-
Sir Thomas Munro
₹40.00రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.
సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.
తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.
– రావినూతల శ్రీరాములు
-
-
-
-
Grahantaravasi
₹100.00భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. -
-
Kathala Godari
₹120.00వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు. -
-
Zero Number One
₹150.00స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే టైమైంది. పిల్లలందరూ ఒక పెద్ద హాల్లో కుచ్చోని తింటాన్నారు. అందరూ మాట్లాడుకుంట, జోకులేస్కుంట, నవ్వుకుంట తింటాన్నారు. భలే సందడిగా ఉంది హాలంతా. ఒక పిల్లోడు అందరికంటే లేటుగా ఆ హాల్లోకి వచ్చినాడు. అంతే, అందరూ సైలెంటైపోయినారు. అప్పటిదాకా ఉన్నే జోకులు, నవ్వులు యాటికి పోయినాయో! అందరూ చానా కోపంగా చూస్తాన్నారు ఆ పిల్లోని పక్క. ఉన్నెట్లుండి అందరూ గట్టిగట్టిగా అరిచేది మొదులు పెట్టినారు. ఆ పిల్లోనికి భయమైంది. ఒకతూరి వాల్లందరి తుక్కు చూసి వాళ్ళ మధ్యలో నుండే నడుచుకుంటా పోయి గోడ వార కుచ్చున్యాడు. వాళ్ళు అరిచేది మాత్రం ఆగల్యా. వాళ్ళందరూ ఏమని అరుస్తాన్నారో అర్థం కావడం లేదు గానీ, ఆ అరుపులు మాత్రం చానా ఎక్కువయినాయి. అవేం పట్టించుకోకుండా అన్నం తినేకి చూస్తాన్నాడు ఆ పిల్లోడు.
అయినా చేతకావడం ల్యా. వాళ్ళ అరుపులు చెవుల్లో నుండి లోపలికి పోయి డబులు, త్రిబులు సౌండు చేస్తాన్నాయి. రెండు చేతులు చెవులకి అడ్డం పెట్టుకున్యాడు. అప్పటికే లోపలికి పొయినే అరుపులు లోపలంతా తిరుగుతున్నాయి. తలకాయి పేలిపోతాదేమో అన్నంత నొప్పి మొదలయింది. ఇంగ ఇట్ల కాదని క్యారీ బాక్సు ఆడే వదిలేసి లేసి ఒకసారి గట్టిగా అరిచి పరిగెత్తినాడు. పక్కన ఎవరున్నారు, దారిలో………………..
-
-
-
-
That Last Melody
₹175.00అది సాన్ జోస్ లోని వాలెన్ బర్గ్ పార్క్. ఉదయం ఏడున్నర అవుతోంది. ‘ బ్లాక్ ట్రాక్ సూట్ లో చేతికి స్మార్ట్ వాచ్, చెవుల్లో ఇయర్ బడ్స్ వాటర్ బాటిల్ పట్టుకుని జాగింగ్ చేస్తోంది సారా.
పాటలు వింటూ చుట్టూ గమనిస్తూ ప్రశాంతంగా తన ప్రపంచంలో తాను విహరిస్తోంది.
కనువిందు చేసే ఆ పచ్చదనాన్ని చూస్తూ, చెట్ల మీద కిలకిలమంటూ కచేరీ చేస్తున్న పక్షులని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ‘ఉడికించే చిలకమ్మా నన్నూరించే అనే లిరిక్స్ వినిపించింది చెవిలో.
అక్కడి తెల్ల పిల్లలు కొందరు హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆలాపించే’.
తన ముందు ఒక అమెరికన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ నడవడం గమనించింది. ‘ముత్యాల బంధాలే నీకందించే
వాళ్ళని చూడగానే ఏదో గుర్తొచ్చి కాస్త బాధ పడింది. ‘అచ్చట్లు ముచ్చట్లు.
ఆ ఆలోచనలతో నడక, పాట రెండూ ఆపింది. ఆ అమెరికన్ జంటను చూసి ఒకవైపు బాధ, మరోవైపు ఈర్ష్య, ఇంకో వైపు కోపం, ఇలా ఎన్నో భావాలు ఒక్కసారిగా కలిగాయి. వాళ్ళని దాటి జాగింగ్ చేస్తూ తనవైపుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. చూడ్డానికి ఇండియన్లా ఉన్నాడు. మరీ పొడవు కాదు, అతడి బరువుకు తగిన హైట్. చామనఛాయ రంగు. ఎర్లీ తర్టీస్లోలో ఉండి ఉండొచ్చు. జాగింగ్ సూట్లో, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు…………….. -
-
-
-
-
-
-
-
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
₹200.00“వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”
“ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”
“సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”
“తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “
-
నామిని ఇస్కూలు పుస్తకం
₹200.00ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.
ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”