-
-
Sir Thomas Munro
₹40.00రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.
సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.
తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.
– రావినూతల శ్రీరాములు
-
-
-
-
Grahantaravasi
₹100.00భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. -
మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే
₹650.00ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!
పదండి చరిత్రలోతుల్లోకి… పదండి తోసుకు!
మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!
ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.
మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.
సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.
పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.
ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.
మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.
-
KGH Kathalu
₹150.00కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను. -
పల్నాడు కథలు
₹225.00తెలుగునాట పల్నాడు సీమకు ఒక ప్రత్యేకత వుంది. తనదైన ఒక వీర చరిత్ర వుంది. పల్నాటి నేల పచ్చి వాసనను పట్టి చూపే ప్రయత్నంగా రచయిత్రి సుజాత వేల్పూరి రాసిన కథలే ఈ ‘పల్నాడు కథలు’ సంకలనం. చదివితే కచ్చితంగా పల్నాటి గడ్డపైన తిరుగాడిన అనుభవాన్ని ఇచ్చే కథలివి.
-
-
Rayalaseemalo Aadhunika Saahityam
₹225.00విద్వాన్ విశ్వం గారన్నట్టు రాయలసీమ సాహిత్యంలో “శుకపిక శారికావ రుచుల్ వినిపించవు”. అందులో ఆత్మాశ్రయ వాదాలకూ, ఆత్మాన్వేషణా సిద్ధాంతాలకూ చోటు లేదు.రాయలసీమ సాహిత్యం రాయలసీమ బతుకు నీడ.రాయలసీమ సాహిత్యం అలా ఎందుకుందో అర్థం కావాలంటే రాయలసీమ జీవితం ఎందుకు అలా ఉందో తెలియాలి. దాని చలన సూత్రాలను వెదికి పట్టుకొని జీవితాన్ని, సాహిత్యాన్ని సమన్వయం చేయాలి. అలాంటి అరుదైన ప్రయత్నమే ఈ గ్రంథం. ఇది సుదీర్ఘ అధ్యయన ఫలితం.
-
-
-
-
Bhramana Kaanksha
₹300.00పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.
ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.
– అత్తలూరి నరసింహరావు
-
Jeevana Laalasa
₹300.00విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా
సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో
నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.
విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.
ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….
ఎన్. వేణుగోపాల్
-
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
₹200.00“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
Zero Number One
₹150.00స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-
Suputrika Praptirastu
₹200.00సుపుత్రికా ప్రాప్తిరస్తు
“తిరుమల ఎందుకండీ”
అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.
“దేవుడు ఉండేచోటు కదండీ…” మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. “అప్పుడే మొదలెట్టారా” అంది.
“ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు” అన్నాడు పొయెటిగ్గా.
మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.
“మొండిఘటం…”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది
మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?” అంది.
భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి “అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా…” అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.
తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో “బ్యాగు చాలడం లేదండీ” అంది……..

















































