-
Bhramana Kaanksha
పాదయాత్ర మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. కొత్త పద్ధతిలో వాస్తవాల్ని చెప్పేందుకు అదొక సాధనం. ఆత్మవ్యక్తీకరణకు అపరిమితమైన అవకాశాల్ని కల్పించేది పాదయాత్ర. ఇది జీవితపు తాజాదనాన్ని అనుభవించటానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆలోచనల్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల భావవ్యక్తీకరణ పడునేక్కుతుంది. ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది.
ఈ ఆసక్తి నుంచే ఆదినారాయణ బయలుదేరి పాదయాత్రలు చేశారు. తన అనుభవాల్ని మూడు భిన్నమైన పేర్లతో, ఆకర్షణీయమైన ఉప శీర్షికలతో పుస్తకాలుగా రాశారు. అన్నిటినీ కలిపి అర్ధవంతంగా ‘భ్రమణ కాంక్ష’ అనే పేరు పెట్టారు. ఏ పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేసిందీ, దానికి సంబంధించిన ముందుమాటలతో, ఆ యాత్రా మార్గాల చిత్రణలతో, ఆయా సందర్భాలకి సరిపోయే స్వీయ చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం ఆదినారాయణ ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తుంది.
– అత్తలూరి నరసింహరావు
-
Jeevana Laalasa
విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా
సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో
నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.
విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.
ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….
ఎన్. వేణుగోపాల్
-
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
Zero Number One
స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-