-
-
-
Periyar Reader
₹200.00పెరియార్ జీవిత సంగ్రహం
1879 సెప్టెంబర్ 17 : – చిన్న తాయమ్మాళ్, వెంకట నాయకర్ దంపతులకు రెండవ సంతానంగా ‘ఈ రోడ్’లో ఇ.వి. రామస్వామి జన్మించారు. వెంకట నాయకర్ సంపన్న వ్యాపారి. వారిది సంప్రదాయ వైష్ణవ కుటుంబం.
1885 (ఆరేళ్ళ వయసు) : – ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభం
1889 పదేళ్ళ వయస్సు : – ప్రాథమిక విద్య పూర్తయింది.
1891 (12 ఏళ్ళు) : – అతను తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు.
1895 ; – తన తల్లిదండ్రులు ఆతిథ్యమిస్తున్న వైష్ణవ గురువులు చెప్పే పురాణ ప్రవచనాలను అతను శ్రద్ధగా వింటూ, వాటిలోని వైరుధ్యాలనూ, అసంబంధతనూ ఆ లేత వయసులోనే ప్రశ్నించేవాడు. హేతువాదం, నాస్తికత అతని మనసులో పొడచూపాయి.
1898 ; – అతను నాగమ్మాన్ని వివాహమాడాడు. అతను ఆమెను మార్చి ఆమెలో హేతువాద భావనలు నాటేడు.
1900 : – అతనికి ఒక ఆడపిల్ల పుట్టి అయిదు నెలల వయసులో మరణించింది. తరువాత అతనికి సంతానం లేదు.
1904 : – తండ్రి మందలించిన కారణంగా అతను సంసార జీవితాన్ని విడిచిపెట్టాడు. ముందు అతను
విజయవాడ వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాదు, అక్కడ నుంచి కోల్కత్తా వెళ్ళాడు.
చివరకు అతను గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి బ్రాహ్మణ సత్రాలలో అతనికి ఉచిత భోజనం దొరకలేదు. రోజుల తరబడి పస్తులున్న రామస్వామి “యజ్ఞోపవీతం” ధరించి బ్రాహ్మణ వేషంలో సత్రంలో ప్రవేశించ ప్రయత్నించాడు. కానీ అతని మీసం అతనికి అడ్డుగా మారింది. కావలివాడు రోడ్డు మీదకు తోసేసాడు. అదే సమయంలో భోజనాలు ముగియడంతో సత్రంలోంచి ఎంగిలాకులను వీధిలోకి విసిరేసారు. గత కొన్ని రోజులుగా తిండి లేక పస్తులున్న రామస్వామి ఆకలికి తాళలేక వీధి కుక్కలతో కలిసి ఎంగిలాకులలోని తిండి తిన్నాడు. అలా తింటూ పైకి చూసిన అతనికి సత్రం ప్రవేశ ద్వారం కనిపించింది. ఆ సత్రాన్ని సంపన్నుడైన ద్రావిడ………..
-
-
-
Viswa Darshanam
₹249.001 ఉపోద్ఘాతం
శ్రీ రాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నప్పటి ఆయన విద్యాభ్యాసం పూర్తి అయింది. దేశాలన్నీ తిరిగి, పుణ్యక్షేత్రాలన్నీ సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు.
మరలి వచ్చిన నాటి నుంచి శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు.
రాముడి దిగులు చూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు “ఏమీలేదు నాన్నగారూ!” అనడం తప్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా కారణం చెప్పలేదు. దశరథుడికి భయం వేసింది. కులగురువైన వశిష్ఠుడికి కబురు పెట్టాడు. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి……………….
-
-
-
Grahantaravasi
₹100.00భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. -
మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే
₹650.00ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!
పదండి చరిత్రలోతుల్లోకి… పదండి తోసుకు!
మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!
ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.
మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.
సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.
పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.
ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.
మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.
-
-
Gaddi Parakatho Viplavam
₹200.00దక్షిణ జపానులోని షికోకు దీవిలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు. మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. యోకోహామా లో కస్టమ్స్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందను కొంటున్న సమయం లో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడిం చాయి. 25 ఏళ్ళ ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది. మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పల్లెకు చేరాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులు, పురుగుల మందులూ, కలుపునాశిని మందులూ, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు. ప్రకృతిని సాధ్యమయి నంతగా అనుసరిస్తూ ‘ఏమీ చెయ్యనవసరం లేని’ వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు. అతను అవలంబించిన పద్దతుల పల్ల నేల ఏ ఏటికాపడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు పొందుతున్నాడు. తన అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడు.
