-
-
-
-
Mahabharatham By D Srinivasa Dikshitulu
₹126.00వేదవ్యాస మహర్షి
మహాభారతమ్
ఆదిపర్వం
శౌనక మహర్షి నైమిశారణ్యంలో సత్ర యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని చూడటానికి చాలామంది మహర్షులు వచ్చారు. సూత వంశానికి చెందిన ఉగ్రశ్రవుడు కూడా వచ్చాడు.
పురాణ కథల్ని వీనుల విందుగా చెప్పటంలో సూతుడు దిట్ట. నైమిశంలోని మహర్షులు సూతునికి అతిథి సత్కారాలు చేశారు. దర్భలతో నేసిన చాపమీద సూతుడు కూర్చున్నాడు. శౌనకుడు మొదలైన మహర్షులు ఆయన చుట్టూ చేరారు. ఎక్కడి నుంచి వస్తున్నావని సూతుని అడిగారు.
“మహర్షులారా ! పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. ఆయన చేసిన సర్ప యాగానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వ్యాసుడు రాసిన భారతంలోని కథల్ని వైశంపాయనుడు చెప్పగా విన్నాను” అన్నాడు సూత మహాముని.
“అయితే… ఆ మహాభారత కథనే మాకూ వినిపించు” అన్నారు మహర్షులు…………………..
-
Sri Devi Bhagavatam By D Srinivasa Dikshitulu
₹126.00వేదవ్యాస మహర్షి శ్రీ దేవీ భాగవతమ్
ప్రథమ స్కంధం
వినండి… చెబుతాను!
బ్రహ్మదేవుని ఆదేశానుసారం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, సకల పురాణవేత్త అయిన సూత మహాముని ఆ పవిత్ర ప్రదేశానికి వచ్చాడు.
మహర్షులందరూ ఆ మహాత్మునికి భక్తిశ్రద్ధలతో అతిథిసత్కారాలు చేశారు. సూతుడు దర్భలతో చేసిన చాప మీద కూర్చున్నాడు.
“సూత మహామునీ ! నువ్వు పురాణాలన్నీ చదివి గురువు అనుగ్రహంతో వాటిలోని రహస్యాలన్నింటినీ చక్కగా ఆకళింపు చేసుకున్నావు. అందుకే నువ్వు చెప్పే పురాణకథల్ని వింటుంటే శ్రోతల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందరూ నిన్ను ఆదరంగా ‘రోమహర్షణుడు’ అని పిలవటానికి కారణం అదే.
మహాత్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కలియుగ కల్మషాలన్నింటినీ కడిగేసే శ్రీ దేవీ భాగవతాన్ని నువ్వు మాకు చెబితే వినాలని కుతూహలంగా ఉంది” అన్నారు శౌనకాది మహర్షులు……………….
-