఇత్యాది) వెలువడినా ఒక సాహిత్య పాయగా దాన్ని గుర్తించ నిరాకరించారు.

అందుకే మద్దూరి సుబ్బారెడ్డి లాంటి వారు కొద్దిమంది జాతీయోద్యమ సాహిత్యంపై ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు. కాని ప్రధాన స్రవంతి సాహిత్య విమర్శకులు ప్రత్యేకించి గుర్తించడానికి సుముఖంగా లేరు.

ఈకారణంవల్ల గరిమెళ్ళ లాంటి కవులకి అన్యాయం జరిగింది. ఒక వర్గం గరిమెళ్ళని చూసీ చూడనట్లుండగా మరో వర్గం అతణ్ణి గుర్తించి పెద్ద పీట వేశారు. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ ఒక మైలురాయి గేయంగా కలకాలం నిలిచిపోతుంది.

గురజాడ తరువాత చెప్పుకోతగిన ‘కవి’ ఆ కోవలో గరిమెళ్ళ గురజాడ సృజనాత్మక రచయితే కాని గరిమెళ్ళ సాహిత్య సామాజిక విమర్శకుడు కూడా!………….

Author Name

Rami Naidu

Format

Paperback