ఆహార సంస్కృతి గురించి, ప్రకృతి జీవనం గురించి ఇందులో వివరించాడు. ఇది జపనీస్ భాషలో 1975లో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది. వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ, మధ్య విడదీయరాని సంబంధం ఉందని ఫుకుఓకా విశ్వాసం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ‘దేశికోత్తమ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.
-
Oka Hijra Atma Katha
₹130.00ఈ పుస్తకాన్ని పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది కానీ ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేదోక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది.
తన లింగ మార్పిడి శస్త్రచికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్ గురించైనా! జెందర్ గురించీ, పురుషాధిక్యత గురించి ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చెయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది.
-యోగిందర్ సికండ్,కౌంటర్ కరెంట్స్
-
Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
₹400.0018 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 “ఫిజియాలజి అఫ్ టెస్ట్” పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.
ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.
సిగరెట్లు, తాగుతూ “మానివేసి మనం జీవించగలుగుతామా” అని భయపడతారు. ఒకసారి మానేశాక “ఇంతకాలం ఎందుకు తాగామా” అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.
-
Maranam By Sadhguru
₹300.00మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే
కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి
మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .
మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే
అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు
ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే
అనుకోండి… అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ
ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన
కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?
మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం
గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి
విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక
అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన
మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి
మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,
మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా
మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన
విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,
పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క
మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ
చదవవలసిన పుస్తకం ఇది, -
Decoding the Leader By Dr Peddi Rama Rao
₹150.00గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్
రాజమౌళికి కోటి రూపాయలిచ్చి సినిమా తీయమన్నా
మనుకోండి! మిమ్మల్ని ఎగాదిగా చూసి కత్తిలాంటి ఒక
కొత్త ఆయుధం తయారు చేయించటానికి కూడా ఈ కోటి
సరిపోవూ అంటాడు.ఆయన ఊహాశక్తికి తగ్గ స్థాయిలో సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలో ఆయనకు కూడా తెలియదు. తన ఊహాశక్తికి తగ్గట్టుగా ఆయన తీస్తూ పోతే, ప్రొడ్యూసర్ కూడా అట్లానే డబ్బులు పెడుతూపోవాలి. చంద్రబాబుగారు కూడా అంతే! తన ఊహాశక్తికి తగ్గ స్థాయిలోనే ఏ పనైనా జరగాలని తపన పడతారు.
అప్పటికింకా అమరావతి శంకుస్థాపన కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనప సామాను కింద వేలం వేసి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే గూగులమ్మనడిగితే హావ్ లాక్ బ్రిడ్జ్ పొడవు మూడు కిలోమీటర్లని, గోదావరి నది మీద అటు కొవ్వూరునీ, ఇటు…………..
-
-
Ade Nela By Mukunda Rama Rao
₹600.00అనువాద కళని ఆపోసన పట్టిన రామారావు,. యిప్పుడు “అదే నెల” ద్వారా భారతదేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాల్ని, వాటి చారిత్రక నేపథ్యంలో సహా, మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలిలో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి , దాదాపు మూడు వేల మంది కవుల్ని యూ గ్రంధం ద్వారా అయన పరిచయం చేస్తున్నారు. ఏడూ వందలకు పైగా కవితల్ని అనువదించి, దేశంలోని భిన్న జాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే, వాటిమధ్య ఐక్యత కోసం ఒక వారధిని నిర్మిస్తున్నారు. ప్రాంతం, జాతి, భాష యేదైనా దేశంలోని లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి, కాశ్మిరం నుంచి కన్య కుమారి వరకూ, భిన్నకాలాల్లో వెల్లివిరిసిన భారతీయకవిత్వం దోహదపడుతుందని, వైవిధ్యమే యూ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, “అదే నెల” గ్రంధం మరోసారి నిరూపిస్తుంది.
-ముకుంద రామారావు.
-